ETV Bharat / state

పాడి రైతులకు పెండింగ్​లో ఉన్న రూ. 80 కోట్ల బిల్లులు చెల్లించాలి - సీఎం రేవంత్​కు హరీశ్​రావు లేఖ - BRS MLA Harish Rao Letter To CM

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 4:08 PM IST

BRS MLA Harish Rao On Dairy Farmers : పాడి రైతులకు పెండింగ్​లో ఉన్న రూ. 80 కోట్ల రూపాయల బిల్లులు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. బీఆర్ఎస్ తరహాలో పదిహేను రోజులకోమారు నిధులు విడుదల చేయాలని లేఖలో తెలియజేశారు.

BRS MLA Harish Rao Letter To CM
BRS MLA Harish Rao On Dairy Farmers

BRS MLA Harish Rao On Dairy Farmers : పాడి రైతులకు పెండింగ్​లో ఉన్న రూ. 80 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. బీఆర్ఎస్ తరహాలో పక్షం రోజులకోమారు నిధులు విడుదల చేయాలని లేఖలో తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా రైతులు ప్రభుత్వం నడిపే విజయ డెయిరీకి ప్రతీరోజు పాలు సరఫరా చేస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము పదిహేను రోజులకోమారు పాడి రైతులకు బిల్లులు చెల్లించేదని గుర్తుకు చేశారు.

Dairy Farmers Issues Telangana : ఒడిదొడుకుల్లో పాడిరైతులు.. ఐదేళ్లయినా అందని ప్రోత్సాహకాలు

BRS MLA Harish Rao Letter To CM On Dairy Farmers Problems : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడం లేదని అన్నారు. 45 రోజుల పాల బిల్లులు పెండింగులో ఉన్నాయని హరీశ్ రావు తెలిపారు. 45 రోజులకు గాను దాదాపు రూ. 80 కోట్ల రూపాయలు ప్రభుత్వం పాడి రైతులకు చెల్లించాల్సి ఉందని తెలిపారు. పశువుల కొనుగోలు కోసం చేసిన అప్పుల కిస్తీలు క్రమం తప్పకుండా కట్టుకోవాల్సి ఉందన్న ఆయన పశువులకు దాణా, మీండ్రాల్ మిక్షర్, కాల్షియం, మందులు ఇతరత్రా సామగ్రి కూడా రోజూ కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

పాడి పశువులను పోషిస్తున్న వారంతా పేదలు, మధ్య తరగతి ప్రజలేనని ఏ రోజు కష్టంతో ఆరోజు వెళ్లదీసుకునే వారేనని పేర్కొన్నారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన తీసుకున్న అప్పుకు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగులో ఉన్న బిల్లులను విడుదల చేయాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో పక్షం రోజులకోమారు బిల్లులు చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Telangana Dairy Farmers Problems : రాష్ట్రంలో పాడి రంగం కునారిల్లుతోంది. సంప్రదాయంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధంగా వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఉత్పత్తి చేసిన పాలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని వాపోతున్నారు. ఏయేటికాయేడు ఉత్పత్తి వ్యయం పెరుగుతుండటంతో ఆశించిన గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో పాడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

'ప్రభుత్వ పథకాలను మత్స్య, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి'

'ప్రభుత్వ పథకాలను మత్స్య, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.