ETV Bharat / state

స్థిరాస్తులే లేని జగన్ కుటుంబానికి లక్షలాది కోట్ల ఆస్తులెలా వచ్చాయి?: ఆనం - Anam Venkata Ramana Reddy

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 5:07 PM IST

Updated : May 5, 2024, 5:31 PM IST

Anam Venkata Ramana Reddy Key comments: జగన్ రెడ్డికి గిఫ్ట్ లుగా ఆస్తులను ఇచ్చిన రాజశేఖర్​రెడ్డి.. షర్మిలకు ఎందుకు ఇవ్వలేదని ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. జగన్ రెడ్డిపై 32 క్రిమినల్ కేసులు ఉంటే అవన్నీ మనీలాండరింగ్ కేసులేనని తెలిపారు. వైఎస్ సీఎం అయ్యాక జగన్ లక్షల కోట్లు జనం సొమ్ములు కొట్టేశారని ధ్వజమెత్తారు.

Anam Venkata Ramana Reddy Key comments
Anam Venkata Ramana Reddy Key comments (Etv Bharat)

Anam Venkata Ramana Reddy Key comments: తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని సంపాదించిన వేలకోట్ల ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లో జగన్‌ చూపించలేదని, తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. పైగా కంపెనీల్లో ఉన్న షేర్ల విలువల్లోనూ కొన్నప్పటి ధరనే చూపించారన్నారు. అన్నీ సరిచేసి అసలు ఆస్తుల వివరాలను వెల్లడించాలన్న ఆనం, ఈసీ కూడా ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్థిరాస్తులులే లేని జగన్ కుటుంబానికి లక్షలాది కోట్ల ఆస్తులా వచ్చాయని ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. జగన్ రెడ్డికి తన తండ్రి ఒక్క స్థిరాస్తి కూడా ఇవ్వలేదని జగన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. జగన్ రెడ్డికి గిఫ్ట్ లుగా ఆస్తులును ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి, షర్మిలకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. జగన్ రెడ్డిపై 32 క్రిమినల్ కేసులు ఉంటే అవి అన్నీ మనీలాండరింగ్ కేసులేనని మండిపడ్డారు. వైఎస్ సీఎం అయ్యాక జగన్ లక్షల కోట్లు జనం సొమ్ములు కొట్టేశారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి కంపెనీలు అన్నీ ప్రైవేట్ కంపెనీలే, ఒక్కటి కూడా లిమిటెడ్ కంపెనీ లేదన్నారు. లిమిటెడ్ కంపెనీలైతే జగన్ రెడ్డి గుట్టు బయట పడుతుందన్న భయమని విమర్శించారు. 19 ఏళ్ల క్రితం పెట్టిన పెట్టుబడి ధరనే చూపిస్తూ జగన్ జనాలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. అప్పటి పెట్టుబడుల విలువ ఇప్పటి అసలు ప్రైజ్ చూస్తే 1,458 కోట్ల పైనేనని ఆక్షేపించారు. హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్, బెంగుళూరులో ఉన్న ప్యాలెస్, మాల్ ను జగన్ అఫిడవిట్ లో చూపించలేదని ఎద్దేవా చేశారు.

రాయి ఘటన విఫలం - వైఎస్ కుటుంబంలో కొందరికి ప్రాణహాని !: ఆనం వెంకట రమణారెడ్డి - TDP Leader Anam on CM Jagan Attack

రాజశేఖరరెడ్డి మరణించే వరకూ జగన్ వద్ద, ఒక్క రూపాయి కూడా లేదని ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ఆస్తి పంపకాల్లో షర్మిలకు అన్యాయం జరిగిందని ఆనం ఆరోపించారు. రాజశేఖరరెడ్డి మాత్రం షర్మిలకు అన్యాయం చేయడని పేర్కొన్నారు. జగన్, షర్మిల రెండు కళ్లు అనే విజయమ్మ.. షర్మిలకు జరిగిన అన్యాయంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. జగన్ అఫిడవిట్​లో లోపాలు ఉన్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోని, తాజా అఫిడవిట్ దాఖలు చేసేవిధంగా ఈసీ ఆదేశించాలని కోరారు. జగన్ అక్రమాలకు సంబంధించి పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా అక్రమంగా సంపాదించిన ప్రతి పైసా బయటకు తీస్తామని పేర్కొన్నారు. ఆస్తుల వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడిస్తే, దేశంలో అత్యంత సంపన్న సీఎం జగనే అవుతారని ఆనం ఎద్దేవా చేశారు. మీ భూమి అయినా మీ భూమి కాదు అనేలా, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందని ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు.

జగన్‌ మళ్లీ సీఎం అయితే రాష్ట్రం డ్రగ్స్‌ మాఫియా కేంద్రంగా మారుతుంది: ఆనం - Anam Allegations on CM Jagan

Last Updated :May 5, 2024, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.