ETV Bharat / sports

కొత్త జెర్సీతో సన్​రైజర్స్ - సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 8:28 PM IST

Updated : Mar 7, 2024, 10:59 PM IST

IPL 2024 Sunrisers Hyderabad New Jersy : ఐపీఎల్ 2024 సీజన్​ కోసం సన్​రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొత్త జెర్సీతో సన్​రైజర్స్ - సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
కొత్త జెర్సీతో సన్​రైజర్స్ - సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

IPL 2024 Sunrisers Hyderabad New Jersy : ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించి కొత్త జెర్సీని ఆవిష్కరించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ నయా జెర్సీని ధరించిన వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. మా కొత్త జెర్సీ ఇదే అంటూ క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. అయితే ఈ జెర్సీ మనకు కొత్త కానీ సన్​రైజర్స్​కు కాదు. ఎందుకంటే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తమ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఈ జెర్సీనే ధరిస్తోంది. దీన్ని ధరించే వరుసగా రెండు సీజన్​లలో టైటిల్​ను గెలవడం విశేషం. దీంతో తమకు అచ్చొచ్చిన జెర్సీనే ఈ ఐపీఎల్‌ సీజన్​లో కొనసాగించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జెర్సీతో పాటు కిట్ మొత్తాన్ని కూడా ఐపీఎల్‌లో కొనసాగించనుందట. ఈ జెర్సీని చూసిన కొంతమంది నెటిజన్లు మిక్స్​డ్​ కామెంట్లు చేస్తున్నారు. జెర్సీని మార్చడం కాదు ముందు గెలిచి చూపించండి. అప్పుడు చూద్దాం మీ సత్తా ఏంటో అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సీజన్​కు సంబంధించి ఐపీఎల్​ నిర్వాహకులు ఏర్పాట్లను వేగవంతం చేసేశారు. ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లను శిబిరాలకు రప్పిస్తున్నాయి. చాలా మంది ప్లేయర్లు కూడా ఇప్పటికే నెట్స్​లో సాధన చేయడం మొదలుపెట్టేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా ఐపీఎల్‌-2024 కోసం రెడీ అవుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్‌ సెషన్స్‌లో కూడా పాల్గొంటున్నారు.

కాగా, మార్చి 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. గత సీజన్‌లో జట్టును నడిపించిన ఐదెన్ మార్‌క్రమ్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి ఈ సారి కమిన్స్‌కు అప్పగించింది. ఎందుకంటే గత సీజన్‌లో హైదరాబాద్​ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుంగింటిలోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండిపోయింది. అందుకే ఈ సారైనా కమిన్స్‌ సారథ్యంలో ఆరెంజ్‌ ఆర్మీ మంచి ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో

WPL 2024 యూపీ వారియర్స్​పై విజయం - ప్రతీకారం తీర్చుకున్న ముంబయి

ఐదో టెస్ట్ తొలి రోజు ఆట పూర్తి - మనోళ్లు దంచేశారు

Last Updated : Mar 7, 2024, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.