ETV Bharat / sports

2007లో సచిన్- 2024లో ధోనీ- ఇద్దరిదీ ఒకే బాట - Sachin Tendulkar Dhoni Captaincy

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 4:47 PM IST

Sachin Tendulkar Dhoni Captaincy
Sachin Tendulkar Dhoni Captaincy

Sachin Tendulkar Dhoni Captaincy: ఒక క్రికెట్‌ టీమ్‌కి కెప్టెన్‌ అవ్వడం మామూలు విషయం కాదు. ఆ అవకాశం అందుకోవడానికి అందరికీ అర్హత ఉండదు. ఇప్పుడు ధోని, రుతురాజ్‌కి సీఎస్కే కెప్టెన్సీ ఇచ్చినట్లే అప్పుడు సచిన్‌, ధోనీని రికమండ్‌ చేశాడని మీకు తెలుసా?

Sachin Tendulkar Dhoni Captaincy: 2024 ఐపీఎల్‌ 17వ సీజన్‌కి ముందు క్రికెట్ కెప్టెన్సీకి సంబంధించి చాలా వివాదాలే నడిచాయి. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ని తప్పించి పాండ్యాకి పగ్గాలు ఇవ్వడం పెద్ద దుమారమే లేపింది. మరోవైపు రోహిత్‌లానే ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా నిలిచిన ధోని కూడా కెప్టెన్సీని వదిలేశాడు. అయితే ఇందులే వివాదాలేవీ లేవు. అందరూ ధోని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ధోని తనంతట తానే రుతురాజ్‌కి బాధ్యతలు అప్పగించారు. అయితే ఇలానే ధోని కోసం సచిన్‌ కెప్టెన్సీ వదిలేశాడని ఎంత మందికి తెలుసు?

క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ జియో సినిమా మ్యాచ్ సెంటర్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్నాడు. భారత్‌ క్రికెట్ లీడర్‌షిప్‌ని రూపొందించడంలో తన కీలక పాత్ర గురించి మాట్లాడాడు. 2007లో భారత్‌ వైట్- బాల్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీని నియమించాలనే నిర్ణయాన్ని తాను ఎలా ప్రభావితం చేశాననే అంశాలను తెందూల్కర్ వివరించాడు.

కెప్టెన్సీ వద్దన్న సచిన్‌
2007లో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న శరద్ పవార్ సచిన్‌ని కెప్టెన్‌గా ఉండమన్నప్పుడు జరిగిన విషయాలు తెలిపాడు. శరద్‌ పవార్‌ సచిన్‌ని టీమ్‌ఇండియాకి కెప్టెన్‌గా ఉండమని అడిగినప్పుడు 'నా బాడీ టెరిబుల్‌ షేప్‌లో ఉంది. నేను కెప్టెన్‌గా ఉండలేను. అప్పుడప్పుడూ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి, యాంకిల్‌కి పట్టీలు వేసుకుని, భుజానికి ట్రీట్‌మెంట్ చేయించుకుని వస్తుంటాను. ఇవన్నీ మా టీమ్‌కి సరైనవి కావు' అని చెప్పినట్లు పేర్కొన్నాడు.

ధోనీ అవగాహన అద్భుతం
'ఎంఎస్ ధోనిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకు అతణ్ని రికమండ్‌ చేశాను. ఎందుకంటే నేను స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తుంటాను. నేను ధోనీతో చాలాసార్లు మాట్లాడాను. ఈ సిచ్యువేషన్‌లో నువ్వైతే ఏం చేసుంటావు? అని చాలా సార్లు అడిగాను. ధోనీ నుంచి వచ్చిన సమాధానాలు బ్యాలెన్స్‌డ్‌గా ఉండేవి. ధోని స్పందన సహజంగా ఉంటుంది, ప్రతి మూమెంట్‌పైన అతని అవగాహన గొప్పగా ఉంటుంది' అని సచిన్‌ తెలిపాడు. ధోనీ స్థిరత్వం, ప్రశాంతత, ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని సచిన్ ప్రశంసించాడు. గేమ్‌ని ధోనీ అర్థం చేసుకునే విధానం, పరిస్థితులకు తగినట్లు స్పందించే సామర్థ్యాన్ని మెచ్చుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. రుతురాజ్‌ గైక్వాడ్‌కి జట్టు పగ్గాలు అందించాడు. చాలా మంది ఫ్యాన్స్‌, విశ్లేషకులు ధోని గొప్పతనం, కెప్టెన్సీ గురించి సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంటున్నారు. ఈ సమయంలో తెందూల్కర్ షేర్‌ చేసుకున్న అంశాలు భారతదేశం అత్యంత విజయవంతమైన క్రికెట్ కెప్టెన్‌గా నిలిచిన ధోనీ సామర్థ్యాన్ని, కీర్తిని మరింత పెంచుతున్నాయి. అలాగే రుతురాజ్​ కూడా సీఎస్కేను సక్సెస్ బాటలో నడిపించాలని చెేన్నై ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రచిన్ రవీంద్ర - అరంగేట్రంలోనే అద్భుతం - IPL 2024 CSK VS RCB

వాళ్ల బ్యాగ్ మోసిన ధోనీ- ఫ్యాన్స్ ఫిదా!- వీడియో వైరల్ - MS Dhoni IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.