ETV Bharat / state

'గేమ్‌ అబ్బాయిలది, అమ్మాయిలది కాదు - స్టామినాది' - క్రికెట్‌లో సత్తా చాటుతోన్న ఖమ్మం యువతి - Young CRICKETER ANJALI

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 6:51 PM IST

Cricketer anjali
Khammam Young Girl Excels in Cricket

Khammam Young Girl Excels in Cricket : దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. టెస్ట్‌ మ్యాచ్‌లు సైతం తెగ చూసేస్తారు. ఐపీఎల్‌ సీజన్‌ వచ్చిందంటే టీవీలకు అతుక్కుపోతారు. అలాంటి క్రికెట్‌ను తన కెరీర్‌గా మార్చుకుంది ఆ అమ్మాయి. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, అవరోధాలకు బ్యాట్‌తో సమాధానం చెబుతోంది. బంతిని బౌండరీ వైపు తరలించడమే లక్ష్యంగా సాధన చేస్తోంది. ఎవరా క్రీడాకారిణి? ఇప్పటి వరకు ఏయే టోర్నమెంట్స్‌లో పాల్గొంది? భవిష్యత్తు లక్ష్యమేంటో ఈ కథనంలో చూద్దాం.

'గేమ్‌ అబ్బాయిలది, అమ్మాయిలది కాదు - స్టామినాది' - క్రికెట్‌లో సత్తా చాటుతోన్న ఖమ్మం యువతి

Khammam Young Girl Excels in Cricket : అబ్బాయిలే కాదు అమ్మాయిలూ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చని నిరూపిస్తోందీ యువ క్రీడాకారిణి. బ్యాట్‌తో సునాయాసంగా పరుగులు చేస్తూ, ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ రాష్ట్ర, జాతీయ పోటీల్లో పరుగుల వరద పారిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడం కోసం నిరంతరం శ్రమిస్తోంది ఖమ్మం జిల్లా మేడేపల్లికి చెందిన ప్రసాద్‌-లక్ష్మి దంపతుల కుమార్తె అంజలి.

తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అంజలికి క్రికెట్‌ అంటే మహా ఇష్టం. కుమార్తె ఆసక్తిని గుర్తించిన ప్రసాద్‌, ఆమెను క్రికెట్‌కు మరింత చేరువ చేయడం కోసం జిల్లా కేంద్రానికి మారారు. ప్రతి క్రికెటర్‌ ఆట గల్లీ నుంచే ప్రారంభం అవుతుంది. అంజలి కూడా అలానే మొదలుపెట్టింది. ఐదేళ్ల వయసు నుంచే అబ్బాయిలతో కలిసి క్రికెట్‌ ఆడేది. జిల్లా కేంద్రానికి వచ్చిన తర్వాత వడివడిగా నేర్చుకుంది. పదేళ్ల వయసులోనే 8 కిలోమీటర్లు నడుచుకుంటూ మైదానానికి వచ్చి నెట్స్ ప్రాక్టీస్‌ చేసేదాన్ని అని అంజలి చెబుతోంది.

షైనింగ్ స్టార్ త్రిష పూజిత - మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో తెలుగుమ్మాయి హవా

హెచ్‌సీఏ తరఫున 5 టోర్నీలు : క్రికెట్‌లో అంజలి చురుకుదనాన్ని గుర్తించిన ఖమ్మం మహిళా క్రికెట్ అసోసియేషన్ కోచ్‌ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, తండ్రి ప్రసాద్‌ ఆమె వెన్నంటే ఉండి ముందుకు నడిపించాడు. దాంతో అనతికాలంలోనే జిల్లా, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో ప్రతిభ కనబరిచానని చెబుతోంది ఈ యువ క్రీడాకారిణి. ఉస్మానియా, కాకతీయ వర్సిటీల మహిళా జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించింది అంజలి. జాతీయ సీనియర్‌ మహిళా క్రికెట్‌ వన్డే టోర్నీలో సత్తా చాటింది. తెలంగాణ అండర్‌-19 తరఫున అద్భుత ప్రదర్శన చేసింది. ఆల్ ఇండియా సౌత్ జోన్ యూనివర్సిటీ స్థాయి టోర్నీలో సెంచరీతో చెలరేగింది. ఇప్పటి వరకు హెచ్‌సీఏ తరఫున 5 టోర్నీల్లో పాల్గొన్నట్లు అంజలి చెబుతోంది.

అథ్లెటిక్‌ కోచ్‌గా ఆదిలాబాద్ అడవి బిడ్డ - గిరిజన విద్యార్థులకు శిక్షణ

ఇండియా జెర్సీ ధరించడమే లక్ష్యం : తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రికెట్‌లో రాణిస్తున్నానని అంటోంది అంజలి. తమ్ముడు, చెల్లెలు కూడా క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించారని, భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించమే లక్ష్యమని చెబుతోంది అంజలి. మిథాలీరాజ్‌ వంటి మేటి క్రికెటర్లు ఖమ్మం క్రికెట్‌ అసోసియేషన్‌లో శిక్షణ పొందారని కోచ్‌ మతిన్‌ చెబుతున్నారు. సాధించాలనే తపన, అందుకోసం శ్రమించేతత్వం అంజలిలో మెండుగా ఉన్నాయని వివరిస్తున్నారు. అనతికాలంలోనే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది అంజలి. ఇండియా జెర్సీ ధరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

వీరోచితమైన విలు విద్యలో వరుస పతకాలు - ఆర్చరీ పోటీల్లో సత్తా చాటుతోన్న వరంగల్​ కుర్రాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.