ETV Bharat / sports

'అయ్యర్' ది విన్నింగ్ కెప్టెన్- ట్రోఫీతో ఫుల్ సెలబ్రేషన్స్- రోహిత్ రికార్డు సమం - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 9:35 AM IST

Shreyas Iyer IPL 2024: 10 ఏళ్లుగా టైటిల్ సాధించలేకపోతున్న కేకేఆర్​కు ట్రోఫీ అందించాడు యంగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఫైనల్​లో విజయం సాధించిన తర్వాత కేకేఆర్ ప్లేయర్ల సెలబ్రేషన్స్ మీరు చూశారా?

Shreyas Iyer KKR
Shreyas Iyer KKR (Source: Associated Press)

Shreyas Iyer IPL 2024: ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ తన జట్టును ఛాంపియన్​గా నిలిపాడు. ఈ క్రమంలో ఐపీఎల్​ టైటిల్ సాధించిన 8వ కెప్టెన్​గా అయ్యర్ రికార్డులకెక్కాడు. దాదాపు 10ఏళ్లుగా సాధించలేకపోతున్న ట్రోఫీ కలను నిజం చేశాడు. దీంతో కేకేఆర్ సంబరాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ శ్రేయస్ కూడా సెలబ్రేషన్స్​లో మునిగిపోయాడు. టైటిల్​ పట్టుకొని హోటల్ రూమ్​లో డ్యాన్స్ చేశాడు. కేక్​ కట్​చేసి కేకేఆర్ ప్లేయర్లు ఈ విక్టరీని గ్రాండ్​గా సెలబ్రేట్ చేసుకున్నారు.

అలా మొదలైంది
శ్రేయస్ అయ్యర్ 2015లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పట్నుంచి దాదాపు 6 సీజన్లపాటు దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2015లో అయ్యర్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా పొందాడు. ఆ తర్వాత పలు సీజన్లలో దిల్లీకి కూడా కెప్టెన్​గా వ్యవహరించిన అయ్యర్ 2020లో జట్టను ఫైనల్​ దాకా తీసుకెళ్లాడు. ఇక ఫైనల్​లో దిల్లీ ముంబయి చేతిలో ఓడి రన్నరప్​తో సరిపెట్టుకుంది.

ఇక 2022లో కోల్​కతాతో చేరిన తర్వాత ఇక్కడ కూడా అయ్యర్​కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రెండు సీజన్​లలో జట్టు 6వ స్థానానికే పరిమితమైంది. ఇక గంభీర్ రాకతో కెప్టెన్సీలోనూ మెరుగైన అయ్యర్ ఈసారి లీగ్ దశ నుంచే జట్టను సమర్థవంతంగా నడిపించాడు. అదే పట్టుదలతో అయ్యర్ ట్రోఫీ సాధించాడు. అంటే ఐపీఎల్​లో అరంగేట్రం చేసిన 9ఏళ్లకు అయ్యర్ టైటిల్ సాధించాడు. ఈ క్రమంలో ధోనీ, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య తర్వాత ఐపీఎల్ టైటిల్​ కొట్టిన 5వ ఇండియన్ కెప్టెన్​గా రికార్డు అందుకున్నాడు.

రోహిత్​తో సమంగా
తాజా విజయంతో అయ్యర్ మరో ఘనత సాధించాడు. ఐపీఎల్​లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు, టైటిల్ నెగ్గిన కెప్టెన్​​గా రోహిత్​తో సమానంగా నిలిచాడు. ఇదివరకు రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. రోహిత్ (ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు 2009లో), టైటిల్ (2013లో తొలి టైటిల్) సాధించిన రికార్డు కొట్టాడు. దీన్ని తాజాగా అయ్యర్ అందుకున్నాడు. గతంలో 2015లో అయ్యర్​కు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు దక్కగా, ఈ సీజన్​లో టైటిల్ నెగ్గిన కెప్టెన్​గా నిలిచాడు.

IPL​ ప్రైజ్​మనీ- 'కోల్​కతా'కు రూ.20 కోట్లు- మరి ఎవరెవరికి ఎంతంటే? - IPL 2024

కప్పు 'కోల్​కతా'దే- ఫైనల్​లో సన్​రైజర్స్ ఓటమి​ - SRH Lost In IPL 2024 Final

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.