ETV Bharat / state

వరంగల్​లో బాల్యవివాహం - 30 సంవత్సరాల వ్యక్తితో 15ఏళ్ల బాలిక పెళ్లి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 5:06 PM IST

Child Marriage Took Place in Warangal District : ప్రభుత్వం బాలికల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా బాల్య వివాహాలకు తెరదించలేకపోతున్నారు. తెలిసి తెలియని వయసులో వివాహ బంధంలోకి నెట్టెసి, వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. అధిక వయసు వ్యత్యాసం ఉన్నా చిన్న పిల్లలకు పెళ్లి చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Warangal Child Marriage
Child Marriage Took Place in Warangal District

Child Marriage Took Place in Warangal District : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తనకంటే మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ములుగు జిల్లాకు చెందిన 15 సంవత్సరాల బాలికను రాయపర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 30 సంవత్సరాలు దాటిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరి పెళ్లి విషయం ఆ నోట ఈ నోట పడి అధికారుల వరకు చేరడంతో వరంగల్ జిల్లా బాలల రక్షణ అధికారులు సదరు వ్యక్తి నివాసాన్ని పరిశీలించారు.

Child Marriage Took Place
మైనర్​ని పెళ్లి చేసుకున్న వ్యక్తి

పెళ్లి చేసుకున్న బాలికను వివరాలు అడిగి తెలుసుకున్న అధికారులు ఆమె చెప్పిన వివరాలతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. చుట్టుపక్కన వారి దగ్గర కొంత సమాచారం తెలుసుకున్నారు. చిన్న వయసులో పెళ్లి ఏంటని బాలికకు సర్ది చెప్పి తమ వెంట తీసుకెళ్లారు. తనను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (Child Welfare Committee) ముందు హాజరు పరిచారు. చిన్న వయసులో వివాహం చేసుకుంటే ఎదురయ్యే కష్టాలు, జరిగే నష్టాలపై బాలికకు వివరించారు. అధికారుల కౌన్సిలింగ్ అనంతరం సదరు బాలికను స్థానికంగా ఉన్న ఆశ్రమంలో ప్రొటెక్షన్ (Child Protection) కల్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు. వివాహం చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Child Marriage in Nirmal : కాసులకు కక్కుర్తి పడి కూతురికి బాల్య వివాహం.. ఫైట్ చేసి తన లైఫ్ కాపాడుకున్న బాలిక

Warangal Child Marriage : చిన్నతనంలో వివాహాలు చేసుకోవడం చట్టరీత్యా నేరమైనప్పటికీ కొందరు దుర్బుద్ధితో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇంచార్జ్ డి.రాజు ఐసీడీఎస్ సూపర్ వైజర్ సీహెచ్ విజయలక్ష్మి, లీగల్ ఆఫీసర్ సురేష్ కౌన్సిలర్ నరసింహస్వామి, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ కె.స్వేత తదితరులు పాల్గొన్నారు.

Child Marriage Took Place in Nizamabad : 42 సంవత్సరాల వ్యక్తితో 13ఏళ్ల బాలిక పెళ్లి

Child Marriages in India : ప్రభుత్వం బాలికల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా బాల్య వివాహాలకు, కార్మికలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేకుండా పోతోంది. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడానికి ముఖ్య కారణం పేదరికం, అక్షరాస్యతలు అని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అక్షరాస్యత పెరగాడానికి బాలికలకు సదుపాయాలు కల్పిస్తున్నా వాటిపై అవగాహన లేక పోవడం మరో కారణం. యూనిసెఫ్​ ప్రకారం దేశంలో ఏడాదికి 10లక్షలకు పైగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అయితే గతంలో 47శాతం ఉన్న 27శాతానికి తగ్గింది.

అలా పెళ్లి చేసుకున్నారని వేల మంది అరెస్ట్.. వారి కుటుంబసభ్యుల బాధ వర్ణనాతీతం

పెళ్లికి వెళ్లాడని ఆ వ్యక్తి అరెస్ట్​.. చరిత్రలో మొదటిసారి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.