ETV Bharat / sports

విరాట్​-తారక్ అంత మంచి ఫ్రెండ్సా? వీడియో కాల్స్ కూడానా? - Kohli NTR Friends

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 4:29 PM IST

Kohli NTR Friendship : టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ విరాట్‌ కోహ్లీకి తెలుగు హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టమని మీకు తెలుసా? తారక్‌ వ్యక్తిత్తం, డ్యాన్స్‌, యాక్షన్‌ గురించి కింగ్ ఏం చెప్పాడంటే?

Kohli NTR
Kohli NTR (ETV Bharat)

Kohli NTR Friendship : టీమ్​ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ పాపులారిటీ, ఫ్యాన్‌ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి అభిమానులు ఉన్నారు. అలాంటి కోహ్లీకి ఓ అభిమాన తెలుగు హీరో ఉన్నాడని మీకు తెలుసా? అతడి వ్యక్తిత్వం, యాక్షన్‌, డ్యాన్స్‌ అంటే విరాట్‌కి చాలా ఇష్టం. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఆ టాలీవుడ్‌ హీరో ఎవరో కాదు, జూనియర్‌ ఎన్టీఆర్‌. వీళ్ల ఇద్దరి బాండింగ్‌ గురించి రీసెంట్‌ ఇంటర్వ్యూలో కోహ్లీ షేర్‌ చేసుకున్న ఆసక్తికర అంశాలు ఇవే.

ఎన్టీఆర్‌ వ్యక్తిత్వానికి కోహ్లీ ఫిదా
"తెలుగు హీరోల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ నాకు మంచి స్నేహితుడు. యాక్టర్‌గానూ అతన్ని చాలా అభిమానిస్తా. కొన్నేళ్ల క్రితం ఓ యాడ్‌లో ఎన్టీఆర్‌తో కలిసి నటించా. ఈ సమయంలో ఎన్టీఆర్‌ వ్యక్తిత్వం చూసి ఫిదా అయిపోయా. తారక్ ఆప్యాయంగా మాట్లాడే తీరు నాకు చాలా నచ్చుతుంది" అని కోహ్లీ తెలిపాడు.

నాటు నాటు పాటకు విరాట్‌ స్టెప్పులు!
కోహ్లీకి ఆర్ఆర్ఆర్‌ మూవీలో నాటు, నాటు సాంగ్‌ అంటే చాలా ఇష్టం. తన వైఫ్‌ అనుష్క శర్మతో కలిసి నాటు నాటు సాంగ్‌కు స్టెప్‌లు వేసిన వీడియోలో సోషల్‌ మీడియాలో కూడా షేర్‌ చేశాడు. కోహ్లీ ఓ మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు, నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్‌ అవార్డ్‌ వచ్చిందని తెలిసింది. అప్పుడు గ్రౌండ్‌లోనే నాటు నాటు సాంగ్‌ స్టెప్పులు వేసి, తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. స్పెషల్‌ డేస్‌, ఈవెంట్స్‌ అప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు వీడియో కాల్‌ చేసి మాట్లాడుతుంటానని కోహ్లీ చెప్పాడు.

అటు దేవర, ఇటు వరల్డ్‌ కప్‌!
జూనియర్‌ ఎన్టీఆర్‌, RRR మూవీతో వరల్డ్‌ వైడ్‌ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. తన యాక్షన్‌, నాటు నాటు సాంగ్‌ స్టెప్పులతో ప్రపంచాన్నే ఊపేశాడు. ఇప్పుడు మరో పాన్‌ ఇండియా మూవీ దేవర షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర ఫస్ట్ పార్ట్‌ అక్టోబర్‌ 10న రిలీజ్‌ కాబోతుంది. మరో వైపు కోహ్లీ, ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌కు సిద్ధమవుతున్నాడు. జూన్‌ 2 నుంచి యూఎస్, వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచ కప్‌ మొదలు కానున్న సంగతి తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.