ETV Bharat / state

డాక్టరమ్మా నీకు వందనం - 7 నిమిషాలకు పైగా సీపీఆర్​ చేసి బాలుడి ప్రాణాలు కాపాడిన వైద్యురాలు - వీడియో వైరల్​ - CPR To Boy On The Road in AP

author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 11:41 AM IST

Updated : May 17, 2024, 2:44 PM IST

Doctor Ravali CPR to Boy on The Road in Vijayawada: చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పనైంది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని బిడ్డను భుజాన వేసుకొని ఆసుపత్రికి పరుగులు తీశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వైద్యురాలు రవళి ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకొని చిన్నారికి ఊపిరి పోసేందుకు ప్రయత్నించారు. రోడ్డు మీదే చిన్నారికి సీపీఆర్‌ అందించి ఆరేళ్ల బాలుడిని నూరేళ్ల ప్రాణం పోశారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

Doctor CPR to Boy on The Road in AP
Doctor Ravali CPR to Boy on The Road (ETV Bharat)

ఈ డాక్టరమ్మ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే​ సోషల్​ మీడియాలో వీడియో వైరల్​ (ETV Bharat)

Doctor Ravali CPR to Boy on The Road in Vijayawada : వైద్యో నారాయణ హరి అంటారు. అంటే వైద్యులు దేవునితో సమానం అని. విద్యుదాఘాతానికి గురై కుప్పకూలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడ్ని భుజాన వేసుకుని ఆస్పత్రికి పరుగెత్తుతున్న తల్లిదండ్రులకు ఆ డాక్టరమ్మ దేవతలా ప్రత్యక్షమైంది. నేనున్నానని భరోసానిస్తూ రోడ్డుపైనే సీపీఆర్ చేసి చిన్నారికి ఊపిరి పోసింది. ఈనెల 5న ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి ఈ నెల 5వ తేదీన ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. బుజ్జి కన్నా లేవరా అని తల్లడిల్లుతూ తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పనైంది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని బిడ్డను భుజాన వేసుకొని ఆసుపత్రికి పరుగులు తీశారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేశాయి.

వైద్యురాలు రవళి ఇంటర్వ్యూ (ETV Bharat)

హార్ట్ ఎటాక్ వస్తే సీపీఆర్ ఎలా చేయాలి? సింపుల్ స్టెప్స్​ ఇవిగో!

Doctor Ravali Viral Video : మెడ్‌సీ ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలైన డాక్టర్‌ నన్నపనేని రవళి అటుగా వెళ్తూ ఇదంతా గమనించారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. బాలుడ్ని పరీక్షించి అక్కడే రోడ్డుపైనే పడుకోబెట్టమని చెప్పారు. అనంతరం కార్డియో పల్మోనరీ రిససిటేషన్‌-సీపీఆర్ చేయడం ప్రారంభించారు. ఒకవైపు డాక్టర్‌ రవళి బాలుడి ఛాతీపై చేతితో ఒత్తుతూ అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించారు. ఇలా ఏడు నిమిషాలకు పైగా చేశాక బాలుడిలో కదలిక వచ్చింది. వైద్యురాలి కృషి ఫలించడంతో ఆ బాలుడు మళ్లీ ఊపిరితీసుకున్నాడు.

Doctor CPR TO Boy and Save Life Video : వెనువెంటనే బాలుడ్ని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి బైక్‌పై తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగ్గా అందేలా తలను కొద్దిగా కిందకి ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని సూచించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చికిత్స చేయడంతో పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచి తలకు సీటీ స్కాన్‌ చేస్తే ఎలాంటి సమస్య లేదని గుర్తించి, డిశ్చార్జి చేసి ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు.

మహిళ ఆత్మహత్యాయత్నం.. CPR చేసిన పోలీసులు.. లక్కీగా..

డాక్టర్‌ రవళి రోడ్డుపైనే బాలుడ్ని పడుకోబెట్టి సీపీఆర్‌ చేసే సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వైద్యురాలి పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. అత్యవసర సమయంలో సీపీఆర్ ఎంతగా ఉపయోగపడుతుందనేందుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.

Viral Video : పాముకు ఊపిరి ఊది.. బతికించిన పోలీస్..! వీడియో వైరల్

Last Updated : May 17, 2024, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.