ETV Bharat / state

LIVE UPDATES : అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2024, 9:29 AM IST

Updated : Feb 10, 2024, 1:27 PM IST

Budget Live Updates 2024 :తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2024-2025 సంవత్సరానికి గానూ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

Telangana Budget Live Updates 2024
Budget Live Updates 2024

1.25

అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా

1.20

ఆదిలాబాద్‌ సహా ఎగువ జిల్లాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేస్తామని తెలిపారు. కృష్ణా పరీవాహక ప్రాంత ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఏఎంఆర్‌ శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాక్‌ కెనాల్‌ మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు ఎత్తిపోతల రాజీవ్‌ భీమా ఎత్తిపోతల పథకం సత్వరమే పూర్తిచేస్తామన్నారు.

కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతలను త్వరలోనే పూర్తిచేస్తామని తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్పీ ఇందిరమ్మ వరద నీటి కాల్వ జె.చొక్కారావు ఎత్తిపోతల పథకం సత్వరం పూర్తిచేస్తాన్నారు కొమురంభీమ్‌, చిన్న కాళేశ్వరం సత్వరమే పూర్తికి చర్యలు చేపడతామన్నారు.

1.16

రూ.లక్షల కోట్ల ఖర్చులో అవినీతి తేల్చాల్సిన బాధ్యత మాపై పడిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణకు కార్యాచరణ ఉంటుందన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో వాటా సాధనకు రాజీలేని పోరాట చేస్తామన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎంతదూరమైనా వెళ్తామని తెలిపారు. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్లను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌ సహా ఎగువ జిల్లాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమన్నారు. తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తిచేసి ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేస్తామని తెలిపారు.

1.10

నీటిపారుదల రంగంలో తప్పిదాలు ప్రగతికి అవరోధాలుగా మారాయన్నారు. నీటిపారుదలరంగ నిపుణుల సలహాలు గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. తమకు తెలిసిందే వేదమంటూ గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. పదేళ్ల ఒంటెద్దు పోకడతో సాగునీరు, ఆర్థిక రంగాలు అతలాకుతలమయ్యాయని విమర్శించారు. కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం శాపంగా మారిందన్నారు.

1.08

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేనివారికి ఇళ్ల స్థలాలు

స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తాం

200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు సత్వర చర్యలు

1.05

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తాం

1.01

ఉద్యోగాల నియామకాల కోసం జాబ్‌ క్యాలెండర్‌ రూపకల్పన ప్రక్రియ ప్రారంభించామన్నారు. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు ముందడుగు వేశామని తెెలిపారు.

త్వరలో 15 వేలమంది కానిస్టేబుళ్ల నియామకం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహణ, అదనపు సిబ్బంది నియామకానికి రూ.40 కోట్లు విడుదల చేశామని తెలిపారు. గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి సామాజిక భద్రత స్కీమ్‌ కింద రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు వెల్లడించారు

12.59

వర్సిటీల మౌలిక సదుపాయాల కోసం రూ.500 కోట్లు

నిమ్స్‌ విస్తరణకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం ప్రారంభిస్తామని చెప్పారు.

12.57

అన్ని పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు పౌష్ఠికాహారం అందిచే దిశగా అడుగులు వేస్తామన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా చేయడమే తమ లక్ష్యమని భట్టి అన్నారు. సకాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పులు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలతో పబ్లిక్‌ స్కూల్‌ నిర్మిస్తామని తెలిపారు. ఉన్నత విద్యామండలి సంపూర్ణ ప్రక్షాళనకు కృషి చేస్తామన్నారు.

12.53

ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1000 కోట్లు

ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.250 కోట్లు

బీసీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1,546 కోట్లు

గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా 2 ఎంబీఏ కళాశాలలు

తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు

12.49

గత పదేళ్లలో పేదలు, ధనికులకు మధ్య అంతరం పెరిగిందన్నారు. గురుకుల పాఠశాలలకు వసతులతో కూడిన సొంత భవనాలు, అన్ని గురుకుల పాఠశాలల్లో అందుబాటులోకి సౌర విద్యుత్‌ తీసుకువస్తామని తెలిపారు. ధరణి కొందరికి భరణం మరికొందరికి ఆభరణం చాలామందికి భారం అని భట్టి అన్నారు. ధరణి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు చేపడతామన్నారు. ధరణి పోర్టల్‌ సమస్యల అధ్యయనానికి కమిటీ వేశామని తెలిపారు.

12.46

త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ చేపడతామన్నారు. గత ప్రభుత్వ రైతుబంధుతో అనర్హులే ఎక్కువగా లాభం పొందారని మండిపాటు.

కొండలు, గుట్టలు, రోడ్లకు కూడా రైతుబంధు సాయమిచ్చారని విమర్శించారు.

పెట్టుబడిదారులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు రైతుబంధు ఇచ్చారు. అనర్హులకు రైతుబంధు ఇవ్వడం అక్రమం. రైతుబంధు నిబంధనలను పునఃసమీక్ష చేస్తాం

రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం. కౌలు రైతులకు రైతుభరోసా ఇచ్చేందుకు నూతన మార్గదర్శకాలు అని భట్టి వివరించారు.

త్వరలో నూతన విత్తన విధానం తీసుకోస్తున్నట్లు తెలిపారు. ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తాం హామీ ఇచ్చారు.

12.41

హైదరాబాద్‌ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా వికేంద్రీకరణ చేస్తామని తెలిపారు.

అర్బన్‌ జోన్‌గా ఔటర్‌ రింగ్‌రోడ్‌ లోపల ప్రాంతం

పెరి అర్బన్‌ జోన్‌గా ఓఆర్‌ఆర్‌-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య ప్రాంతం

గ్రామీణ జోన్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ ఆవల ప్రాంతం

గ్రామీణాభివృద్ధిలో పదేళ్లలో చోటుచేసుకున్న తప్పులను సరిదిద్దుతాం. స్థానిక సంస్థలకు హక్కులను తిరిగి అందిస్తాం. గ్రామ పంచాయతీలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తాం. గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం. గ్రామ పరిపాలన వ్యవస్థను తిరిగి ప్రజల చేతుల్లో పెడతాం. అని భట్టి అన్నారు.

పాలనాపరంగా అన్ని సంస్థలు, వ్యవస్థలు ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ చేపడతామన్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ద్వారా మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు.

12.34

మిషన్‌ భగీరథ కోసం రూ.35,752 కోట్లు ఖర్చుచేసినట్లు గత ప్రభుత్వం చెప్పింది. వేల కోట్లు ఖర్చు చేసినా నేటికీ సురక్షిత నీరు లేని గ్రామాలెన్నో ఉన్నాయని విమర్శించారు. గత ప్రభుత్వ తప్పుడు నివేదికల వల్ల కేంద్రం నుంచి మనకు హక్కుగా రావాల్సిన నిధులు రాలేదని మండిపడ్డారు. మిషన్‌ భగీరథ లోపాల దిద్దుబాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఆర్థిక వనరులు వృథా కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

12.31

దావోస్‌ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి భట్టి తెలిపారు. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు మరింత అభివృద్ధి జరుగుతుందని, ప్రభుత్వం నుంచి రెండు లెదర్‌ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు, డ్రైపోర్టులను అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్‌ ప్రణాళిక చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృత్రిమ మేథ ఉపయోగిస్తామని అన్నారు.

ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం నూతన పాలసీ, ఐటీని రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐటీ విస్తరణకు అమెరికాలోని ఐటీ సర్వ్‌ సంస్థతో సంప్రదింపులు చేస్తున్నట్లు వివరించారు. దేశంలోనే అత్యంత పటిష్టమైన ఫైబర్‌ నెట్‌వర్క్‌ కనెక్షన్లు ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

12.27

రుతుపవనాల ప్రభావం ఆర్థిక వ్యవస్థలో తీవ్రంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో క్షీణత ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిందని, ఆహార పంటలు, వాణిజ్య పంటల్లో దిగుబడులు తగ్గాయని వివరించారు. ఆరు గ్యారెంటీల అమలు ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఆరు హామీల అమలులో లబ్ధిదారుల ఎంపిక వేగంగా సాగుతోందని, అర్హులైన అందరికీ ఆరు హామీలు అందుతాయని హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తోందన్నారు. ఆరోగ్యశ్రీకి అవసరమై నిధులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ఉపముఖ్యమంత్రి హామీ. త్వరలో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామన్న భట్టి

సత్వర పారిశ్రామికాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు.

12.24

ప్రజావాణిలో 2 నెలల్లో వచ్చిన దరఖాస్తులు 43,054

ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు 14,951

భూసమస్య కోసం వచ్చిన దరఖాస్తులు 8,927

పింఛన్‌ కోసం వచ్చిన దరఖాస్తులు 3,267

ఉద్యోగ కల్పన కోసం వచ్చిన దరఖాస్తులు 3,134

దరఖాస్తుల పరిష్కారం కోసం కలెక్టర్లు, శాఖాధిపతులకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించారన్నారు. ప్రజావాణి నిర్వహణకు ప్రత్యేక అధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌ను నియమించామని తెలిపారు

12.17

గత ప్రభుత్వానిది పథకాలు గొప్ప-అమలు దిబ్బ అని ఎద్దేవా చేసిన భట్టి విక్రమార్క. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రంలోనూ ఆర్థిక కష్టాలని మండిపడ్డారు. అప్పులను అధిగమించి అభివృద్ధిలో ముందడుగు వేస్తామన్నారు. దేశ జీడీపీ వృద్ధిరేటుతో పోలిస్తే రాష్ట్ర వృద్ధిరేటు 2.4 శాతం ఎక్కువని, సంతులిత వృద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆర్భాటాలు, ఆకర్షణలకు ప్రభుత్వం దూరంగా ఉంటుందన్నారు. వర్షాల ప్రభావం వల్ల పంట దిగుబడులు బాగా తగ్గాయని పేర్కొన్నారు. వ్యవసాయంలో వృద్ధిలేమితో ఇతర రంగాలపై పడిందని తెలిపారు.

12.15

మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు

విద్యా రంగానికి రూ.21,389 కోట్లు

వైద్య రంగానికి రూ.11,500 కోట్లు

ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు

గృహనిర్మాణానికి రూ.7,740 కోట్లు

మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు

12.12

2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టిన ప్రభుత్వం. రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌.

రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు

మూలధన వ్యయం రూ.29,669 కోట్లు

ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు

వ్యవసాయానికి రూ.19,746 కోట్లు

ఐటీ శాఖకు రూ.774 కోట్లు

పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు

12.06

మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ఉంటుందని వివరించారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మార్పణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

12.04

అసెంబ్లీలో 'ఓట్‌ ఆన్ అకౌంట్' బడ్జెట్ ప్రవేశ పెట్టిన డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు

11.53

మరి కాసేపట్లో అసెంబ్లీలో 'ఓట్‌ ఆన్ అకౌంట్' బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు. రూ.2.75 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం.

11.27

సోమవారం బడ్జెట్ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. 13న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మేడిగడ్డకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

10:50

బడ్జెట్​లో అన్ని అంశాలు ఉంటాయని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు. ఆస్తులు, అప్పులతో పాటు కేంద్రం నుంచి వచ్చే ఆదాయంపైనా ప్రసంగంలో ఉంటాయని వివరించారు.

10:01

బడ్జెట్​కు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. బడ్జెట్​కు ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో 'ఓట్‌ ఆన్ అకౌంట్' బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.

09:50

Budget Live Updates 2024 : ఈరోజు అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్​కు ఆమోద ముద్ర వేసేందుకు రాష్ట్ర కేబినెట్​ భేటీ అయింది. అసెంబ్లీలో 'ఓట్ ఆన్ అకౌంట్​' బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కాగా శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్​ను పెట్టనున్నారు.

Last Updated : Feb 10, 2024, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.