ETV Bharat / state

భూమి ఉన్నా ధరణిలో నమోదు కాలేదు : గుమ్మడి నర్సయ్య

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 3:07 PM IST

Ex MLA Gummadi Dharani Issues : రాష్ట్రంలో ధరణి బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఇదే జాబితాలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూడా చేరారు. భూమి ఉన్నా ధరణిలో నమోదు కాక తాను ఇబ్బందులు పడుతున్నానని గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యతో సాగు చేసుకుంటున్న భూమికి బ్యాంకు రుణం, రైతుబంధు వంటి ప్రయోజనాలు అందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Dharani Committee Members Meeting With Collectors
Dharani Portal Issues

Ex MLA Gummadi Dharani Issues : రాష్ట్రంలో ధరణి బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఇదే జాబితాలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూడా చేరారు. భూమి ఉన్నా ధరణిలో నమోదు కాక తాను ఇబ్బందులు పడుతున్నానని గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యతో సాగు చేసుకుంటున్న భూమికి బ్యాంకు రుణం, రైతుబంధు వంటి ప్రయోజనాలు అందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల క్రితం కొన్న భూమిని గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకున్నా నమోదు కాలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారులను సంప్రదించినా ఎలాంటి ప్రయోజనం లేదని వెల్లడించారు.

ధరణి పోర్టల్​ను కొనసాగిస్తారా? లేదా? - స్పష్టత ఇవ్వండి : హైకోర్టు

" ఏళ్ల క్రితం ఎకరం ఎనిమిది వేలు పెట్టి తన కుమారుడి పేరు మీద సాదా బైనాతో కొన్న రెండు ఎకరాల భూమిని కొన్నాను. ఈ భూమిని ధరణి పోర్టల్‌లో నమోదు చేసుకున్నానమోదు కాలేదు. దీనిపై ఎమ్మార్వో,కలెక్టర్,రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు చేసిన అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఈ సమస్యతో సాగు చేసుకుంటున్న భూమికి బ్యాంకు రుణం, రైతుబంధు వంటి ప్రయోజనాలు రావట్లేదు.తక్షణమే ప్రభుత్వం పట్టించుకొని భూమిని ధరణిలో నమోదు చేయాలి" - గుమ్మడి నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే

Dharani Committee Members Meeting With Collectors : ధరణి సమస్యలపై అధ్యయనం చేస్తున్న కమిటీ ఇవాళ 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. ఇప్పటికే మూడు దపాలు సమావేశమైన కమిటీ అనేక అంశాలపై ఆరా తీసింది. అయితే త్వరలో మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వ పథకాల అమలుకు ఇబ్బందులు లేకుండా చూడాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమై పలు అంశాలపై చర్చించనుంది.

ధరణి పోర్టల్‌పై సమగ్ర నివేదిక కోసం రెవెన్యూ శాఖ కసరత్తు

Dharani Portal in Telangana : ధరణి సమస్యలపై మరింత సమాచారం కోసం సిద్దిపేట, వరంగల్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో కమిటీ సమావేశం కానుంది. ధరణి వెబ్‌ సైట్‌ను అందుబాటులోకి తెచ్చిన తరువాత ఉత్పన్నమవుతున్న సమస్యలు, వాటిని ఏవిధంగా పరిష్కరించొచ్చు, తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలో విచారించాల్సిన అంశాలు ఏవైనా ఉన్నాయా అనే విషయాలపై చర్చించనున్నారు. గతంలో నిజామాబాద్‌లో జరిగిన భూభారతి ఫైలెట్‌ ప్రాజెక్టు తాజా పరిస్థితిపై ఆ జిల్లా కలెక్టర్‌తో చర్చించనున్నారు.

ధరణిపై ఈ నెల 11న పూర్తి సమాచారం ఇస్తాం : కోదండ రెడ్డి

ధరణి అవకవతవకలపై కమిటీ - పోర్టల్‌ పునర్నిర్మాణ బాధ్యతల అప్పగింత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.