ETV Bharat / sports

ట్రావిస్​ హెడ్​ కలర్ ఫాంటసీ- 'బ్లూ జెర్సీ కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నాడు' - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 2:22 PM IST

Updated : Apr 21, 2024, 2:33 PM IST

Travis Head IPL
Travis Head IPL

Travis Head IPL 2024: సన్​రైజర్స్ హైదరాబాద్​ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రస్తుత సీజన్​లో ఫుల్ ఫామ్​లో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్​లో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు.

Travis Head IPL 2024: 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్ ఓపెనింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ భారీ స్కోర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. ఈ సీజన్​లో వరుసగా 62, 19, 31, 21, 108, 89 స్కోర్లు బాదాడు. మొత్తం 6 మ్యాచ్​లు ఆడిన హెడ్ 216 స్ట్రైక్ రేట్​తో 324 పరుగులు బాది సన్​రైజర్స్ భారీ స్కోర్లు సాధించడంలో బాటలు వేశాడు. ఈ క్రమంలోనే హెడ్ ప్రస్తుత సీజన్​లో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

అయితే హెడ్ ఈ సీజన్​లో భారీ స్కోర్లు నమోదు చేయడంలో ఓ ప్రత్యేకత ఉంది. అతడు ముంబయి ఇండియన్స్​ (62), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (102), దిల్లీ క్యాపిటల్స్ (89) జట్లపైనే భారీ స్కోర్లు సాధించాడు. అయితే హెడ్ బ్ల్యూ కలర్ జెర్సీ ప్రత్యర్థులపైనే 253 పరుగులు బాదడం విశేషం. దీంతో హెడ్​- బ్ల్యూకలర్ జెర్సీకి మధ్య భలే పోటీ ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్​ క్రియేట్ చేస్తున్నారు. 'బ్లూ కలర్ జెర్సీ కనిపిస్తే చాలు హెడ్ రెచ్చిపోతున్నాడు', 'హెడ్​ను ఆపాలంటే బ్లూ జెర్సీ ధరించకూడదు' అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

ఇక 2016లో ఐపీఎల్​లో అరంగేట్రం చేసిన హెడ్​ అప్పట్లో ఆర్సీబీ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అప్పట్నుంచి అడపాదడపా అవకాశాలు తప్పా హెడ్​కు పెద్దదా ఛాన్స్​లు రాలేదు. ఇక మిడిలార్డర్​లో క్రీజులోకి వచ్చే హెడ్ ఆకట్టుకోలేదు. కానీ, ఈ సీజన్​ కోసం సన్​రైజర్స్​తో చేరిన హెడ్​కు ఓపెనర్​గా ప్రమోషన్ దక్కింది. అంతే అవకాశం రావడమే ఆలస్యం అన్నట్లుగా అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడి ఐపీఎల్​ కెరీర్​లో ఇప్పటివరకు 16 మ్యాచ్​లు ఆడిన హెడ్ 539 పరుగులు చేశాడు. అందులో ఈ సీజన్​లోనే 324 పరుగులు బాదడం గమనార్హం. అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ భారీ స్కోర్లు కూడా ఇదే సీజన్​లో సాధించనవే. అంటే అంతకుముందు ఆయ సీజన్లలో 10 మ్యాచ్​లు ఆడిన హెడ్ 204 పరుగులే నమోదు చేశాడు.

సన్​రైజర్స్ ఆ'రేంజ్​' మారింది- సక్సెస్ వెనకాల 'ఒక్కడు'- చెప్పిమరి చేస్తున్నాడుగా! - IPL 2024

సన్​రైజర్స్ x దిల్లీ- ఆరెంజ్ కాదు డేంజర్ ఆర్మీ- దెబ్బకు రికార్డులు బ్రేక్! - IPL 2024

Last Updated :Apr 21, 2024, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.