ETV Bharat / sports

ఎట్టకేలకు గెలిచిన పాక్- 'అష్రఫ్​' రాజీనామాతో జట్టుకు మంచి రోజులు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 9:35 AM IST

Updated : Jan 21, 2024, 11:10 AM IST

Pak vs Nz 5th T20: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. న్యూజిలాండ్ పర్యటనలో వరుసగా నాలుగు టీ20ల్లో ఓడిన పాక్, ఆదివారం ఐదో మ్యాచ్​లో 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, పాక్ బోర్డుకు జాకా అష్రఫ్ రాజీనామా చేసిన మరుసటి రోజే తమ జట్టు గెలవడం వల్ల ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ అతడిని ట్రోల్​ చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

Pak vs Nz 5th T20: న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. ఆక్లాండ్ వేదికగా ఆదివారం (జనవరి 21) జరిగిన ఐదో టీ20 మ్యాచ్​లో పాక్ 42 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో క్లీన్​స్పీప్ ప్రమాదం నుంచి తప్పించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో కివీస్ 17.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో ఇఫ్తికార్ అహ్మద్ 3, షహీన్ అఫ్రిదీ, మహ్మద్ నవాజ్ తలో రెండు, జమర్ ఖాన్, ఉస్మాన్ మీర్ చెరో ఒక వికెట్ దక్కించుకున్నారు. ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను అతిథ్య న్యూజిలాండ్ 4-1 తేడాతో నెగ్గింది.

అతడు పోవడం వల్లే! పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ జాకా అష్రఫ్ శనివారం (జనవరి 20) తన పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత పాక్ ఆడిన తొలి మ్యాచ్​లోనే నెగ్గింది. దీంతో అష్రఫ్ పోవడం వల్లే పాక్​ జట్టు విజయం సాధించిందని ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మళ్లీ పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మంచి రోజులు వచ్చాయని కామెంట్ చేస్తున్నారు. 'నిన్న జాకా రిటైర్డ్ అయ్యాడు, నేడు పాక్ గెలిచింది' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, 'బోర్డుకు అష్రఫ్ రాజీనామా చేశాక పాక్ విన్నింగ్ పర్సెంటేజీ 100 శాతం' అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా, అంతర్జాతీయ క్రికెట్​లో వరుసగా ఏడు మ్యాచ్​ల తర్వాత తొలిసారి గెలుపు రుచి చూసింది.

PCB Chairman Resigns: శుక్రవారం (జనవరి 19) జరిగిన బోర్డు మీటింగ్ తర్వాత జాకా అష్రఫ్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2023 జూలై 6న పీసీబీ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అష్రఫ్, పదవీకాలం ఏడాది కూడా పూర్తి కాకుండానే రాజీనామా చేయడం గమనార్హం. అష్రఫ్ పదవీ కాలంలో పాక్ రెండు ఐసీసీ మేజర్ ఈవెంట్ (ఆసియా కప్, వన్డే వరల్డ్​కప్) ​లలో ఘోరంగా విఫలమైంది.

PCB ఛైర్మన్ పదవికి అష్రఫ్ రాజీనామా- వరుస వైఫల్యాలే కారణం!

పాకిస్థాన్​ను వదిలిన సర్ఫరాజ్- ఫ్యామిలీతో లండన్​కు షిఫ్ట్- కారణం ఏంటంటే?

Last Updated :Jan 21, 2024, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.