ETV Bharat / sports

బుమ్రా@150, రోహిత్@100- ముంబయి x దిల్లీ మ్యాచ్​లో నమోదైన రికార్డులివే - MI vs DC IPL 2024 Match Records

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 8:25 PM IST

MI vs DC IPL 2024 Match Records: సొంతగడ్డపై ముంబయి ఆదివారం చెలరేగిపోయింది. ఆల్​రౌండ్ ప్రదర్శనతో దిల్లీని 29 పరుగుల తేడాతో ఓడించి ప్రస్తుత సీజన్​లో తొలి విజయం అందుకుంది. ఈ క్రమంలో ముంబయి పలు రికార్డులు నెలకొల్పింది. అవేంటంటే?

MI vs DC IPL 2024 Match Records
MI vs DC IPL 2024 Match Records

MI vs DC IPL 2024 Match Records: 2024 ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ బోణీ కొట్టింది. ఆదివారం సొంతగడ్డ వాంఖడేలో దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి 29 పరుగుల తేడాతో నెగ్గింది. ముంబయి నిర్దేశించిన 235 పరుగుల లక్ష్య ఛేదనలో దిల్లీ 205-8 పరుగులకే పరిమితమైంది. ముంబయి బౌలర్లలో గెరాల్డ్ కాట్జీ 4, జస్​ప్రీత్ బుమ్రా 2, రొమారియో షెపర్డ్ 1 వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ మ్యాచ్​తో ముంబయి ప్రస్తుత సీజన్​లో తొలి విజయం నమోదు చేయగా, దిల్లీ నాలుగో ఓటమి చవి చూసింది. ఇక ఈ మ్యాచ్​లో నమోదైన పలు రికార్డులుపై ఓ లుక్కేయండి

బుమ్రా@150: ఈ మ్యాచ్​లో 2 వికెట్లు పడగొట్టి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఐపీఎల్​లో బుమ్రా 150 వికెట్ల ఘనత అందుకున్నాడు. అభిషేక్ పోరెల్ వికెట్​తో బుమ్రా ఈ మైలురాయి అందుకున్నాడు. ఇప్పటివరకు 124 మ్యాచ్​లు ఆడిన బుమ్రా 150 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్​లో 150+ వికెట్లు పడగొట్టిన తొమ్మిదో బౌలర్​గా బుమ్రా రికార్డ్ కొట్టాడు. ఈ లిస్ట్​లో యుజ్వేంద్ర చాహల్ 195 వికెట్లతో టాప్​లో ఉన్నాడు.

రోహిత్ @100: హిట్​మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్​లో రిచర్డ్​సన్ క్యాచ్​ అందుకున్న రోహిత్ ఐపీఎల్​లో 100 క్యాచ్​లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్​లో 100 క్యాచ్​లు పూర్తి చేసుకున్న నాలుగో ప్లేయర్​గా నిలిచాడు. ఈ లిస్ట్​లో విరాట్ కోహ్లీ (110 క్యాచ్​లు), సురేశ్ రైనా (109), కీరన్ పోలార్డ్ (103) రోహిత్ కంటే ముందున్నారు.

  • ముంబయికి టీ20ల్లో ఇది 150వ విజయం. ఈ క్రమంలో టీ20ల్లో అత్యధిక విజయాలు (150*) నమోదు చేసిన జట్టుగా ముంబయి రికార్డు కొట్టింది. ఈ లిస్ట్​లో చెన్నై (148 విజయాలు), భారత్ (144) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • ఐపీఎల్​లో ఒకే జట్టు తరఫున 150+ వికెట్లు సాధించిన మూడో బౌలర్ నిలిచాడు బుమ్రా. ఈ లిస్ట్​లో అందరికంటే ముందు లసిత్ మలింగ 170 వికెట్లు (ముంబయి ఇండియన్స్), సునీల్ నరైన్ 166 వికెట్లు (కోల్​కతా నైట్​రైడర్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
  • ఈ మ్యాచ్​లో ముంబయి బ్యాటర్ రొమారియో షెపర్డ్ 10 బంతుల్లోనే 390.00 స్ట్రైక్ రేట్​తో 39 పరుగులు బాదాడు. ఈ క్రమంలో ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్​లో అత్యధిక స్ట్రైక్ (కనీసం 10 బంతులు ఎదుర్కొని) నమోదు చేసిన బ్యాటర్​గా రికార్డ్ కొట్టాడు.
  • ముంబయి ఐపీఎల్​లో ఒకే వేదికపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగానూ నిలిచింది. వాంఖడే స్టేడియంలో ముంబయి ఇప్పటివరకు 50 విజయాలు అందుకుంది. ఈ జాబితాలో కోల్​కతా నైట్​రైడర్స్ 48 విజయాలు (ఈడెన్ గార్డెన్స్), చెన్నై 47 విజయాలు (చిదంబరం స్టేడియం) వరుసగా ఉన్నాయి.
  • ఐపీఎల్​లో ముంబయి తొలి ఇన్నింగ్స్​లో 200+ పరుగులు సాధించిన ప్రతిసారీ మ్యాచ్​ నెగ్గింది. ఇప్పటివరకూ ముంబయి 14సార్లు 200+ పరుగులు సాధించగా 14సార్లు ఆ స్కోర్​ను కాపాడుకుంది.

వాంఖడేలో 'ముంబయి' విధ్వంసం- దిల్లీ ముందు భారీ టార్గెట్ - MI vs DC IPL 2024

'ముంబయి కాకపోతే కోల్​కతా కెప్టెన్ అవుతా'!- రోహిత్ షాకింగ్ డెసిషన్- వీడియో వైరల్ - Rohit Sharma KKR IPL

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.