ETV Bharat / sports

IPL 2024లో కేఎల్‌ రాహుల్‌ ఆడతాడా? లేదా? - కీలక అప్డేట్​

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 4:06 PM IST

Updated : Mar 4, 2024, 7:29 PM IST

IPL 2024 KL Rahul : గాయపడిన స్టార్ బ్యాటర్ కేఏల్​ రాహుల్​ గురించి కీలక అప్డేట్​ అందింది. అతడు తాజాగా లండన్‌ వెళ్లి స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకుని భారత్​కు తిరిగి వచ్చినట్లు తెలిసింది.

IPL 2024లో కేఎల్‌ రాహుల్‌ ఆటతాడా? లేదా? - కీలక అప్డేట్​
IPL 2024లో కేఎల్‌ రాహుల్‌ ఆటతాడా? లేదా? - కీలక అప్డేట్​

IPL 2024 KL Rahul : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ మధ్యలో గాయం కారణంగా టీమ్ ​ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ వైదొలిగిన సంగతి తెలిసిందే. అతడు మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలి. అలాగే ఐపీఎల్​లోనూ ఆడాలన్నా కూడా అతడికి ఫిట్​నెస్​ ఉండాల్సిందే. తొందరపడి ఈ మెగాలీగ్​లో పాల్గొంటే రిస్క్ తీసుకున్నట్టే. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత జరగబోయే పొట్టి కప్​లో అతడు వికెట్ కీపర్​గా, బ్యాటర్​గా ఎంతో కీలకం. అయితే రాహుల్ ఐపీఎల్ ఆడే అవకాశం లేదని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ వర్గాలు రాహుల్ గురించి ఓ కీలక అప్డేట్​ను ఇచ్చాయి. అతడు తాజాగా లండన్‌ వెళ్లి స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకుని భారత్​కు తిరిగి వచ్చినట్లు పేర్కొన్నాయి.

KL Rahul Treatment : "లండన్‌లోని ది బెస్ట్ డాక్టర్స్​ను కేఎల్ సంప్రదించాడు. రీసెంట్​గానే అతడు భారత్‌కు తిరిగొచ్చాడు. బీసీసీఐ నేషనల్ క్రికెట్‌ అకాడమీకి వెళ్లాడు. త్వరలోనే రాహుల్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన రిపోర్ట్​ను ఎన్‌సీఏ ఇవ్వనుంది. అతడు ఐపీఎల్‌లో తన సత్తాను నిరూపించుకోవాలని ఆశపడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ కీపర్-బ్యాటర్‌గా బరిలోకి దిగాలను అనుకుంటున్నాడు. ఇదంతా జరగాలంటే అతడు ముందు ఫిట్​నెస్ సాధించి ఎన్​సీఏ నుంచి రిటర్న్​ టు ప్లే సర్టిఫికెట్​ను తీసుకోవాల్సి వస్తుంది" అని క్రికెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఐపీఎల్​లో రాజస్థాన్ రాయల్స్‌తో మార్చి 24న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ మ్యాచ్ ఆడనుంది. లఖ్​నవూకు రాహుల్​ కెప్టెన్​గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

KL Rahul Injury : కాగా, ఐపీఎల్‌ - 2023లో గాయపడిన కేఎల్ రాహుల్ గతేడాది ఆసియా కప్‌లో పునరాగమనం చేశాడు. అయితే ఆ తర్వాత వరల్డ్ కప్, దక్షిణాఫ్రికా టూర్​లో వన్డే, టెస్టు సిరీస్ కూడా ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్‌లోనూ తొలి మ్యాచ్ ఆడాడు.అనంతరం ఉప్పల్ టెస్టులో మరోసారి గాయం బారిన పడ్డాడు. ఆ తర్వాత ఫిట్​నెస్​ సరిగ్గా లేని కారణంగా ఇంగ్లాండ్​ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.

పోరాటంలో మానసిక ఒత్తిడి ఎక్కువైంది - రెజ్లింగ్​కు తిరిగి రాలేను : సాక్షి మాలిక్​

WPL 2024 - ప్లేఆఫ్స్‌ ఆవకాశాలు ఏ జట్టుకు ఎలా ఉన్నాయంటే?

Last Updated : Mar 4, 2024, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.