ETV Bharat / state

ఫెడ్ఎక్స్ కొరియర్​ పేరుతో కాల్ - అవయవ పార్శిల్ వచ్చిందంటూ లక్షల్లో దోపిడీ - Cyber crime in hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 10:33 PM IST

FAKE FEDEX COURIER CRIME
Cyber Crime in Hyderabad

Cyber Crime in Hyderabad : ఫెడెక్స్ కొరియర్ పేరుతో సైబర్ మోసాలు పెగుతూనే ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్​కు చెందిన వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 9.69లక్షలు కాజేశారు. బ్యాంకాంక్ నుంచి ఆధార్ నంబర్​పై పార్శిల్ వచ్చిందని, ఫెడెక్స్ నుంచి మాట్లాడుతున్నట్లు బాధితుడికి ఫోన్ చేసి బురిడి కొట్టించారు.

Cyber Crime in Hyderabad : సైబర్ నేరాల పట్ల ప్రజలను, పోలీసులు ఎంతగా అప్రమత్తం చేసినా, మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. సైబర్ నేరస్థులు కొత్త కొత్త పద్దతుల్లో అమాయకులైన ప్రజల భయాన్ని, డబ్బుపై ఉన్న ఆశను ఆసరాగా చేసుకుని దోచేస్తున్నారు. నగరంలో ఫెడెక్స్ కొరియర్ పేరుతో మోసాలు(Cyber Crime) పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్​కు చెందిన సైబర్ బాధితుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 9.69లక్షలు కాజేశారు. బ్యాంకాంక్ నుంచి మీ ఆధార్ నంబర్​పై పార్శిల్ వచ్చిందని ఫెడెక్స్ నుంచి మాట్లాడుతున్నట్లు బాధితుడికి ఫోన్ చేశారు.

సదరు వ్యక్తి ఆధార్ నంబర్​తో సహా తనపై ముంబై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారని భయపెట్టారు. అలాగే అదే ఆధార్ నంబర్​తో హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో ఖాతా తెరిచారని, అ ఖాతా మనీలాండరింగ్ యాక్ట్​లో లింక్ అయి ఉందని తెలిపారు. కొద్ది సేపటి తర్వాత స్కైప్ ద్వారా సీబీఐ ఆధికారిలా ఫోన్ చేసిన నేరగాళ్లు, 17 మంది పిల్లలను కిడ్నాప్ చేసి వారి అవయవాలు అక్రమంగా తరలించిన వ్యవహారంలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Telangana Crime News : కస్టమ్స్ అధికారులు సోదాలు చేసి మొత్తం కుటుంబాన్ని అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. కేసు నమోదవకుండా ఉండాలంటే డబ్బులు పంపాలని, 12గంటల్లో నగదు మళ్లీ తిరిగి ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. బాధితుడి తండ్రి క్యాన్సర్ పేషెంట్, భార్య ఆరు నెలల గర్భవతి కావడంతో భయాందోళనకు గురయ్యాడు. దీంతో నేరగాళ్ల చెప్పినట్లు చేశాడు. సదరు వ్యక్తులు తెలిపిన ఖాతాలకు బాధితుడు రూ. 9.69లక్షలు బదిలీ చేశాడు. అనంతరం ఎటువంటి స్పందన లేకపోవడంలో మోసపోయానని గ్రహించిన బాధితుడు, హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

క్రెడిట్ కార్డు పేరుతో ఇటివల నగరంలో క్రెడిట్ కార్డు రుణ పరిమితి పెంచుతామంటూ, బ్యాంకు వివరాలు సేకరించి నగదు మాయం చేసిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. యాక్సిస్‌ క్రెడిట్‌ కార్డు పేరిట రుణ పరిధిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతామంటూ ఓ అపరిచిత వ్యక్తి ఫోన్​ చేసి చెప్పడంతో బాధితుడు నమ్మి, బ్యాంకు ఖాతా వివరాలతో పాటు, వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాడికి చెప్పాడు. అనంతరం వచ్చిన ఓటీపీ చెప్పమని సైబర్‌ నేరగాడు కోరడంతో బాధితుడు ఓటీపీని సైబర్ కేటుగాడికి తెలిపాడు. దాంతో అతని ఖాతా నుంచి దాదాపుగా రూ.2 లక్షల 90 వేల 253 నష్టపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

మ్యాట్రిమోనిలో పరిచయమైన మహిళకు రూ.2.71 కోట్ల టోకరా - Man arrest for cheat in Matrimony

'మీ పార్శిల్​లో అక్రమ ప్రొడక్ట్స్ ఉన్నాయి - పోలీసులకు చెప్పొద్దంటే నేనడిగిన డబ్బు ఇవ్వాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.