ETV Bharat / sports

ఆర్సీబీపై విజయం - బుమ్రా ఖాతాలోకి పలు రికార్డులు - IPL 2024 RCB VS Mumbai Indians

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 7:22 AM IST

IPL 2024 RCB VS Mumbai Indians : ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించిన ముంబయి ఇండియన్స్​లో బౌలర్ బుమ్రా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటంటే?

ఆర్సీబీపై విజయం - బుమ్రా ఖాతాలోకి పలు రికార్డులు
ఆర్సీబీపై విజయం - బుమ్రా ఖాతాలోకి పలు రికార్డులు

IPL 2024 RCB VS Mumbai Indians : వాంఖ‌డే మైదానం వేదికగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(ఆర్సీబీ)తో జ‌రిగిన మ్యాచులో ముంబయి ఇండియ‌న్స్ విజయం సాధించింది. ఈ విజయంలో కీలకంగా వ్యవహరించిన బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 21 ప‌రుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అలా ఈ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుపై 5 వికెట్లు తీసిన తొలి బౌల‌ర్‌గా నిలిచాడు. దీంతో చివ‌రిగా ఆశిష్ నెహ్రా(సీఎస్కే) ఆర్సీబీపై తీసిన 4 వికెట్ల రికార్డ్ బ్రేక్ అయింది.

Bumrah Five Wickets : ఇంకా ఐపీఎల్​లో రెండుసార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన, నాలుగో బౌలర్​గానూ రికార్డు కొట్టాడు. అతడి కన్నా ముందు జేమ్స్ ఫాల్క్​నర్, జయదేవ్ ఉనాత్కత్, భువనేశ్వర్ కుమార్ ఈ ఫీట్ సాధించారు.

అలాగే ఆర్సీబీపై అత్య‌ధిక వికెట్లు (29) తీసిన బౌల‌ర్‌గానూ మరో ఫీట్ అందుకున్నాడు.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధికంగా 3 వికెట్ల హాల్​ తీసిన బౌల‌ర్‌గానూ అవ‌త‌రించాడు. ఇప్పటివరకు అతడు ఏకంగా ఈ మూడు వికెట్ల ప్రదర్శనను 21 సార్లు న‌మోదు చేశాడు.

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీని అత్య‌ధిక‌ సార్లు (5) పెవిలియ‌న్ పంపించిన బౌల‌ర్‌గానూ నిలిచాడు.

చెత్త రికార్డు - ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక‌సార్లు (17) డ‌కౌట్ అయిన ఆట‌గాడిగా దినేశ్ కార్తీక్, రోహిత్ శ‌ర్మ స‌ర‌స‌న నిలిచాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ అదిరే ప్రదర్శన చేసింది. రాయల్ ఛాలెంజర్స్​ బెంగ‌ళూరు విధించిన 197 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 15.3 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. 27 బంతులు మిగిలి ఉండగానే కేవ‌లం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మ్యాచ్​ను ముగించింది. ముంబయి బ్యాట‌ర్ల‌లో ఇషాన్ కిష‌న్ (69), సూర్య‌కుమార్ యాద‌వ్ (52) హాఫ్ సెంచ‌రీల‌తో హీరోలుగా మారారు. అంతకుముందు హ్యాట్రిక్ పరాజయాలతో ఈ సీజన్​ను పేలవంగా ప్రారంభించింది ముంబయి ఇండియన్స్​. ఆ తర్వాత దిల్లీ క్యాపిటల్స్​ను ఓడించి బోణీ కొట్టింది. ఇప్పుడు ఆర్సీబీని చిత్తుగా ఓడించింది.

బెంగళూరు చిత్తు - హై స్కోరింగ్ మ్యాచ్​లో ముంబయి విజయం - MI vs RCB IPL 2024

చీటింగ్ కేస్​ - హార్దిక్‌ పాండ్య సోదరుడు అరెస్ట్​! - Hardik Pandya cousin arrest

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.