ETV Bharat / sports

2024 IPL- టోర్నీకి ముందే గాయాల బెడద- దూరం కానున్నప్లేయర్లు వీళ్లే

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 11:02 AM IST

IPL 2024 Ruled Out Players List: మార్చి 22 నుంచి ఐపీఎల్ షురూ కాబోతోంది. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీకి దూరం కానున్న ఆటగాళ్లెవరో చూద్దాం.

Etv BharatIPL 2024 Ruled Out Players List
IPL 2024 Ruled Out Players List

IPL 2024 Ruled Out Players List: 2024 ఐపీఎల్​కు సమయం దగ్గరపడుతోంది. మార్చి 22నుంచి సీజన్​ 17 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలకు ఆటగాళ్ల గాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందులో ముఖ్యంగా పేసర్ మహ్మద్ షమీ సీజన్​ మొత్తానికి దురం కానున్నాడని ఇప్పటికే బీసీసీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇంకా పలువురు ప్లేయర్లు గాయాలు, వ్యక్తిగత కారణాల వల్ల రానున్న ఐపీఎల్​కు దూరం కానున్నారు. మరి వారెవరో తెలుసుకుందాం.

  1. మహ్మద్ షమీ (గుజరాత్ టైటాన్స్): భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ 2024 ఐపీఎల్​తోపాటు, 2024 టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. 2023 ప్రపంచకప్ సమయంలో గాయపడిన మహ్మద్ షమీ ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇక ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న అతడు మరో మూడు నెలల పాటు క్రికెట్ ఆడలేడు.
  2. మాథ్యూ వేడ్ (గుజరాత్ టైటాన్స్): ఐపీఎల్​ ముంగిట ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో ఆడుతున్నాడు. ​ మార్చి 21 నుంచి 25 వరకు ఈ టోర్నీ ఫైనల్​ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో వేడ్ ఐపీఎల్​లో ప్రారంభ మ్యాచ్​లకు అందుబాటులో ఉండటం లేదు.
  3. మార్క్ వుడ్ (లఖ్​నవూ సూపర్ జెయింట్స్): లఖ్​నవూ సూపర్ జెయింట్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాల్సిన ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ చివరి క్షణంలో 2024 ఐపీఎల్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. 2024 జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అభ్యర్థన మేరకు మార్క్​వుడ్ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు.
  4. ప్రసిద్ కృష్ణ (రాజస్థాన్ రాయల్స్): ప్రసిద్ధ్ కృష్ణ మోకాలు గాయం కారణంగా రానున్న సీజన్​కు దూరమయ్యాడు. రీసెంట్​గా ముగిసిన రంజీ ట్రోఫీలో అతడు గాయపడ్డాడు. కాగా, గతేడాది ఐపీఎల్‌లో కూడా ప్రసిద్ధ్ ఆడలేదు.
  5. జెసన్ రాయ్ (కోల్‌కతా నైట్ రైడర్స్): ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జేసన్ రాయ్ వ్యక్తిగత కారణాల వల్ల 2024 ఐపీఎల్​కు దూరం కానున్నట్లు ఇటీవల ప్రకటించాడు.
  6. గస్ అట్కిన్సన్ (కోల్‌కతా నైట్ రైడర్స్): ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ తన పని భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఐపీఎల్​కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రీసెంట్​గా చెప్పాడు.
  7. డెవాన్ కాన్వే (చెన్నై సూపర్ కింగ్స్): చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్​లో ఆడడం లేదు. కాన్వే గాయం చెన్నై పరిస్థితులపై ప్రభావం చూపింటవచ్చు.
  8. మతీశా పతిరణ (చెన్నై సూపర్ కింగ్స్): ఎడమకాలి తొడ కండరాలు పట్టేయడంతో ఈ ఆటగాడు రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. టోర్నీలో తొలి రెండు మ్యాచులు ఆడటం కూడా అనుమానమే.
  9. హ్యారీ బ్రూక్ (దిల్లీ క్యాపిటల్స్): ఈ సంవత్సరం సీజన్ ప్రారంభానికి ముందే దిల్లీ క్యాపిటల్స్​కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. యాక్షన్ అండ్ యంగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఐపీఎల్ సిరీస్ నుంచి వైదొలిగాడు. తన నాయనమ్మ మరణించడం వల్ల ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.

KKR ఫ్యాన్స్​కు షాకింగ్ న్యూస్- ఐపీఎల్​కు అయ్యర్ దూరం!

రికవరీ అప్డేట్​పై షమీ- కుట్లు తొలగించారని ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.