ETV Bharat / sports

కశ్మీర్ ట్రిప్ హైలైట్స్ షేర్ చేసిన సచిన్- క్రికెట్​ గాడ్ ట్వీట్​కు మోదీ రిప్లై

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 5:04 PM IST

Updated : Feb 28, 2024, 5:19 PM IST

Sachin Tendulkar Modi: టీమ్ఇండియా దిగ్గజం సచిన్ కశ్మీర్ ట్రిప్​కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించి, ఆయనను ప్రశంసించారు.

Sachin Tendulkar Modi
Sachin Tendulkar Modi

Sachin Tendulkar Modi: క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ రీసెంట్​గా ఫ్యామిలీతో కలిసి కశ్నీర్​లో పర్యటించారు. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ, సచిన్ ఫ్యామిలీతో సరదాగా గడిపారు. ఈ నేపథ్యంలో ఆయన జవాన్లతో ముచ్చటించారు. అలాగే క్రికెట్ బ్యాట్​ల తయారీ కంపెనీని సందర్శించి, పారా క్రికెటర్ అమీర్​ను కలిశారు. ఈ ఫొటోలు, వీడియోలను సచిన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే తాజాగా ఆయన మొత్తం ట్రిప్​కు సంబంధించి 'నా కశ్మీర్​ ట్రిప్​లో టాప్ మూమెంట్స్​' అని ఓ క్యాప్షన్​తో వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కశ్మీర్​ ట్రిప్​లో 'ఉజ్వల భారత్​' గురించి చెప్పడం అద్భుతమంటూ సచిన్​ను మోదీ ప్రశంసించారు.

'కశ్మీర్‌ ట్రిప్​ నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చుట్టూ మంచుతో కప్పి ఉన్నప్పటికీ, ఇక్కడి ప్రజల ఆతిథ్యం అమోఘం. భారత్​లో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని ప్రధాని మోదీజీ అన్నారు. ఈ ట్రిప్‌ తర్వాత ఆయన మాటలతో నేను ఏకీభవిస్తున్నా. కశ్మీర్‌ విల్లో బ్యాట్లు 'మేక్‌ ఇన్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ వరల్డ్‌'కు ఉదాహరణ. ఈ బ్యాట్లను ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. పర్యటన తర్వాత నేను చెప్పేది ఒక్కటే 'ఉజ్వల భారత్‌' ఆణిముత్యాల్లో ఒకటైన జమ్మూకశ్మీర్‌కు సందర్శించి ఇక్కడి ప్రకృతిని ఆస్వాదించండి' అని సచిన్‌ ట్విట్టర్​లో రాసుకొచ్చారు.

ఈ ట్వీట్​కు మోదీ స్పందిస్తూ 'అద్భుతం. మీ ట్రిప్​ నుంచి యువత రెండు విషయాలు తెలుసుకోవాలి. అందులో ఒకటి, ఉజ్వల భారత్‌లో ఎన్నో పర్యటక ప్రాంతాలు ఉన్నాయి. రెండోది, మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాముఖ్యత. మనమంతా కలిసి వికసిత్, ఆత్మ నిర్భర భారత్​ను నిర్మిద్దాం' అని రీ ట్వీట్ చేశారు.

ఫ్యాన్​కు సర్​ప్రైజ్: ఇదే ట్రిప్​లో సచిన్ తన అభిమాని పారా క్రికెటర్ అమీర్​ను కలిశారు. ఆతడి ఇంటికి వెళ్లి అమీర్​ను క్రికెట్ గాడ్ సర్​ప్రైజ్ చేశారు. అభిమాన క్రికెటర్ తన ఇంటికి రావడం వల్ల అమీర్ భావోద్వేగానికి లోనయ్యారు. అమీర్ ఇంటికి వెళ్లిన సచిన్ అతడితో కాసేపు ముచ్చటించారు. తాను ఆటోగ్రాఫ్ (Autograph Cricket Bat) చేసిన బ్యాట్​ను అమీర్​కు సచిన్​ బహుమతిగా ఇచ్చారు.

'అమీర్ రియల్ హీరో'- పారా క్రికెటర్​పై సచిన్ ప్రశంసలు

14 ఏళ్ల క్రితం సచిన్ డబుల్ సెంచరీ - వన్డే హిస్టరీలో బెస్ట్ మూమెంట్​!

Last Updated : Feb 28, 2024, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.