ETV Bharat / state

తెలంగాణ ప్రణాళిక సంఘం బోర్డు ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 7:25 PM IST

Chinnareddy Appointed Vice Chairman Of TS Planning Commission : తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం బోర్డు ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి, పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌ జి.చిన్నారెడ్డి నియమితులయ్యారు. కేబినెట్‌ మంత్రి హోదాలో చిన్నారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన రాష్ట్ర ఏర్పాటు తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నుంచి పోటీ చేసి నాలుగో సారి విజయం సాధించారు.

Chinnareddy Appointed Vice Chairman Of TS Planning Commission
Chinnareddy

Chinnareddy Appointed Vice Chairman Of TS Planning Commission : తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి, పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌ జి.చిన్నారెడ్డి (Jillela Chinnareddy) నియమితులయ్యారు. ఆయనకు ఈ పదవి క్యాబినెట్‌ ర్యాంకుతో సమానమైనదని పేర్కొన్న ప్రభుత్వం ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా గోపాల్‌పేట మండలం జయన్న తిరుమలపూర్‌ గ్రామానికి చెందిన జిల్లెల చిన్నారెడ్డి 1955లో జన్మించారు.

PCC disciplinary committee on jaggareddy: 'జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నాం'

Jillela Chinnareddy : ఆయన ఉన్నత పాఠశాల విద్య వరకు వనపర్తిలో చదువుకున్న ఆయన 1970లోనే విద్యార్ధి సంఘ నాయకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత 1985లో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ నేతగా ఉంటూ వనపర్తి టికెట్‌ సాధించి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1989లో పోటీచేసి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలు పొందాడు. 1994లో మూడోసారి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 1999లో పోటీ చేసి రెండోసారి విజయం సాధించాడు. 2004లో ఐదోసారి పోటీ చేసిన చిన్నారెడ్డి మూడోదఫా శాసన సభ్యుడిగా గెలు పొందారు. వైఎస్‌ఆర్‌ మంత్రి వర్గంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. 2009లో తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో వనపర్తి నియోజక వర్గం నుంచి తిరిగి పోటీ చేసి నాలుగోసారి విజయం సాధించారు.

Chinnareddy: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా చిన్నారెడ్డి

రాజకీయ జీవతం : 2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయన 2021లో శాసన మండలి ఎన్నికల్లో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కూడా ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వనపర్తి నుంచి పోటీ చేసేందుకు మొదట ఆయన పేరు ప్రకటించి ఆ తరువాత తిరిగి మార్చేశారు. వ్యవసాయ విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు చదివిన ఆయనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24న ప్రణాళిక బోర్డ్‌ ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డిని ప్రభుత్వం నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏడేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదు: చిన్నారెడ్డి

కేసీఆర్ పోటీ చేసినా ఓటమి తప్పదు: చిన్నారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.