ETV Bharat / state

డ్రగ్స్ పట్టుబడుతున్నా కొత్త కేసులు ఎలా పుట్టుకొస్తున్నాయి - వీటికి అంతమే లేదా?

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 28, 2024, 2:13 PM IST

Drug smuggling in Telangana : మాదకద్రవ్యాలు! సమాజాన్ని పట్టిపీడిస్తోన్న అతిపెద్ద మహమ్మారి. చాపకింద నీరులా విస్తరిస్తోన్న ఈ రక్కసి అడ్డుకట్టకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రత్యేకంగా రాజధానిలో ఏ చిన్న పార్టీ చేసుకున్నా డ్రగ్స్‌ వినియోగం తప్పనిసరి అనేలా మారిపోయింది పరిస్థితి. అందుకు నిదర్శనంగా నిలుస్తోంది రాడిసన్‌ హోటల్ డ్రగ్స్‌ కేసు. ఈ కేసులో రాజకీయ ప్రముఖుడి కుమారుడితో పాటు సినీ దిగ్గజాలు, వ్యాపారులు, సహా ప్రముఖులు మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసుల ఛేదనలో పట్టుబడినవి కొన్నైతే పట్టుబడనివి ఇంకా ఎన్నో ఉదంతాలు ఉన్నాయి.

Drugs smuggling in Telangana
Drugs smuggling in Telangana

తెలంగాణకే పరిమితం కాని మత్తు జాడ్యం

Drug smuggling in Telangana : అధికశాతం యువ జనాభా కలిగిన దేశం భారత్‌. ఆ యువత సక్రమైన మార్గంలో పయనిస్తే దేశార్థికానికి ఎంతో మేలు. కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. డ్రగ్స్‌కు అలవాటు పడుతున్న నేటితరం వారి భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటోంది. ఈ విషయాన్ని గ్రహించి యువతను సరైన మార్గంలో ప్రయాణించేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.

Radisson Drug Case Updates : దీనికి సంబంధించి ఏళ్లుగా ఎన్నో కేసులు నమోదవుతున్నా వినియోగదారుల్లో కానీ, వినియోగిస్తున్న వారిలో గాని ఎలాంటి మార్పు ఉండటం లేదు. చాపకింద నీరులా ప్రవహిస్తోన్న మత్తు పదార్థాల వినియోగం ఏ చిన్న పార్టీలోనూ తప్పక ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకు నిదర్శనంగా నిలుస్తోంది రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసు (Radisson Drug Case). ఈ నెల 24న మొదలైన పార్టీలో డ్రగ్స్‌ వినియోగించగా సోమవారం కేసు నమోదైంది. అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

హైదరాబాద్‌లోని ఆ హోటల్లో స్నేహితులతో కలిసి ఈ నెల 24న డ్రగ్స్‌ పార్టీ ఏర్పాటు చేశాడు మంజీరా గ్రూప్ డైరెక్టర్‌ గజ్జల వివేకానంద్‌. 3గ్రాముల కొకైన్‌ తెప్పించుకొని హోటళ్లోని 2 గదుల్లో పార్టీ చేసుకున్నారు. సమాచారం అందుకున్న మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు అర్ధరాత్రి హోటల్‌కు చేరుకోగా వారంతా అక్కడి నుంచి పారిపోయారు. గదుల్లో కొకైన్ ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు వివేకానంద్ ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డ్రగ్స్‌ తీసుకున్నట్లు వివేకానంద అంగీకరించాడు.

నిజానికి ఈ మత్తు జాడ్యం హైదరాబాద్‌కో, తెలంగాణకే మాత్రమే పరిమితం కాలేదు. రెండ్రోజుల క్రితం దేశ రాజధాని దిల్లీలోనూ రూ.2000 కోట్ల డ్రగ్స్ రాకెట్‌ గుట్టు రట్టైంది. ఈ వ్యవహారంలో తమిళనాడు చలనచిత్ర నిర్మాత కీలక సూత్రధారిగా ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు మహారాష్ట్రలోని పుణెలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ బయటపడటం తీవ్ర కలకలం రేపింది. రూ.1100 కోట్లు విలువ చేసే 600ల కిలోల మెఫ్రెడోన్‌ను సీజ్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Drugs Smuggling Telangana 2023 : అంతు చిక్కని 'మత్తు' రహస్యం.. స్మగ్లర్లను పట్టుకునేందుకు అధికారుల నయా ప్లాన్

యువత భవితను చిత్తు చేస్తోన్న మాదకద్రవ్యాలు (Drug smuggling) వివిధ రూపాల్లో మార్కెట్‌లోకి వస్తున్నాయి. హెరాయిన్, కొకైన్, ఎల్‌ఎస్డీ, ఎకస్టసీ పిల్స్‌, గంజాయి, మత్తు చాక్లెట్లు వీటికి అలవాటు పడి యువత నాశనమవుతోంది. ఒకప్పుడు దేశంలోని ప్రధాన నగరాలకే పరిమితమైన డ్రగ్స్ నేడు గ్రామీణ ప్రాంతాలకూ చేరుతున్నాయి. చిన్నపెద్ద పురుష, మహిళా అనే తేడా లేకుండా అందరూ వీటి బారిన పడుతున్నారు. ఈ విష సంస్కృతికి పాఠశాల విద్యార్థులు సైతం అలవాటుపడుతున్నారు.

క్రమం తప్పకుండా వెలుగు చూస్తోన్న మాదకద్రవ్యాల కేసుల్లో అందర్నీ ఆలోచనలో పడేస్తోన్న విషయం అసలు ఎన్నికేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్టులు చేసినా, ఎంత డ్రగ్స్ పట్టుబడుతున్నా ఇంకా కొత్త కేసులు ఎలా పుట్టుకొస్తున్నాయి?. వీళ్ల వెనక ఉండి నడిపిస్తోన్న అసలు కింగ్‌పిన్స్ ఎవరు? మరి కొందరైతే డబ్బుల కోసం దొంగతనాలు, మోసాలు, అక్రమాలు చేస్తున్న పరిస్థితి తలెత్తింది. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన ఇంకొందరైతే చేసిన తప్పుకు తుడుచుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

TS Govt Focus on Drugs Smuggling : నాణానికి మరోవైపు చూస్తే డ్రగ్స్ సరఫరాను కట్టడి చేయడాన్ని సవాల్‌గా తీసుకున్నామని అంటున్నారు రాష్ట్ర పోలీసులు. గోవా, బెంగళూర్, ముంబయి, దిల్లీ నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాయి ఎక్కువగా సరఫరా అవుతున్నాయి. దీనిపై నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు మత్తుపదార్థాల సరఫరాదారులను అరెస్ట్ చేస్తున్నారు. డ్రగ్స్ కేసులు అనగానే తరచు వెలుగుచూసే పేర్లు ఆఫ్రికన్లవే.

ganja smuggling : గంజాయి రవాణా వెనుక ఇంత నెట్​వర్క్​ ఉంటుందా..!

అక్కడి నుంచి పలు వీసాల పేరుతో దేశానికి వచ్చి ఇక్కడే అక్రమంగా నివాసం ఉంటూ మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న వారి సంఖ్య ఏటికేటా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా నైజీరియన్లు వీసా గడువు తీరినా అక్రమంగా నివాసం ఉంటూ సంపాదన కోసం మత్తు పదార్థాల సరఫరాను ఎంచుకుంటున్నారు. నిందితులు పోలీసుల నిఘా పెరగడంతో డార్క్‌వెబ‌్‌ను ఎంచుకున్నారు. డార్క్‌వెబ్‌లో కోడ్‌ లాంగ్వేజ్‌ ద్వారా విక్రయాలు చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారు.

ఇలాంటి కేసులు చేధించడానికి నార్కోటిక్ విభాగం పోలీసులు సైతం వినియోగదారులుగా మారి వాళ్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నా ఇంకా ఛేదించాల్సిన నెట్‌వర్క్ చాలా పెద్దదే ఉన్నట్లు వరస పరిణామాలే చెబుతున్నాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నుంచి గంజాయిని హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ముంబయి లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ముఠాల ఆటకట్టించడానికి పోలీసులు విజయవాడ, హైదరాబాద్ రహదారిపై తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.

Ganja smuggling in Telangana : ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో ఇన్‌ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, అక్కడి నుంచి గంజాయి (Ganja) బయల్దేరే వాహనాల వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్‌లోకి ప్రవేశించగానే గంజాయితో సహా వారిని కచ్చితంగా పట్టుకునేలా చర్యలు చేపడుతున్నారు. పోలీసులు మాదకద్రవ్యాలను కచ్చితత్వంతో పట్టుకుంటే నగరంలోకి అవెలా వస్తున్నాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో వేళ్లూనుకున్న డ్రగ్స్ నిర్మూలనపై ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి వాటి కట్టడికి ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని అన్నారు. అందుకు టీఎస్‌న్యాబ్‌ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

'మత్తు'పై ఉక్కుపాదం.. కళాశాలల్లో యాంటీ డ్రగ్స్‌ కమిటీలు

యువత భవితను ప్రమాదంలోకి నెడుతోన్న మాదకద్రవ్యాలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్రగ్స్ వ్యసనం జాతి వినాశనానికి దారితీస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదకద్రవ్యాల కట్టడికి చర్యలు తీసుకోవాలి. మత్తు పదార్థాల రక్కసిని పారదోలేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.

గోవా నుంచి తెచ్చి హైదరాబాద్​లో డ్రగ్స్ విక్రయం - రాజ్​తరుణ్ ప్రేయసి అరెస్ట్

Madhapur Drugs Case Update : మాదాపూర్ డ్రగ్స్ కేసు.. దర్యాప్తుతో 'మత్తు' వినియోగదార్లలో దడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.