ETV Bharat / sports

ఆర్సీబీపై పేలుతున్న సెటైర్లు - ఈ ఫన్నీ మీమ్స్​ చూశారా? - IPL 2024 KKR VS RCB

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 9:41 AM IST

IPL 2024 KKR VS RCB Funny Memes : కోల్​కతా చేతిలో సొంత మైదానంలో ఓడిపోవడంతో ఆర్సీబీపై సెటైర్లు పేలుతున్నారు. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అవి చూసేద్దాం.

ఆర్సీబీ ఫన్నీ మీమ్స్​
ఆర్సీబీ ఫన్నీ మీమ్స్​

IPL 2024 KKR VS RCB Funny Memes : ఈ సాలా కప్‌ నామ్‌దే అంటూ ఐపీఎల్‌ 17వ సీజన్‌లో బరిలోకి దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరోసారి నిరాశపరిచింది. తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడినా రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచి గాడిన పడినట్లే అనిపించింది. కానీ మూడో మ్యాచ్‌లో కోల్‌కత్తా చేతిలో పరాజయం పాలైంది. ఓపక్క ఆర్సీబీ మహిళల జట్టు ఉమెన్స్‌ ప్రీమియర్ లీగ్‌ టైటిల్‌ గెలిచి సత్తా చాటగా ఈసారి ఆర్సీబీ పురుషుల జట్టు కూడా టైటిల్‌ సాధిస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే మరోసారి ఆర్సీబీ ప్రదర్శన అభిమానులకు నిరాశ తెప్పించింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. మహిళలను జట్టులోకి తీసుకోవాలంటూ మీమ్స్‌ నెట్టింట వైరల్‌గా చేస్తున్నారు. మీమ్స్‌తో ఆర్సీబీని ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

మహిళా క్రికెటర్లైనా తీసుకోండి.. ఆర్సీబీ బౌలింగ్‌పై సోషల్‌ మీడియాలో ఆ జట్టు ఫ్యాన్సే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వల్ప లక్ష్యాన్ని కూడా కాపాడుకుంటూ అమ్మాయిలు ఫ్రాంఛైజీకి తొలిసారి టైటిల్‌ అందించారు. దీంతో నెటిజన్లు పురుషుల జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టులో ఉన్న బౌలర్ల వల్ల చేతకావడం లేదని, మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ఆర్‌సీబీని గెలిపించిన ఎలీస్ పెర్రీ, శ్రేయాంక్ పాటిల్‌ను జట్టులోకి తీసుకోవాలని ఎగతాళి చేస్తున్నారు. శ్రేయాంక పాటిల్ స్పిన్‌తో అదరగొడుతుందని, ఎలీస్‌ పెర్రీ ఆల్‌రౌండర్‌గా రాణిస్తుందని సలహాలు ఇస్తున్నారు. విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్ చేశాడని అలా ఆడడమే బెంగళూరు ఓటమికి కారణమని అంటున్నారు. అంతేనా మహిళల జట్టు ఫొటో పురుషల జట్టు ఫొటోలను వాడుతూ మీమ్స్‌ వైరల్‌ చేస్తున్నారు. మహిళల జట్టులోని కీలక ఆటగాళ్లను పురుషుల జట్టులోకి తీసుకుంటే తప్ప బెంగళూరుకు టైటిల్‌ కష్టమే అంటూ చేసిన మీమ్స్‌ తెగ చక్కర్లు కొడుతున్నాయి.కాగా, కోల్‌కతా చేతిలో బెంగళూరుచిత్తుగా ఓడింది. సొంత మైదానంలో 7 వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమి చవిచూసింది. ఈ సీజన్​లో ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచులలో సొంత వేదిక జట్లే నెగ్గాయి. కానీ ఐపీఎల్ సీజన్ 17లో తొలిసారిగా ప్రత్యర్థి జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు విరాట్‌ కోహ్లీ 83 పరుగులతో రాణించడంతో 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కోల్‌కతా 3 వికెట్లు కోల్పోయి 16.5 ఓవర్లలోనే ఛేదించింది. కోల్‌కతాకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.

కోల్​కతాతో మ్యాచ్​ - క్రిస్​ గేల్​ రికార్డ్​ను బ్రేక్​ చేసిన కోహ్లీ - IPL 2024 Kohli Most sixes

మూమెంట్​ ఆఫ్ ది మ్యాచ్​ - ఇది అస్సలు ఊహించలే! - kohli Gambhir

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.