ETV Bharat / sports

సన్​రైజర్స్ హసరంగకు గాయం - అతడి స్థానంలో వచ్చిన ఈ మిస్టరీ స్పిన్నర్ ఎవరు? - IPL 2024 SRH VS Punjab Kings

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 7:39 PM IST

Updated : Apr 9, 2024, 8:10 PM IST

IPL 2024 Sunrisers Hyderabad Vijayakanth : సమ్మరీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కీలక ఆటగాడు హసరంగ పూర్తిగా దూరమయ్యాడు. దీంతో సన్‌రైజర్స్‌ అతడి స్థానంలోకి శ్రీలంకకు చెందిన 22 ఏళ్ల లెగ్‌ స్పిన్నర్‌ విజయకాంత్​ వియస్కాంత్‌ను తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.

సన్​రైజర్స్ హసరంగకు గాయం - అతడి స్థానంలో వచ్చిన ఈ మిస్టరీ స్పిన్నర్ ఎవరు?
సన్​రైజర్స్ హసరంగకు గాయం - అతడి స్థానంలో వచ్చిన ఈ మిస్టరీ స్పిన్నర్ ఎవరు?

IPL 2024 Sunrisers Hyderabad Vijayakanth : ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎన్నో అంచనాలతో కొనుగోలు చేసిన ప్లేయర్‌లు గాయాలతో దూరమవుతున్నారు. ఇప్పటికే లీగ్‌ మొత్తానికి దూరమైన ప్లేయర్‌ల ప్లేస్‌లో ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లను తీసుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) చేరింది. తాము అగ్రిమెంట్‌ చేసుకున్న శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ, ఐపీఎల్ 2024 మొత్తానికి దూరమయ్యాడు. ఎడమ మడమ గాయంతో బాధపడుతున్న హసరంగ కొన్ని రోజులకు తిరిగి వస్తాడని భావించారు. చివరికి SRHకి నిరాశ తప్పలేదు. అయితే ఆరెంజ్ ఆర్మీ హసరంగ స్థానంలో 22 ఏళ్ల శ్రీలంక లెగ్ స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్‌తో అగ్రిమెంట్‌ చేసుకోనున్నట్లు ప్రకటించింది. టాటా IPLలో బేసిక్‌ ప్రైస్‌ రూ.50 లక్షలతో చేరాడని ఎస్ఆర్‌హెచ్‌ పేర్కొంది.

విజయ్‌కాంత్ ఇప్పటివరకు శ్రీలంక తరఫున ఒక T20 ఇంటర్నేషనల్‌ ఆడాడు. 2023 అక్టోబర్ లో ఆఫ్ఘానిస్థాన్​పై అరంగేట్రం చేసి నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి ఒక్క వికెటే పడగొట్టాడు. తొలి మ్యాచులోనే పొదుపుగా బౌలింగ్ చేసిన ఈ 22 ఏళ్ళ యువ స్పిన్నర్ భవిష్యత్తులో సంచలనంగా మారుతాడని ఇప్పటికే కొంతమంది నిపుణులు అభిప్రాయపడతున్నారు.

వియాస్కాంత్‌ బెస్ట్‌ ఆప్షన్‌
లెగ్-బ్రేక్ బౌలర్ వియస్కాంత్ తక్కువ అనుభవం కలిగి ఉన్నప్పటికీ మంచి ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాడు. ఇటీవల ILT20 2024 ఛాంపియన్స్ MI ఎమిరేట్స్ కోసం ఆడాడు. నాలుగు మ్యాచ్‌లలో ఎనిమిది వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా 33 టీ20లలో వియస్‌కాంత్‌ 42 వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ రేటు 6.76గా ఉంది.

జట్టులో అవకాశాలు ఉంటాయా?
SRHలో అనుభవం లేని స్పిన్ విభాగంలోని వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, షాబాజ్ అహ్మద్‌కు వియస్కాంత్ యాడ్‌ అయ్యాడు. బిగ్‌ లీగ్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వియస్కాంత్ ఎదురుచూస్తున్నాడు. అయితే సన్‌రైజర్స్‌ ప్లేయింగ్‌ XIలో ఫారిన్‌ ప్లేయర్స్‌కు చోటు కల్పించడంలో సమస్యలు ఎదుర్కొంటోంది. గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్ వంటి ప్రతిభావంతులకు చోటు ఉండటం లేదు. ఈ సమయంలో వియస్కాంత్‌కు అవకాశాలు ఉలా ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. చూడాలి మరి తన మిస్టరీ స్పిన్​తో బోల్తా కొట్టించే ఈ లెగ్ స్పిన్నర్ తుది జట్టులో చోటు దొరికితే ఎంతవరకు ప్రభావం చూపిస్తాడో.

హసరంగ ఐపీఎల్‌ కెరీర్
2023 డిసెంబరు మినీ వేలంలో SRH హసరంగాను బేస్ ప్రైస్‌ రూ.1.5 కోట్లకు అగ్రిమెంట్‌ చేసుకుంది. 2022 వేలంలో అతన్ని మొదట ఆర్సీబీ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తం హసరంగ ఆర్సీబీ తరఫున రెండు సీజన్లలో ఆడాడు. 2022 సీజన్లో 26 వికెట్లు తీశాడు. 2023లో పెద్దగా రాణించకపోవడంతో ఆర్సీబీ వదులుకుంది.

లఖ్​నవూకు బ్యాడ్‌న్యూస్‌ - రెండు మ్యాచ్‌లకు స్పీడ్​గన్​ దూరం? - IPL 2024 Mayank Yadav

కోహ్లీ, పంత్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​ - టీ20 ప్రపంచకప్‌ జట్టు ఇదే! - T20 World Cup 2024

Last Updated :Apr 9, 2024, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.