ETV Bharat / state

లోక్​సభ బరిలో కొత్త అభ్యర్థులు - మల్కాజిగిరి స్థానం నుంచి బడా వ్యాపారవేత్త!

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2024, 7:24 AM IST

Updated : Jan 31, 2024, 8:41 AM IST

Congress MP Candidates 2024 Telangana : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించని స్థానాలపై దృష్టిసారించి కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆదిలాబాద్‌ నుంచి ఆదివాసీ వైద్యురాలిని మల్కాజిగిరికి ఓ వ్యాపారవేత్త పేరును పరిశీలించి రంగంలోకి దింపే యోచనలో హస్తం పార్టీ ఉన్నట్లు సమాచారం.

Congress Focus On Lok Sabha Elections
Lok Sabha Elections 2024

లోక్​సభ బరిలో కొత్త అభ్యర్థులు - మల్కాజిగిరి స్థానం నుంచి బడా వ్యాపారవేత్త!

Congress MP Candidates 2024 Telangana : రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకొన్న కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని యత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించినా కొన్ని లోక్‌సభ స్థానాల పరిధిలో విపక్ష బీఆర్​ఎస్​, బీజేపీ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ను మినహాయిస్తే మిగిలిన 16 స్థానాలకు గాను 9చోట్ల కాంగ్రెస్‌కు, 7చోట్ల బీఆర్​ఎస్​కు ఆధిక్యం లభించింది. ఆధిక్యం లభించని చోట బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలన్న ఆలోచనతో కాంగ్రెస్‌ ఉంది. ఆదిలాబాద్‌ నుంచి ఆదివాసీ వర్గానికి చెందిన ఓ వైద్యురాలిని రంగంలోకి దింపే ఆలోచనలో కాంగ్రెస్‌ ఉన్నట్లు తెలిసింది.

Congress Focus On Lok Sabha Elections 2024 : మరో టీచర్‌ పేరు పరిశీలనకు వచ్చినా వైద్యురాలి వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బీజేపీ కంటే బీఆర్​ఎస్​కు 17వేల ఓట్ల ఆధిక్యత వచ్చింది. కాంగ్రెస్‌కు ఆ రెండుపార్టీల కంటే రెండు లక్షల ఓట్లు తక్కువ వచ్చాయి. దీంతో ఆదిలాబాద్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది. మల్కాజ్​గిరి పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్​ఎస్ గెల్చుకుంది. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ కంటే మూడున్నర లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఈ లోక్‌సభ స్థానం సీఎం రేవంత్‌రెడ్డి గత ఎన్నికల్లో గెలవడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కించుకోవాలని కాంగ్రెస్‌ పట్టుదలతో ఉంది. వ్యాపారవేత్త అయిన ఓ మాజీ ఎమ్మెల్యేని రంగంలోకి దించే అంశం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

లోక్​సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ - తెలంగాణ రాష్ట్ర నూతన ఇంఛార్జ్​గా దీపా దాస్​మున్షీ

Lok Sabha Elections 2024 : సికింద్రాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్కస్థానం లభించలేదు. మొత్తం ఓట్లలో లక్షా 80వేలు తక్కువగా వచ్చాయి. ఇక్కడి నుంచి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేరు పరిగణనలో ఉన్నా, మరో బలమైన అభ్యర్థి దొరికితే మార్చే అవకాశాలున్నాయి. నిజామాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో మూడు పార్టీలకు ఓట్లు పోటాపోటీగా వచ్చినా కాంగ్రెస్‌ కంటే 9వేల ఓట్లు బీఆర్​ఎస్​కు ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. చేవెళ్లలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన విశ్వేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆయన తిరిగివచ్చే అవకాశం లేదని భావిస్తున్న కాంగ్రెస్‌ మరో పార్టీకి చెందిన ప్రజావ ప్రతినిధిని చేర్చుకొని అక్కడి నుంచి పోటీ చేయించే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది.

పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనమే లక్ష్యం - రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల 'హస్త'గతం దిశగా కసరత్తులు

Congress To Focus On 17 Seats In Lok Sabha : గాంధీ కుటుంబం నుంచి సోనియా, ప్రియాంక గాంధీలలో ఒకరిని ఖమ్మం లేదా భువనగిరి నుంచి పోటీ చేయించేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. దక్షిణాది నుంచి పోటీకి వారు ఆసక్తి చూపకపోతే కొత్తవారిని ఎంపికచేసే అవకాశం ఉంది. నల్గొండ నుంచి జానారెడ్డి లేదా ఆయన కుమారుడు, మహబూబాబాద్‌ నుంచి బలరాంనాయక్‌, పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్‌ కుమారుడు వంశీ, జహీరాబాద్‌ నుంచి సురేశ్‌షెట్కార్‌కు ఎక్కువ అవకాశం ఉంది. నల్గొండ టికెట్‌ ఇస్తామని గతంలో పటేల్‌ రమేశ్‌ రెడ్డికి హామీ ఇచ్చినందున ఆయనకి ప్రత్యామ్నాయం ఏం చూపుతారో చూడాల్సిఉంది. ముందుగా రాజ్యసభ ఎన్నికలు రానున్నందున నల్గొండ విషయంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు.

లోక్ సభ స్థానాలపై కాంగ్రెస్​ గురి : మెదక్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పటాన్‌చెరు టికెట్‌ ఇచ్చి చివర్లో తప్పించిన నీలం మధు ముదిరాజ్‌ పేరును కొందరు ప్రతిపాదించినట్లు తెలిసింది. కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నా మరికొందరి పేర్లు పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచంద్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లేనని చెబుతున్నారు. ఫార్మాకంపెనీకి చెందిన జీవన్‌రెడ్డి పేరు వినిపిస్తున్నా, ఆయనను మరో రకంగా వినియోగించుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నాగర్‌కర్నూల్‌ నుంచి మల్లురవి లేదా సంపత్‌కుమార్‌కు అవకాశాలున్నాయి. వరంగల్‌ స్థానానికి పలువురు పోటీపడుతున్నా ఇంకా ఎవరివైపు మొగ్గు చూపలేదని తెలుస్తోంది.

పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ గురి - బరిలో దిగేందుకు ఆశావహలు రెడీ

లోక్​సభ ఎన్నికల అభ్యర్థులపై ఏఐసీసీదే నిర్ణయం - మార్చి 3వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

Last Updated : Jan 31, 2024, 8:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.