ETV Bharat / state

'2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు'- సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 1:36 PM IST

AP_Govt_and_APPSC_Appeal_in_HC_on_2018_Group1_Issue
AP_Govt_and_APPSC_Appeal_in_HC_on_2018_Group1_Issue

AP Govt and APPSC Appeal in HC on 2018 Group1 Issue: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను రద్దును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించాయి. ఏపీపీఎస్సీపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేశాయి.

AP Govt and APPSC Appeal in HC on 2018 Group1 Issue: ఏపీపీఎస్సీపై తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించాయి. 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌ దాఖలు చేశాయి. దీనిపై మంగళవారం విచారణ జరుపుతామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో తప్పులు - ‘అతివాద దశ’ బదులుగా తీవ్రవాద దశ!

కాగా 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. జవాబుపత్రాల మూల్యాంకనానికి వైసీపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. రెండోసారి, మూడోసారి చేపట్టిన మూల్యాంకనాలూ న్యాయబద్ధంగా లేవని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీ చేసిన జాబితాను రద్దుచేసింది.

6 నెలల్లో మళ్లీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని పేర్కొంది. పరీక్షకు ముందు అభ్యర్థులకు కనీసం రెండు నెలల టైమ్ ఇవ్వాలని పేర్కొంది. ఇప్పటికే ఎంపికై పోస్టింగ్‌ తీసుకున్నఅభ్యర్థులు హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో హక్కులను కోరబోమని, న్యాయస్థానం ఆదేశాలతో ఏపీపీఎస్సీకి అఫిడవిట్‌ ఇచ్చారని గుర్తుచేసింది. హైకోర్టు న్యాయమూర్తి సింగిల్‌ జడ్జి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు.

ముగిసిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ - ఒంగోలులో కాపీ చేస్తూ పట్టుబడిన అభ్యర్థి

APPSC Chairman Gautam Sawang on 2018 Group1 Issue: అయితే 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మెయిన్స్ పరీక్ష ప్రశ్నాపత్రాలను ఒకేసారి మాన్యువల్ వ్యాల్యువేషన్ చేశామని, రెండోసారి జరగలేదని పేర్కొన్నారు. 162 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు 55 రోజులు క్యాంపులో కూర్చుని వ్యాల్యువేషన్ చేశారన్నారు. వ్యాల్యువేషన్​ ప్రక్రియ అంతా సీసీ కెమెరాలో రికార్డు చేసినట్లు తెలిపారు.

నియామకాలకు సంబంధించి అన్ని ఆధారాలూ ఏపీపీఎస్సీ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ఉద్యోగాలు చేస్తున్న 162 ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి న్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. మెయిన్స్​ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్​ కాపీని చదివామన్న ఆయన దీనిపై అప్పీలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఈవాళ దీనిపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అప్పీల్ దాఖలు చేశారు.

ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగులు - అడ్డుకున్న పోలీసులు - పలువురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.