ETV Bharat / sports

విరాట్ 'నో బాల్' కాంట్రవర్సీ- అంపైర్ల క్లారిటీ! - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 6:56 AM IST

Updated : Apr 22, 2024, 7:21 AM IST

Virat Kohli No Ball Controversy
Virat Kohli No Ball Controversy

Virat Kohli No Ball Controversy: ఆర్సీబీ- కేకేఆర్ మ్యాచ్​లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఔట్​ వివాదం నెట్టింట హాట్​ టాపిగ్​గా మారింది. అయితే దీనిపై అంపైర్లు క్లారిటీ ఇచ్చారు.

Virat Kohli No Ball Controversy: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నో బాల్ వివాదంపై అంపైర్లు క్లారిటీ ఇచ్చారు. అతడు ఆదివారం జరిగిన ఆర్సీబీ- కేకేఆర్ మ్యాచ్​లో భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హర్షిత్ రానా బౌలింగ్​లో రిటర్న్​ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే 'అది నో బాల్ కదా' అని విరాట్ రివ్యూ కోరేందుకు సిద్ధమయ్యాడు. కానీ, అంతలోపే ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్​కు సిఫార్సు చేశాడు. రిప్లై చూసిన థర్డ్ అంపైర్ కూడా దాన్ని ఔట్​గా ప్రకటించాడు. దీంతో విరాట్ తీవ్ర అసహనంతో మైదానాన్ని వీడాడు.

అయితే దీనిపై థర్డ్ అంపైర్ స్పందించారు. బంతి బ్యాటర్​ నడుం కంటే ఎత్తులో వెళ్తే దాన్ని నో బాల్​గా ప్రకటిస్తారు. కానీ, ఆ బంతిని ఆడుతున్నప్పుడు బ్యాటర్ క్రీజు లోపల ఉండాలి. అయితే ఆదివారం నాటి మ్యాచ్​లో విరాట్ క్రీజు బయటకు వచ్చి ఆ బంతిని ఆడాడు. దీంతో బంతి విరాట్ నడుం కంటే ఎత్తులో వచ్చినా ఔట్​గా పెలివియన్ చేరాల్సి వచ్చింది. అయితే విరాట్ నడుం ఎత్తు 1.04 మీటర్లు కాగా, అతడు ఆడుతున్నప్పుడు బంతి 0.92 మీటర్ల ఎత్తులో వచ్చిందని అంపైర్ టెక్నాలజీ సాయంతో నిర్దారించారు. ఇక ఈ మ్యాచ్​లో విరాట్ 7 బంతుల్లోనే 18 పరుగులు చేశాడు. అందులో రెండు సిక్స్​లు, ఒక ఫోర్ ఉన్నాయి.

మ్యాచ్ తర్వాత కూడా: ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత, తన ఔట్​ వివాదంపై విరాట్​కు అంపైర్​ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రజెంటేషన్ తర్వాత విరాట్ డ్రెస్సింగ్ రూమ్​ వైపు వెళ్తుండగా అతడిని అంపైర్ ఆపాడు. ఈ తన ఔట్​ గురించి విరాట్​కు వివరించాడు. విరాట్- అంపైర్ మధ్య కాసేపు సంభాషణ సాగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

ఇక మ్యాచ్​ విషయానికొస్తే, కేకేఆర్ నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనను ఆర్సీబీ ఘనంగా ఆరంభించింది. రన్​రేట్ 10కి తగ్గకుండా పరుగులు చేసింది. కానీ, చివర్లో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం వల్ల కేకేఆర్ పట్టు సాధించింది. ఆఖరి బంతికి 1 పరుగు తేడాతో నెగ్గింది. ఆర్సీబీ 221 పరుగులకు ఆలౌటైంది.

ఆర్సీబీ ప్లే ఆఫ్​ ఆశలు గల్లంతు - ఒక్క పరుగు తేడాతో కోల్​కతా విజయం - IPL 2024

విరాట్​కు అరుదైన గౌరవం- మైనపు విగ్రహ ఆవిష్కరణ- ఫొటోలు చూశారా? - Virat Kohli Wax Statue

Last Updated :Apr 22, 2024, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.