ETV Bharat / sports

'వరల్డ్ కప్​ కోసమే కదా ఇదంతా' - దినేశ్​ను టీజ్​ చేసిన రోహిత్ శర్మ! - IPL 2024 MI VS RCB

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 7:57 AM IST

Updated : Apr 12, 2024, 8:26 AM IST

వరల్డ్ కప్​ కోసమే కదా ఇదంతా - దినేశ్​ను టీజ్​ చేసిన రోహిత్ శర్మ!
వరల్డ్ కప్​ కోసమే కదా ఇదంతా - దినేశ్​ను టీజ్​ చేసిన రోహిత్ శర్మ!

IPL 2024 MI VS RCB Dinesh Karthik : ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు ప్లేయర్ దినేశ్ కార్తీక్ మంచి ప్రదర్శన చేశాడు. అయితే ఈ పోరులో ముంబయి కెప్టెన్ రోహిత్​ దినేశ్​ను ఆటపట్టించాడు. పూర్తి వివరాలు స్టోరీలో

IPL 2024 MI VS RCB Dinesh Karthik : ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు భారీ స్కోరు చేసినప్పటికీ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్​లో ముంబయి బౌలర్ బుమ్రాతో పాటు ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ కూడా హైలెట్​ అయ్యాడు. ఎందుకంటే అతడు కూడా మంచి ప్రదర్శన చేశాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 53 అజేయ పరుగులు చేశాడు. అలా తన విధ్వంసకర బ్యాటింగ్​తో చెలరేగుతూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా ఆకాశ్ మధ్వాల్ వేసిన 16వ ఓవర్‌లో అయితే ఇన్నోవేటివ్ షాట్స్‌ బాది ఆకట్టుకున్నాడు. నాలుగు బౌండరీలు తరలించాడు. అయితే ఈ నాలుగు బౌండరీలను కూడా థర్డ్ మ్యాన్ రిజీయన్‌లోనే రావడం విశేషం.

రోహిత్ శర్మ టీజింగ్ - ఇకపోతే ఈ మ్యాచులో దినేశ్​ కార్తీక్​ను ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అటపట్టించడం కూడా సోషల్ మీడియాలో హైలైట్ అయింది. జస్‌ప్రీత్ బుమ్రా(5/21) ఓ వైపు నిప్పులు చెరుగుతున్నా తన హిట్టింగ్‌తో ఆర్సీబీకి భారీ స్కోర్ అందించాడు దినేశ్ కార్తీక్. బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో ఆర్సీబీ వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి సమయంలోనూ ఆఖరి బంతిని దినేశ్ కార్తీక్ సిక్సర్‌గా మలిచాడు. అప్పుడు వెంటనే కార్తీక్ దగ్గరకు వచ్చిన రోహిత్ శర్మ అతడిని మెచ్చుకుంటూ సరదాగా టీజ్ చేశాడు. ఆ సమయంలో హిట్ మ్యాన్​ అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. శెభాష్ రా కార్తీక్ ప్రపంచకప్ ఆడేందుకే కదా ఇలా రెచ్చిపోతున్నావ్​ అంటూ టీజ్ చేశాడు. కామెంటేటర్లు కూడా టీ20 వరల్డ్ కప్​ 2024 జట్టులో చోటు కోసం కార్తీక్ పోటీ పడుతున్నట్లు అన్నాడు.

కాగా, ఈ సీజన్​లో దినేశ్ కార్తీక్ ప్రదర్శన పర్వాలేదనిపించేలా సాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో అతడు చేసిన స్కోర్​ ఈ విధంగా ఉన్నాయి.

  • 38*(26) vs సీఎస్కే
  • 28*(10) vs పంబాజ్ కింగ్స్
  • 20(8) vs కోల్​కతా నైట్ రైడర్స్​
  • 4(8) vs లఖ్​నవూ
  • 53*(23) vs ముంబయి ఇండియన్స్

బెంగళూరు చిత్తు - హై స్కోరింగ్ మ్యాచ్​లో ముంబయి విజయం - MI vs RCB IPL 2024

ఆర్సీబీపై విజయం - బుమ్రా ఖాతాలోకి పలు రికార్డులు - IPL 2024 RCB VS Mumbai Indians

Last Updated :Apr 12, 2024, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.