ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే కుమారుడి హిట్​ అండ్​ రన్ కేసు - ఒక్కడిని తప్పించబోయి, 15 మంది నిందితులుగా!

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 9:56 AM IST

EX MLA Shakeel Case Update : ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్. ఎవరైనా నిర్లక్ష్యంగా లేదా ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తే అతనిపై పోలీసులు ప్రయోగించే చట్టం. ఇలాంటి ఓ చిన్న కేసులో ఇరుక్కుని ఇద్దరు ఇన్​స్పెక్టర్లు అరెస్ట్ అవ్వడం, మరో 13కు పైగా కేసులు నమోదవడం, నిందితులు విదేశాలకు పారిపోవడం, పోలీసులు లుక్ అవుట్ నోటిసులు జారీ చేయడంతో కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో పోలీస్​ స్టేషన్​ మొత్తం ప్రక్షాళన చేయాల్సి రావడం పోలీసు శాఖకు అపకీర్తిని మూటకట్టింది. అసలు ఏం జరిగిందంటే?

CI Arrest in EX MLA Shakeel Son Case
EX MLA Shakeel Case Update

EX MLA Shakeel Case Update : పంజాగుట్ట పోలీస్​ స్టేషన్ పరిధిలోని ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో నిందితుల సంఖ్య 15కి చేరింది. తాజాగా ఇటీవల అరెస్ట్ అయిన మాజీ ఇన్​స్పెక్టర్ దుర్గారావు పరారీలో ఉండటానికి సహకరించిన ఇద్దరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. డిసెంబర్ 23 తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రజాభవన్ సమీపంలో అతివేగంగా దూసుకెళ్లిన కారు ట్రాఫిక్‌ డివైడర్, బారికేడ్లను ఢీకొట్టింది. కారు నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తి, బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్​గా పోలీసులు గుర్తించారు.

ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసు - మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై లుక్ అవుట్‌ నోటీసులు

Car Accident at Praja Bhavan : ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న పంజాగుట్ట(Panjagutta Road Accident) ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు ఘటనా స్థలానికి వెళ్లారు. కేసులో కారు నడిపిన రాహిల్​ను తప్పించి అతని స్థానంలో షకీల్ వద్ద డ్రైవర్​గా పని చేసే అబ్దుల్ ఆసిఫ్​ను ఉంచి అతన్ని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిని తప్పించిన ఇన్​స్పెక్టర్ దుర్గారావు సహా ఇందుకు కారణమైన రాహిల్ తండ్రి షకీల్, ఇతరలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం 15 మందిపై కేసులు నమోదయ్యాయి. కేవలం రాహిల్ ఒక్కడిని తప్పించేందుకు యత్నించి, వీరంతా కేసులో నిందితులు అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు కేసులో హైకోర్టు కీలక తీర్పు

CI Arrest in EX MLA Shakeel Son Case : మరోవైపు కేసులో నిందితుల చిట్టాను పోలీసులు బహిర్గతం చేశారు. ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసులో ఏ1గా రాహిల్ అలియాస్ సాహిల్ దుబాయ్​లో ఉన్నాడు. అతని స్థానంలో డ్రైవర్​గా అరెస్ట్ అయిన అబ్దుల్ ఆసిఫ్​ను ఏ2గా చేర్చారు. రాహిల్ తండ్రి మాజీ ఎమ్మెల్యే షకీల్​ను కేసులో ఏ3గా చేర్చారు. రాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన షకీల్ బంధువు సాహద్ అలియాస్ జుబ్బా భాయ్​ని ఏ4గా, మరో బంధువు సయ్యద్ జకియా రెహమాన్​ను ఏ5గా చేర్చారు. ప్రస్తుతం డ్రైవర్ మినహా వీరంతా దుబాయ్​లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారికి లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు.

ప్రజాభవన్ కారు ఘటన - మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ఎలా తప్పించారంటే?

Hit and Run Case Details : ప్రమాదం జరిగిన రాత్రి సాహిల్ స్థానంలో తన డ్రైవర్​ను పెట్టేందుకు సహకరించిన అస్లాం, ఖలీల్, అర్బాలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి పంజాగుట్ట ఇన్​స్పెక్టర్ దుర్గారావును(CI Durga Rao Arrest) కేసులో ఏ11గా చేర్చి ఆరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన రోజు రాహిల్​కు అనుకూలంగా దుర్గారావుకు ఫోన్‌లో మంతనాలు జరిపిన బోధన్ మాజీ ఇన్​స్పెక్టర్ ప్రేమ్‌ కుమార్, బోధన్​లో షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను అరెస్ట్ చేశారు. కాగా వారం రోజులుగా పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్​స్పెక్టర్ దుర్గారావుకు సహకరించిన హనుమాన్ అలియాస్​ నాని, వెంకటేశ్వరావులను కేసులో నిందితులుగా చేర్చారు.

7 Members Arrest in Sahil Case : మొత్తం ఈ కేసులో ఏడుగురు అరెస్ట్ కాగా, మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేవలం ఒక్క నిందితుడిని తప్పించే క్రమంలో ఇంత మంది నిందితులుగా చేరి, అరెస్ట్​లు చేయడం ఇదే మొదటిసారి. ఈ వ్యవహారంతో అపకీర్తి పాలైన పోలీసు శాఖ, గతంలో దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్​ స్టేషన్​గా నిలిచిన పంజాగుట్టలో 85 మందిని బదిలీ చేసి ప్రక్షాళన చేయడం కూడా ఇదే తొలిసారి.

మాజీ ఎమ్మెల్యే షకీల్​ కుమారుడి హిట్​ అండ్​ రన్​ కేసులో మరో ట్విస్ట్ ​- అదుపులోకి బోధన్ సీఐతో పాటు మరో వ్యక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.