ETV Bharat / sports

బీసీసీఐతో ఫ్రాంచైజీల మీటింగ్​ - ఐపీఎల్ షెడ్యూల్​ ఛేంజ్​! - IPL Franchise Meeting

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 8:05 PM IST

Updated : Apr 1, 2024, 8:35 PM IST

IPL Franchise Meeting
IPL Franchise Meeting

IPL Franchise Meeting : ఐపీఎల్ సీజన్ ఎంతో అట్టహాసంగా జరుగుతున్న తరుణంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లతో బీసీసీఐ భేటీ కానుంది. మరోవైపు ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఏప్రిల్ 17న కోల్‌కతా, రాజస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉన్న మ్యాచ్​ రీ షెడ్యూల్ కానుందట. ఆ విశేషాలు మీ కోసం.

IPL Franchise Meeting : ఐపీఎల్ సీజన్ ఎంతో అట్టహాసంగా జరుగుతున్న తరుణంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లతో బీసీసీఐ భేటీ కానుంది. ఏప్రిల్ 16న అహ్మదాబాద్‌ వేదికగా ఈ మీటింగ్ జరగనుంది. తాజాగా ఈ విషయాన్ని బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీల ఓనర్లకు చెప్పింది. అయితే ఈ మీటింగ్​కు బీసీసీఐ ఛైర్మన్ రోజర్ బిన్నీ, సెక్రెటరీ జై షా, ఐపీఎల్ ఛైర్మన్‌ అరుణ్ సింగ్ ధుమాల్ హాజరుకానున్నారు.

అయితే ఆటగాళ్ల రిటెన్షన్‌పై తాజాగా ఫ్రాంచైజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని జట్లు రిటైన్ ఆటగాళ్ల సంఖ్యను ఎనిమిదికి పెంచాలని కోరుతుండగా, మరికొన్నేమో దీనికి అంగీకరించడం లేదు. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు జరిగిన చివరి మెగా వేలంలో ఒక్కో జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అంతే కాకుండా ఐపీఎల్ 2024 వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి జట్లకు రూ.100 కోట్ల పరిమితిని విధించారు. వచ్చే సీజన్‌ నుంచి దీనిని పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక 2025 ఎడిషన్‌కు ముందు నిర్వహించనున్న మెగా వేలం గురించి ఈ మీటింగ్​లో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. వేలానికి ముందు ప్లేయర్ల రిటెన్షన్‌ అంశంపై కూడా ఈ వేదికగా చర్చలు జరిగే అవకాశం ఉంది.

ఐపీఎల్ షెడ్యూల్​లో మార్పులు ?
RR VS KKR IPL 2024 : ముంబయిలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఏప్రిల్ 17న కోల్‌కతా, రాజస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. కానీ ఈ మ్యాచ్‌ రీ షెడ్యూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్‌ జరిగే రోజే శ్రీరామనవమి కావడం ఇందుకు కారణం. కోల్‌కతాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. దీంతో భద్రత కోసం భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించాల్సి ఉంటుందని సమాచారం. కాబట్టి, ఆ రోజు మ్యాచ్‌కు తగినంత భద్రత కల్పించడం సాధ్యం కాకపోవచ్చు. మరికొన్ని రోజుల్లో ఈ మ్యాచ్‌ నిర్వహణ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ధోనీ, రోహిత్​, కోహ్లీ కాదు- ఐపీఎల్‌లో ఎక్కువ రెమ్యునరేషన్​ అందుకున్న ఇండియన్​ ప్లేయర్​ అతడే! - Highest Paid IPL Indian Player 2024

'అందుకే పూరన్​కు పగ్గాలు'-రాహుల్ కెప్టెన్సీ ఇక అంతేనా! - KL Rahul Lucknow Captaincy

Last Updated :Apr 1, 2024, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.