ETV Bharat / sports

అండర్ -19 వరల్డ్ కప్​ : పాకిస్థాన్​ గెలవాలని కోరుకుంటున్న భారత్ ఫ్యాన్స్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 9:21 AM IST

U19 World Cup 2024 IND vs PAK : ఈ మెగాటోర్నీలో పాకిస్థాన్​ జట్టు గెలవాలని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే?

అండర్ -19 వరల్డ్ కప్​ : పాకిస్థాన్​ గెలవాలని కోరుకుంటున్న భారత్ ఫ్యాన్స్!
అండర్ -19 వరల్డ్ కప్​ : పాకిస్థాన్​ గెలవాలని కోరుకుంటున్న భారత్ ఫ్యాన్స్!

U19 World Cup 2024 IND vs PAK : పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే క్రికెట్ అభిమానులకు ఉండే మజానే వేరు. గతేడాది వన్డే వరల్డ్​ కప్‌, ఆసియా కప్‌లో ఈ దాయాదుల పోరును ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు మరోసారి భారత్ - పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ను వీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది సీనియర్ల మధ్య మ్యాచ్‌ కాదు. యంగ్ టీమ్స్​ తలపడుతున్న అండర్‌ 19 వరల్డ్​ కప్​లో!

ప్రస్తుతం సూపర్‌ - 6 దశలో ఇండియా - పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లోనే ఉన్నాయి. కానీ, షెడ్యూల్‌ ప్రకారం గ్రూప్‌ ఏ లోని జట్లు గ్రూప్‌ బీలోని టీమ్‌లతోనే పోటీపడాలి. దీంతో భారత్ - పాక్​ మ్యాచ్‌ను ఈ దశలో చూసే అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు ఫైనల్‌లో మాత్రం ఆ ఛాన్స్ ఉంది. రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్‌ విజయం సాధిస్తే ఇది జరుగుతుంది. ఎలాగో ఇప్పటికే భారత్‌ ఫైనల్​ మ్యాచ్​కు అర్హత సాధించింది. ఇక తుదిపోరు చేరే రెండో జట్టేదో నేడు(ఫిబ్రవరి 8) తేలిపోతుంది.

రివెంజ్ తీర్చుకోవాలని : వరుసగా ఐదుసార్లు అండర్ 19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది టీమ్‌ఇండియా. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 15 ఎడిషన్లు జరిగాయి. భారత్ 9 సార్లు టైటిల్‌ పోరుకు దూసుకెళ్లింది. ఇందులో ఐదుసార్లు విజయం సాధించింది. కానీ, ఇండియా-పాక్‌ జట్లు కేవలం ఒక్కసారి మాత్రమే తుదిపోరులో తలపడ్డాయి. అదీ 2006లో. అప్పుడు పాకిస్థాన్‌ విజయం సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. దీంతో ఇప్పుడు పాకిస్థాన్​ ఫైనల్​కు వెళ్తే రివెంజ్ తీర్చుకోవాలని భారత్‌ అభిమానులు బలంగా ఆశిస్తున్నారు.

కాగా, ప్రస్తుత ప్రపంచ కప్​లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమ్​ఇండియా వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో పోరాడి మరీ గెలిచిన మన ప్లేయర్స్​ ఫుల్ జోష్​లో ఉన్నారు. ఇక పాకిస్థాన్​ కూడా సెమీస్‌ వరకు ఓటమి లేకుండానే వచ్చింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయలేం. చూడాలి మరి ఆసీస్​పై పాక్​ గెలిచి ఫైనల్​లో భారత్​తో తలపడుతుందో లేదో.

ఇంగ్లాండ్​తో సిరీస్​ - గుబులు పుట్టిస్తున్న కోహ్లీ డెసిషన్​!

చరిత్ర సృష్టించిన బుమ్రా- టీమ్​ఇండియా నుంచి తొలి పేసర్​గా రికార్డ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.