ETV Bharat / sports

రప్ఫాడించిన విల్ జాక్స్‌ - 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 7:09 PM IST

Etv Bharat
Etv Bharat

RCB VS GT IPL 2024 :ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యాన్ని ఒకే వికెట్ కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది.

RCB VS GT IPL 2024 : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​కు దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. దీంతో 201 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ ఒకే వికెట్ కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. ఇక బెంగళూరు ప్లేయర్స్ విల్ జాక్స్‌ శతకంతో రాణించగా, (100*), విరాట్ కోహ్లీ కూడా (70*) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో టార్గెట్​ను అలవోకగా సాధించారు. వికెట్ పడ్డాక వచ్చిన ఫాఫ్​ డుప్లెసిస్‌ (24) కూడా తన ఇన్నింగ్స్​తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక గుజరాత్‌ బౌలర్లలో రవి శ్రీనివాసన్‌ ఆ ఒక్క వికెట్​ను అందుకున్నాడు.

ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లగా బరిలోకి దిగిన వృద్ధిమాన్‌ సాహా (5), శుభ్‌మన్‌ గిల్‌ (16) తమ ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచారు. అయితే ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్‌ (84*) మాత్రం అజేయంగా పరుగులు సాధించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రత్యర్థులు వేసే ఎత్తులకు కళ్లం వేస్తూ వరుస ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత రెండో డౌన్‌లో వచ్చిన షారూఖ్‌ ఖాన్‌ (58) అర్ధసెంచరీతో రాణించాడు. అద్భుతమైన పార్ట్​నర్​షిప్​తో జోష్​లో ఉన్న ఈ ఇద్దరిని మహ్మద్​ సిరాజ్‌ విడగొట్టాడు.

ఆ తర్వాత బరిలోకి వచ్చిన డేవిడ్‌ మిల్లర్‌ (26*) కూడా మంచి స్కోర్ సాధించాడు. దీంతో కొద్ది సేపటికే వేగం పుంజుకుని గుజరాత్‌ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది. ఇక బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌, మహ్మద్ సిరాజ్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌ తలో వికెట్‌ తీశారు.

గుజరాత్‌ తుది జట్టు :
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్‌ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, రాహుల్ తెవాతియా,డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, నూర్ అహ్మద్.

ఇంపాక్ట్‌ ప్లేయర్స్​ : సందీప్ వారియర్, శరత్‌ బీఆర్, మానవ్‌ సుతార్, దర్శన్ నల్కండే, విజయ్‌ శంకర్

బెంగళూరు తుది జట్టు :
ఫాఫ్‌ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, దినేశ్‌ కార్తిక్ (వికెట్ కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్‌ శర్మ, సిరాజ్, యశ్ దయాల్, కామెరూన్ గ్రీన్, విల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్.

ఇంపాక్ట్ ప్లేయర్స్ : అనుజ్ రావత్, మహిపాల్ లామ్రోర్, హిమాన్షు శర్మ, ఆకాశ్‌ దీప్, విజయ్‌ కుమార్

'మంజ్రేకర్ T20 వరల్డ్​కప్​ టీమ్'- మాజీ క్రికెటర్ జట్టులో విరాట్​కు నో ప్లేస్ - 2024 T20 World Cup

కోహ్లీ అరుదైన రికార్డ్​ - ఐపీఎల్​ చరిత్రలోనే ఏకైక క్రికెటర్​గా - IPL 2024 SRH VS RCB

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.