ETV Bharat / state

నేడు కేంద్రమంత్రులను కలవనున్న సీఎం రేవంత్​ బృందం - నిధుల కోసం కసరత్తు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 7:14 AM IST

CM Revanth Reddy Delhi Tour Updates : కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. బకాయిలు సహా వివిధ రూపాల్లో వచ్చే నిధులను పొందేలా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక విజ్ఞాపన చేయనున్నారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Delhi Tour Updates

నేడు కేంద్రమంత్రులను కలవనున్న సీఎం రేవంత్​ బృందం - నిధుల కోసం కసరత్తు

CM Revanth Reddy Delhi Tour Updates : ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునేలా కసరత్తు చేస్తోంది. బడ్జెట్​ రూపకల్పన సమయంలోనే సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) అధికారులకు ఈ విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. కేంద్రం నుంచి ప్రత్యేకంగా కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చే నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అందుకు అనుగుణంగా రాష్ట్ర వాటా కేటాయించి, విడుదల చేయడం ఎప్పటికప్పుడు యూసీలు సమర్పించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్(Otan Account Budget 2024)​లో ప్రతిపాదనలు రూపొందించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ల రూపంలో రూ.21 వేల కోట్లకు పైగా వస్తాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాల కింద కనీసం రూ.19 వేల కోట్లు రాబట్టుకోవాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

Telangana CM Revanth in Delhi : సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధానిని కలిసిన రేవంత్​ రెడ్డి పలు విజ్ఞప్తులు చేశారు. ఆ వెంటనే కేంద్ర ఆర్థిక సంఘం(Central Finance Corporation) నిధులు రాష్ట్రానికి రూ.600 కోట్లు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే తరహాలో పెండింగ్​ నిధులను కేంద్రం నుంచి పొందడంపై సర్కార్​ దృష్టి సారించింది. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి బకాయిలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.1800 కోట్లు రావాల్సి ఉండగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి మరో రూ.450 కోట్లు కలిపితే రూ.2250 కోట్లు అవుతాయి. వాటన్నింటిపై దిల్లీలో కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్చించే అవకాశముంది. అందుకే వీరితో పాటు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దిల్లీ వెళ్లారు.

రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించిన సీఎం రేవంత్​, భట్టి

CM Revanth to Meet Union Ministers Today : వీటితో పాటు ఇతర అంశాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలకీ తక్కువ వడ్డీ భారం పడేలా సాఫ్ట్​లోన్లుగా మార్చడం, రైతు రుణమాఫీ(Farmer Loan Waiver) కోసం కార్పొరేషన్​ ఏర్పాటు సహా ఇతర అంశాలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్​ పూరీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​తో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి బృందం సమావేశం కానుంది.

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివాహానికి హాజరైన సీఎం బృందం : మరోవైపు సోమవారం దిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్​ రెడ్డి బృందం కాంగ్రెస్​ రాజ్యసభ సభ్యుడు రణదీప్​ సింగ్​ సుర్జేవాలా కుమారుడు ఆదిత్య వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ హాజరయ్యారు.

మూసీ అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా ప్రారంభించండి : అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.