ETV Bharat / sports

వాంఖడేలో 'ముంబయి' విధ్వంసం- దిల్లీ ముందు భారీ టార్గెట్ - MI vs DC IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 5:46 PM IST

Updated : Apr 7, 2024, 7:02 PM IST

MI vs DC IPL 2024: సొంతమైదానంలో దిల్లీతో జరుగుతన్న మ్యాచ్​లో ముంబయి బ్యాటర్లు రెచ్చిపోయారు. ఏకంగా 234 పరుగుల భారీ స్కోర్ నమోదు చేశారు.

EtMI vs DC IPL 2024
MI vs DC IPL 2024

MI vs DC IPL 2024: వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్​ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ముంబయి బ్యాటర్లు దిల్లీ బౌలర్లపై దండయాత్ర చేశారు. రోహిత్ శర్మ (49 పరుగులు 27 బంతుల్లో ; 6x4, 3x6), ఇషాన్ కిషన్ (42 పరుగులు, 23 బంతుల్లో ; 4x4, 2x6) అదరగొట్టగా, టిమ్ డేవిడ్ (45 పరుగులు, 21 బంతుల్లో; 2x4, 4x6), రొమారియో షెపర్డ్ (39 పరుగులు, 10 బంతుల్లో) దిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ చివరి 30 బంతుల్లో 96 పరుగులు పిండుకున్నారు. దిల్లీ బౌలర్లలో నోకియా 2, అక్షర్ పటేల్ 2, ఖలీల్ అహ్మద్ 1 వికెట్ దక్కించుకున్నారు.

ఈ మ్యాచ్​లో నమోదైన రికార్డులు

  • ఐపీఎల్​ చరిత్రలో ఇది ముంబయి మూడో అత్యధిక (234-5) స్కోర్. ఇక టాప్​లో 246-5 (2024లో), 235-9 (2021లో) ఉన్నాయి.
  • ఐపీఎల్​లో 200+ స్కోర్ సాధించడం ముంబయికి ఇది 24వ సారి. ఈ క్రమంలో ఆర్సీబీ (24)ని ముంబయి సమం చేసింది. ఈ లిస్ట్​లో చెన్నై సూపర్​ కింగ్స్ (29 సార్లు) అందరికంటే ముందుంది. చెన్నై తర్వాత ముంబయి, ఆర్సీబీదే రెండో ప్లేస్.
  • దిల్లీపై ముంబయి 200+ స్కోర్ సాధించడం ఇది ఆరోసారి. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సార్లు 200+ స్కోర్లు సాధించిన జాబితాలో ఆర్సీబీతో కలిసి ముంబయి టాప్​లో ఉంది. ఆర్సీబీ కూడా పంజాబ్​పై ఆరుసార్లు 200+ స్కోర్లు సాధించింది.
  • ఓ టీ20 ఇన్నింగ్స్​​లో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ( 50+) సాధించకుండా భారీ ఇంతటి భారీ స్కోర్ (234-5) నమోదు చేయడం ఇదే తొలిసారి. ఇది కూడా ఓ రికార్డే.

ఖాతా తెరవని సూర్య: కొన్ని రోజులుగా గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న సూర్య కుమార్, ఆదివారం దిల్లీతో 2024 ఐపీఎల్​లో తొలి మ్యాచ్ ఆడాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సూర్య పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అన్రీచ్ నోకియా సూర్యను వెనక్కిపంపాడు. అయితే ముంబయి భారీ స్కోర్ అందుకోవడం వల్ల సూర్య వైఫల్యంపై పెద్దగా ప్రభావం పడలేదు.

ఐపీఎల్​లో రోహిత్ మరో ఘనత- దిల్లీపై క్రేజీ రికార్డ్ - Rohit Sharma IPL Record

'ముంబయి కాకపోతే కోల్​కతా కెప్టెన్ అవుతా'!- రోహిత్ షాకింగ్ డెసిషన్- వీడియో వైరల్ - Rohit Sharma KKR IPL

Last Updated : Apr 7, 2024, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.