ETV Bharat / sports

ఇన్​స్టాలో విరాట్ సెన్సేషన్ - ఆ ఘనత అందుకున్న తొలి భారతీయుడిగా రికార్డు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 3:50 PM IST

Updated : Feb 25, 2024, 4:00 PM IST

Virat Kohli Instagram Posts : టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఆ విశేషాలు మీ కోసం

Virat Kohli Instagram Posts
Virat Kohli Instagram Posts

Virat Kohli Instagram Posts : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్​కు దూరంగా ఉన్నారు. ఇటీవలే ఆయన సతీమణి అనుష్క 'అకాయ్'​ అనే పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తన ఫ్యాన్స్​ కోసం నెట్టింట ఈ సంతోషకరమైన వార్తను తెలియజేశారు. అయితే ఈ ఆనందంలో ఉన్న విరాట్, తాజాగా సోషల్​ మీడియా వేదికగా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్​తో పాటు తాను అప్​లోడ్ చేసిన మరో ఆరు పోస్ట్‌లకుగానూ ప్రతి దానికి దాదాపు 10 మిలియన్లకు పైగా లైక్స్​ అందుకున్నాడు. ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా 6 పోస్ట్‌లకు 10 మిలియన్లకు పైగా లైక్‌లు పొందిన తొలి భారతీయుడిగా కోహ్లీ చరిత్రకెక్కాడు.

బాబు పేరు 'అకాయ్'
Virat Kohli Son : అకాయ్​ పుట్టిన ఆనందాన్ని విరాట్​ తన ఫ్యాన్స్​తో ఓ స్వీట్ పోస్ట్ ద్వారా పంచుకున్నాడు. అందులో ఆ చిన్నారి పేరును రివీల్ చేస్తూనే తనను ఆశీర్వదించమంటూ కోరాడు.
'మేం ఫిబ్రవరి 15న మా బేబి బాయ్ అకాయ్ (వామికకు తమ్ముడు)ను ఈ ప్రపంచంలోకి స్వాగతించాం. మా జీవితంలో ఇవి మధురమైన క్షణాలు. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి' అని విరాట్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. దీంతో సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విరాట్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక 2017 ఇటలీలో విరాట్- అనుష్క వివాహం గ్రాండ్​గా జరిగింది. వీరికి 2021 జనవరి 11న వామిక అనే కుమార్తె జన్మించింది.

అప్పట్నుంచి ప్రచారం: 2023 వరల్డ్​కప్​లో సమయంలో విరాట్- అనుష్క బెంగళూరులోని ఓ హోటల్​కు డిన్నర్​కు వెళ్లారు. అప్పుడు అనుష్క ప్రెగ్నెంట్ అని, బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుందని పలు కథనాలు వచ్చాయి. అప్పటినుంచి విరాట్- అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారన్న వార్తలు ప్రారంభమయ్యాయి. ఇక రీసెంట్​గా ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​ నుంచి విరాట్ తప్పుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

అప్పుడే జూనియర్ కోహ్లీ 'అకాయ్' రికార్డ్​ - పాకిస్థాన్‌లో ఫ్యాన్స్​ సంబరాలు!

అకాయ్‌ : కోహ్లీ - అనుష్క కొడుకు పేరుకు అర్థమేంటో తెలుసా?

Last Updated :Feb 25, 2024, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.