ETV Bharat / state

మీ మొబైల్​కు ఏవైనా అనుమానాస్పద లింకులు వచ్చాయా - వెంటనే ఈ నంబర్​కు వాట్సాప్​ చేసేయండి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 8:57 AM IST

Updated : Feb 12, 2024, 9:03 AM IST

Telangana Cyber Security Bureau
Telangana Cyber Security Bureau

Cyber Security Bureau Action on Cyber Crimes : సైబర్‌ నేరాల నియంత్రణ కోసం తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అందుబాటులోకి తెచ్చిన విధానం సత్ఫలితాలిస్తోంది. ప్రజల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద వెబ్‌లింకులతో వచ్చే సందేశాలను నివృత్తి చేస్తూ, సైబర్‌ నేరాలు జరగకుండా అడ్డుకుంటోంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 299 నకిలీ వెబ్‌సైట్లు గుర్తించి పని చేయకుండా చర్యలు చేపట్టింది.

సైబర్‌ నేరగాళ్ల కొత్తపంథాలకు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అడ్డుకట్ట

Cyber Security Bureau Action on Cyber Crimes : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆఫర్ల పేరుతో లింక్‌లు పంపడం, బహుమతి గెలిచారని మాయమాటలు చెప్పడం, ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాల అప్​డేట్ అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో చాలామంది సైబర్‌ నేరగాళ్ల వలలో పడి తమ జేబులు, బ్యాంకు ఖాతాలు గుల్ల చేసుకుంటున్నారు. సైబర్​ నేరాలపై పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినా, బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వీరి ఆగడాలను అరికట్టేందుకు పోలీసు శాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఉన్నతాధికారులు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశారు.

Telangana Police Focus on Cyber Crimes : ఆధార్‌ అప్‌డేట్‌, క్రిప్టో కరెన్సీ, పెట్టుబడులకు లాభం వంటి పేర్లతో ప్రజల ఫోన్లకు వచ్చే అనుమానాస్పద వెబ్‌ లింకులు, సందేశాలపై సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకు ప్రత్యేక వాట్సాప్‌ నంబర్ 87126 72222 అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నంబర్‌కు అనుమానాస్పద వెబ్‌లింకులపై ఫిర్యాదు చేస్తే సెక్యురిటీ బ్యూరో పరిశీలించి నకిలీ వెబ్‌లింకులు పని చేయకుండా అడ్డుకుంటోంది. తద్వారా సైబర్‌ నేరాలను (Cyber Crimes in Telangana) కట్టడి చేయవచ్చు.

Hyderabad Cyber Crime Police Special Drive : సైబర్ కేటుగాళ్ల చేతులో మోసపోయారా.. ఇక్కడ ఫిర్యాదు చేస్తే డబ్బు దొరుకుతుంది

అధికారిక వెబ్‌సైట్లకు తీసిపోని విధంగా నకిలీ లింకులు : సైబర్ నేరస్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల అధికారిక వెబ్‌సైట్లకు తీసిపోని విధంగా నకిలీ లింకులను తయారు చేసి కస్టమర్‌ కేర్‌ పేరుతో ఆన్‌లైన్‌లో నంబర్లను ఉంచుతున్నారు. హరియాణా, ఝార్ఖండ్‌ మరికొన్ని రాష్ట్రాల్లో రూ.5000లు ఇస్తే అసలు వైబ్‌సైట్‌ తరహాలో నకిలీవి తయారు చేస్తారు. అక్షరాలు, రంగులు సహా సరిపోయే విధంగా ఇవి ఉంటాయి. ఆన్‌లైన్‌లో అసలైన సంస్థ పేరు టైప్‌ చేయగానే అధికారిక వెబ్‌సైట్‌కు బదులుగా నకిలీ వెబ్‌సైట్‌ (Fake Websites) పైభాగంలో కనిపించే విధంగా చేస్తున్నారు. ఇది నిజమని నమ్మి అధిక శాతం మంది నకిలీ వెబ్‌సైట్లు, కస్టమర్‌ కేర్ల బారిన పడి తమ ఖాతాలు గుళ్ల చేసుకుంటున్నారు.

VOIP Cyber Frauds : 92, 96, 97.. ఇలాంటి కోడ్​ ఉన్న నెంబర్లతో ఫోన్లు వస్తున్నాయా.. అయితే తస్మాత్​ జాగ్రత్త

Cyber Crimes in Telangana : అనుమానాస్పద వెబ్​ లింకులపై ప్రజలు ఫిర్యాదు చేయడం ద్వారా సైబర్ నేరాలను అడ్డుకోవచ్చని సైబర్ సెక్యురిటీ బ్యూరో ఉన్నతాధికారులు చెబుతున్నారు. తద్వారా ఈ తరహా నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని అంటున్నారు. అలాగే ఏదైనా లింకు క్లిక్‌ చేయాలని పంపిస్తే నమ్మొద్దని, ముందస్తుగా డబ్బు అడిగితే మోసమని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్లలోనే షాపింగ్‌ చేయాలని, సోషల్ మీడియాలో వచ్చే లింకులు, ఆఫర్లని చూసి మోసపోవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు.

98 లక్షలు కొల్లగొట్టి, క్షణాల్లోనే 11 ఖాతాలకు బదిలీ - పోలీసుల చాకచక్యంతో 85 లక్షలు సేఫ్

సైబర్‌ మోసానికి గురయ్యారా? సింపుల్​గా కంప్లైంట్​ చేయండిలా!

Last Updated :Feb 12, 2024, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.