ETV Bharat / state

అనంతపురం పోటీలో దూసుకుపోతున్న టీడీపీ- పాలనపై వ్యతిరేకతతో వెనుకబడిన వైసీపీ - Neck And Neck Fight in Anantapur

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 6:21 PM IST

TDP YCP Victory Chances in Anantapur
TDP YCP Victory Chances in Anantapur

TDP YCP Victory Chances in Anantapur: అనంతపురం జిల్లా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీ పాలనలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగ్గడి అక్కడే అన్నట్లు తయారు కావడంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఎన్నికల వేళ అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి నేతలు భారీగా వలస రావడంతో టీడీపీ అభ్యర్థుల విజయ అవకాశాలు మెరుగు అవుతున్నాయి. ఈ ఐదు సంవత్సరాలలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు దోపిడికే ప్రాధాన్యం ఇచ్చారే తప్పా, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదు. అనంతపురం తాజా రాజకీయ పరిస్థితులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

TDP YCP Victory Chances in Anantapur: అనంతపురం పార్లమెంటు పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అత్యంత రాజకీయ అనుభవం ఉన్న నేతలు, వైసీపీ, టీడీపీల నుంచి ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో నిలిచారు. ఈ పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా, 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా ఉన్నప్పటికీ, ఉరవకొండలో టీడీపీ గెలుపు బావుటా ఎగురవేసింది. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారంతా ప్రకృతి వనరులను దోచుకున్నవారు కొందరైతే, భూ దందాలు చేసి ఓటేసి గెలిపించిన ప్రజలను పీడితులుగా చేసిన వారు మరికొందరు.

అనంతపురం ఎంపీ స్థానం బరిలో ఈసారి తెలుగుదేశం నుంచి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణకు కేటాయించారు. వైసీపీ నుంచి కురబ సామాజిక వర్గానికి చెందిన మాలగుండ్ల శంకరనారాయణను బరిలోకి దింపారు. 2019లో గెలిచిన వైసీపీ ఎంపీ రంగయ్య ఐదేళ్లుగా అనంతపురానికి చేసిందేమీ లేదని ప్రజల అభిప్రాయం. పెనుకొండ ఎమ్మెల్యేగా, కొంతకాలం మంత్రి పదవిలో తీవ్ర వ్యతిరేకత ఉన్న శంకరనారాయణకు,అనంతపురం MP ఎంపీ టికెట్‌ ఖరారు చేశారు. అందరివాడిగా పేరున్న అంబికా లక్ష్మీనారాయణకు, అవినీతి ఆరోపణలున్న శంకరనారాయణకు మధ్య పోటీ నెలకొంది. వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అభివృద్ధి లో వైఫల్యం కారణంగా తన గెలుపు తథ్యమని టీడీపీ అభ్యర్థి చెబుతున్నారు.

అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో అనంతపురం అసెంబ్లీ స్థానం అత్యంత కీలకమైనది. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో చాలా వరకు విద్యావంతులైన ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. 2.78 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇంతటి కీలక నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మరోసారి ఎమ్మెల్యే బరిలో నిలిచారు. గత ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన వెంకటరామిరెడ్డి ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా నగరానికి డంప్ యార్డు, భూగర్భ డ్రైనేజీ సమస్య తీరుస్తామని హామీ ఇచ్చి విఫలమయ్యారు. టీడీపీ నుంచి మాజీ ఎంపీపీ దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ బరిలో నిలిచారు. పారిశ్రామికవేత్త అయిన ప్రసాద్‌కు ఎంపీపీగా మంచి గుర్తింపు, అభివృద్ధి చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. అధికారపార్టీ ఎమ్మెల్యే వైఫల్యాలే తన గెలుపును సులభతరం చేస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉరవకొండ రాజకీయంగా మరో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం. టీడీపీ నుంచి నాలుగోసారి పయ్యావుల కేశవ్ బరిలోకి దిగారు. వరుస హ్యాట్రిక్‌లు కొట్టిన కేశవ్‌కు ఈసారి గెలుపు నల్లేరుమీద నడకలా మారనుంది. వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న విశ్వేశ్వరరెడ్డికి ఆయన కుమారుడు, తమ్ముడు పెద్ద సమస్యలుగా మారారు. ఆయన కుమారుడిపై భూఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. విశ్వేశ్వరరెడ్డికోసం అనేక త్యాగాలు చేసిన తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పార్టీనుంచి సస్పెండ్‌ చేయించారన్న అపవాదు మూటగట్టుకున్నాడు. మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి తన అన్నకు ప్రత్యర్థిగా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఓట్లు పెద్దఎత్తున చీలనున్నాయి. ఇది పయ్యావుల కేశవ్ కు అనుకూలంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాయదుర్గం అసెంబ్లీ స్థానంలో టీడీపీ , వైసీపీ నుంచి రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు సీనియర్ నేతలు బరిలో పోటీ తలపడుతున్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా కాలవ శ్రీనివాసులు బరిలో దిగారు. 2019లో వైసీపీ నుంచి గెలుపొందిన కాపు రామచంద్రారెడ్డిపై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావటంతో ఈసారి టికెట్ నిరాకరించారు. దీంతో ఆయన భాజపా లో చేరి, గత ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన కాలవ శ్రీనివాసులును గెలిపించాలంటూ, ప్రచారం చేస్తున్నారు. వైసీపీ తరఫున బరిలో నిలిచిన మెట్టు గోవిందరెడ్డి గెలుపు అసాధ్యమే అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీసీలు అధికంగా ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలో మెట్టు గెలుపు సులువు కాదని విశ్లేషకులు చెబుతున్న విషయం. ఐదేళ్లుగా రాయదుర్గంలో వైసీపీ అరాచకాలు, అక్రమాలపై యుద్ధం చేసిన కాలవ శ్రీనివాసులు తన గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు, రాజకీయ నాయకుల దృష్టంతా కళ్యాణదుర్గం మీదనే ఉంది. ఎన్నికల్లో మరోసారి టికెట్ ఆశించి భంగపడిన ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఈసారి టికెట్ తమకే వస్తుందని భావించారు. గత ఎన్నికల్లో ఉన్నం హనుమంతరాయచౌదరిని కాదని ఉమామహేశ్వరనాయుడుకు టీడీపీ టికెట్ ఇచ్చారు. ఆయన అందరితో కలిసి పనిచేయని కారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కళ్యాణదుర్గం నియోజకవర్గ బరిలో తెలుగుదేశం నుంచి అమిలినేని సురేంద్రబాబు పోటీ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, తలారి రంగయ్య బరిలో నిలిచారు. 2019లో వైసీపీ నుంచి గెలుపొందిన మంత్రి ఉషశ్రీ చరణ్‌ నియోజకవర్గంలో ఇసుక, మట్టి దోపిడీతో పాటు, ఆమె భర్త భూ దందాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. మరోసారి వైసీపీ నుంచి ఆమె కళ్యాణదుర్గంలో గెలిచే అవకాశం లేదని అన్ని సర్వేలు చెప్పడంతో, మంత్రి ఉషను పెనుకొండకు బదిలీచేసి అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించారు.


టీటీడీ ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ మరోసారి పొడిగింపు - ఫిర్యాదులను పట్టించుకోని కేంద్రం - DHARMA REDDY DEPUTATION EXTENDED

శింగనమల ‍‌నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ పోటీ చేయనున్నారు. వైసీపీ టికెట్‌ను వీరాంజనేయులుకు ఇచ్చారు. 2019లో వైసీపీ నుంచి గెలుపొందిన జొన్నలగడ్డ పద్మావతి ఆమె భర్త సాంబశివారెడ్డి, బంధువర్గాలు నియోజకవర్గంలో అనేక అక్రమాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఆమె తన పార్టీ ప్రభుత్వంతో యుద్ధం చేయాల్సివస్తోందని మాట్లాడిన వీడియో వైరల్ చేశారు. అన్ని మండలాలకు ఇంఛార్జ్‌లుగా రెడ్డి వర్గీయులకు కట్టబెట్టడంతో ఎస్సీ నియోజకవర్గంలో రెడ్ల పాలన సాగించారనే అపవాదును సాంబశివారెడ్డి మూటగట్టుకున్నారు. దీంతో ఈసారి వైసీపీ అధిష్టానం శింగనమల ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను జొన్నలగడ్డ పద్మావతికి కాకుండా వీరాంజనేయులుకు ఇచ్చారు. ఈ అభ్యర్థిని గెలిపించే బాధ్యత వైసీపీ సాంబశివారెడ్డికే అప్పగించింది. సాంబశివారెడ్డిపై ఉన్న వ్యతిరేకత టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ కి కలిసొచ్చే అంశం. గత ఎన్నికల్లో శ్రావణిశ్రీని ఓడించామనే సానుభూతి ప్రజల్లో ఉందని అన్ని సర్వేల్లో స్పష్టమైంది.


రూ.50 వేలు ఇచ్చి రూ.3.5 లక్షలు లాగేసి - వాహనమిత్ర లబ్ధిదారులకు జగన్​ సర్కార్​ టోపీ - ysr vahana mitra scheme

రాజకీయంగా అత్యంత కీలకమైన మరో అసెంబ్లీ నియోజకవర్గం తాడిపత్రి. తాడిపత్రి పేరు రాష్ట్రంలో తెలియని వారుండరు. జేసీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న తాడిపత్రిలో గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని గెలిపించారు. తాడిపత్రి అసెంబ్లీ స్థానం బరిలో తెలుగుదేశం నుంచి మరోసారి జేసీ అస్మిత్‌రెడ్డి పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. ఐదేళ్లుగా వైసీపీ అక్రమాలు, ఇసుక మాఫియా,అవినీతి అరోపణలున్నాయి. నియోజకవర్గంలోని పరిశ్రమల యజమానులను నెలవారీ మామూళ్లకోసం బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు . కేతిరెడ్డి పెద్దారెడ్డి బెదిరింపులకు తట్టుకోలేక రాయలచెరువులో, తాడిపత్రిలో రెండు వందలకు పైగా పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ ప్రభావం ఈసారి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై పడనుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి, దేశంలోనే అగ్రగామి మున్సిపాలిటీగా అనేక జాతీయ అవార్డులు తీసుకొచ్చారు.

ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపును శాసించే 60 వేల మంది వాల్మీకులు, 34 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్న కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం గుంతకల్లు. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలితో ఆ పార్టీని నమ్మిన ప్రజలు గుంతకల్లులో టీడీపీ అభ్యర్థి జితేంద్ర గౌడ్ ను ఓడించారు. అయితే ఈసారి గుంతకల్లులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొని టీడీపీ టికెట్ ను జితేంద్ర గౌడ్ కు కాకుండా వైసీపీ నుంచి టీడీపీ లోకి వచ్చిన మంత్రి గుమ్మనూరు జైరాంకు ఇచ్చారు. గుంతకల్లు అసెంబ్లీ స్థానం బరిలో తెలుగుదేశం అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్‌ పోటీలో నిలిచారు. వైసీపీ నుంచి మరోసారి వై. వెంకట్రామి రెడ్డి బరిలో దిగారు. ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే తన బంధువులను మండలాలకు ఇన్ ఛార్జీలుగా నియమించి పెద్ద ఎత్తున భూ దందా సాగించారనే ఆరోపణలున్నాయి. గుత్తిలో ఎమ్మెల్యే దగ్గరి బంధువు ఎర్రమట్టి మాఫియా సృష్టించి ఏకంగా ఓ కొండనే మాయం చేశారనే విమర్శలున్నాయి. రైల్వే జంక్షన్ గా ఉన్న గుంతకల్లులో సుమారు వెయ్యి మందికి పైగా రైల్వే ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయి. ఈ పట్టణంలో కనీసం గుంతలు పడిన రోడ్లకు అతుకులు వేయించలేకపోయిన ఎమ్మెల్యేగా వెంకట్రామిరెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత ఉంది.

తుని రైలు దహనం వైఎస్సార్సీపీ కుట్రే: పవన్​ కల్యాణ్​ - Pawan kalyan Election Campaign

అనంతపురం పోటీలో దూసుకుపోతున్న టీడీపీ - నేతలపై వ్యతిరేకతతో వెనుకబడిన వైసీపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.