ETV Bharat / state

నీరు లేక చివరి దశలో ఎండిపోతున్న పంటలు- కాపాడుకునేందుకు రైతుల నానాతంటాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 14, 2024, 4:03 PM IST

Crops Dried Up In Mahabubnagar District : జలాశయాల్లో నీళ్లు లేక భూగర్భ జలాలు గత ఏడాదితో పోల్చితే సగటున 3 మీటర్ల లోతుకు పడిపోయాయి. వర్షాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగిలో వేసిన పంటలు చివరి దశలో ఎండిపోతున్నాయని రైతులు వాపొతున్నారు. వాటిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండుతున్న పంటలపై ప్రత్యేక కథనం.

Crops Dried Up In Mahabubnagar District
Crops Dried Up In Mahabubnagar District

Crops Dried Up In Mahabubnagar District : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యాసంగిలో రైతులు వేసిన పంటలు చివరి దశలో ఎండిపోతున్నాయి. ఈ ఏడాది 5జిల్లాలు కలిపి 7లక్షల 30వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. వీటిలో అత్యధికంగా 4లక్షల 50వేల ఎకరాల్లో వరి సాగైంది. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలోని ఎత్తిపోతల పథకాలపై ఆధారపడే ఎక్కువగా వరి సాగవుతుంది. కానీ యాసంగిలో జూరాల, భీమా, నెట్టెంపాడు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు సాగునీరు ఇవ్వలేమని ముందుగానే అధికారులు వెల్లడించారు. కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకానికి మాత్రం వారాబందీ విధానంలో మార్చి వరకూ ఆరుతడి పంటలకు సాగునీరు ఇస్తామని తెలిపారు. బోరు బావులపై ఆధారపడి పంటలు వేసిన రైతులు భూగర్భ జలాలను కాపాడుకునే విధంగా అధికారులు కొన్ని సూచనలు చేశారు.

సాగునీటికోసం అన్నదాతల ఆందోళన - పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన

"అనిశ్చిత వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుని రైతులు పంటలు పండించుకోవాల్సిన అవసరం ఉంది. పంట, నీరు, ప్రణాళికలు అమలు పరుచుకోవాలి. ఈ మధ్య కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉన్నాయి. భూగర్భ జలాలు పెంచేందుకు వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేటట్లుగా చూసుకోవాలి. భూగర్బ జలవనరుల యాజమాన్యాన్ని ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఉంది" - రమాదేవి, జిల్లా భూగర్భ జలశాఖ అధికారి

Ground Level Water Decreasing : జిల్లా వ్యాప్తంగా యాసంగిలో సాగుచేసిన వేరుశనగ, మొక్కజొన్న పంటలకు నీరు లేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇంకొద్ది రోజులు తడులు అందితే పంట చేతికొచ్చే అవకాశం ఉన్నా వాటికి నీరందే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఈ దశలో నీళ్లందకపోవడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరుబావుల్లో నీళ్లున్నాయని భావించి నెలరోజుల కిందట సాగుచేసిన మొక్కజొన్న చేన్లు సైతం ప్రస్తుతం వాడి పోతున్నాయి. పెట్టుబడులు కూడా చేతికందని పరిస్థితి ఉందని, ప్రభుత్వం చొరవ తీసుకుని ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెట్టుబడులు కూడా చేతికందని రైతుల ధీన పరిస్థితి చూసి ప్రభుత్వం చొరవ తీసుకుని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నీరు లేక చివరి దశలో ఎండిపోతున్న పంటలు- కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్న రైతన్నలు

నీటిపారుదల రంగంపై సర్కార్ ఫోకస్ - నేడు సీఎం రేవంత్ సమీక్ష

భూగర్భ జలాలు అడుగంటిపోయే.. కాలువ నీళ్లు ఆగిపోయే.. పంట చేతికొచ్చేదెలా..!

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఈ విషయాలు తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.