ETV Bharat / sports

10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం​ IPL నుంచి ముంబయి బౌలర్ ఔట్ - ఇదేం రీజన్ రా బాబు!- నిజమెంత? - Kwena Maphaka IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 3:31 PM IST

Updated : Apr 13, 2024, 4:00 PM IST

Kwena Maphaka IPL 2024: ముంబయి యంగ్ బౌలర్ మఫాకా 10వ తరగతి పరీక్షలు రాయడం కోసం ఐపీఎల్​కు దూరమయ్యాడని ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

Kwena Maphaka IPL
Kwena Maphaka IPL

Kwena Maphaka IPL 2024: ముంబయి ఇండియన్స్ యంగ్ బౌలర్ క్వేన మఫాకా 2024 ఐపీఎల్ టోర్నమెంట్​కు దూరం కానున్నాడని సోషల్ మీడియాలో ఇటీవల వార్తలు వచ్చాయి. అతడు 10వ తరగతి పరీక్షలు రాయడానికి స్వదేశం సౌతాఫ్రికాకు బయల్దేరాడని ప్రచారం సాగింది. దీంతో ఐపీఎల్​లో ఆడే ప్లేయర్ ఇంకా స్కూల్​లో చదువుతున్నాడా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసింది. అవన్నీ రూమర్లేనని క్రీడా వర్లాల నుంచి క్లారిటీ వచ్చింది. క్వేన మఫాకాకు ప్రస్తుతం ఎలాంటి పరీక్షలు లేవట. అలాగే 2024 ఐపీఎల్​ సీజన్​ మొత్తానికి అందుబాటులోనే ఉండనున్నాడని తెలుస్తోంది. అయితే ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ మఫాకా ఘోరంగా విఫలమవ్వడం వల్ల తాత్కాలికంగా అతడు బెంచ్​కు పరిమితమైనట్లు సమాచారం.ఇక 2006లో జన్మించిన సౌతాఫ్రికా యంగ్ బౌలర్ మఫాకా రీసెంట్​ (ఏప్రిల్​ 08)గా 18 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

Kwena Maphaka U- 19 World Cup: ఇటీవల జరిగిన అండర్- 19 వరల్డ్​కప్​లో మఫాకా అద్భుతంగా రాణించాడు. ఈ టోర్నీలో ఏకంగా 21 వికెట్లు నేల కూల్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. దీంతో దిల్షన్ మధుషంక స్థానంలో ముంబయి ఇండియన్స్ మఫాకాను జట్టులోకి తీసుకుంది. దీంతో ఐపీఎల్​లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుల్లో ఒకడిగా మఫాకా రికార్డు కొట్టాడు. అయితే అరంగేట్ర మ్యాచ్​లోనే మఫాకా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ముంబయి- సన్​రైజర్స్​తో మ్యాచ్​లో మఫాకా ఏకంగా వికెట్ లేకుండా 66 పరుగులు ఇచ్చి, చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. తర్వాత రాజస్థాన్​తో మ్యాచ్​లో ఒక వికెట్ పడగొట్టినప్పటికీ 11.50 ఎకనమీతో 2 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు.

ఇక ఈ సీజన్​లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఆదివారం దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి బోణీ కొట్టింది. ఇప్పటివరకూ 4 మ్యాచ్​లు ఆడిన ముంబయి ఒక మ్యాచ్​లో నెగ్గింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 234 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం దిల్లీని 205 పరుగులకే కట్టడి చేసి 2024 సీజన్​లో గెలుపు రుచి చూసింది.

ముంబయి విజయం - 18 వేల మంది చిన్నారులతో నీతా అంబానీ సందడి - IPL 2024 DC VS Mumbai Indians

వాంఖడేలో 'ముంబయి' విధ్వంసం- దిల్లీ ముందు భారీ టార్గెట్ - MI vs DC IPL 2024

Last Updated :Apr 13, 2024, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.