ETV Bharat / sports

అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్​ - చెన్నైని ఉతికారేశాడు - IPL 2024 CSK VS SRH

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 6:59 AM IST

IPL 2024 CSK VS SRH Abhishek Sharma : ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్​లో చెన్నై బౌలింగ్​ను ఉతికారశాడు అభిషేక్ శర్మ. దీంతో సన్​రైజర్స్​ విజయాన్ని దక్కించుకుంది. అతడి సూపర్​ ఇన్నింగ్స్​పై ఓ లుక్కేద్దాం.

అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్​ - చెన్నైని ఉతికారేశాడు
అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్​ - చెన్నైని ఉతికారేశాడు

IPL 2024 CSK VS SRH Abhishek Sharma : ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన 18వ మ్యాచ్​లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) - చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) బౌలింగ్​ను ఉతికారేసింది. అభిషేక్ శర్మ అయితే తన సూప‌ర్ ఇన్నింగ్స్​తో ఉప్పల్​ స్టేడియాన్ని ఉపేశాడు. తన రెండో ఓవర్​లోనే దుమ్ముదులిపేస్తూ పరుగుల వరద పారించాడు. ముఖేష్ చౌదరి బౌలింగ్​లో ఈ మార్క్ చూపిస్తూ సిక్సర్ల మోత మోగించాడు. .

ఈ ఓవ‌ర్​లో కళ్లు చెదిరే షాట్స్​ ఆడుతూ ఏకంగా 27 ప‌రుగులు సాధించాడు అభిషేక్ శ‌ర్మ‌. 4, 0, 6, 0, నోబాల్ 6, 6, 4 తో మైదాాన్ని హోరెత్తించాడు. అలా మూడు సిక్స‌ర్లు, నో బాల్​, రెండో ఫోర్లతో కలిపి ధనాధన్ ఇన్నింగ్స్ చేశాడు. అయితే ఈ క్రమంలోనే మ‌రో భారీ షాట్ బాదే క్ర‌మంలో 37 ప‌రుగులు చేసిన ఔట్ అయ్యాడు అభిషేక్ శ‌ర్మ. మొత్తంగా ఇన్నింగ్స్​లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాదాడు. ఇక ఇతడి ఇన్నింగ్స్ చూసిన అభిమానులు ఉప్పల్​లో బాదుతుంటే తుప్ప‌ల్లో పడుతున్నాయి అంటూ ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు.

ఇకపోతే ఈ మ్యాచులో సన్​రైజర్స్​ హైద‌రాబాద్ మ్యాచ్​కు​ ఓపెన‌ర్లు మంచి శుభారంభం అందించారు. దీంతో ఆ జట్టు ప‌వ‌ర్ ప్లేలో మ‌రో రికార్డ్​ స్కోర్ చేసింది. ప‌వ‌ర్ ప్లేలో ఓ వికెట్ కోల్పోయి 78 ప‌రుగులు చేసింది.

ఐపీఎల్​లో హైద‌రాబాద్ టాప్-5 ప‌వ‌ర్ ప్లే స్కోర్స్

  • 81/1 vs ముంబయి,​ హైదరాబాద్, 2024
  • 79/0 vs కేకేఆర్, ​ హైదరాబాద్​ 2017
  • 78/1 vs సీఎస్కే, ​ హైదరాబాద్, 2024
  • 77/0 vs పీబీకేఎస్, హైదరాబాద్, 2019
  • 77/0 vs డీసీ, దుబాయ్, 2020

కాగా, ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​కు దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల నష్టానికి 165 ప‌రుగులు చేసింది. శివమ్‌ దూబె (45; 24 బంతుల్లో 2×4, 4×6) మాత్రమే ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్​తో అద‌ర‌గొట్టాడు. అనంతరం అభిషేక్​ (37; 12 బంతుల్లో 3×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్​ ఆరంభం వల్ల మరో 11 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్‌ లక్ష్యాన్ని ఛేదించింది. 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలిచింది. దీంతో వరుసగా సొంతగడ్డపై రెండో మ్యాచ్​లో విజయం సాధించినట్టైంది.

ఉప్పల్​లో సన్​రైజర్స్​ విక్టరీ- 6 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం - SRH vs CSK IPL 2024

IPL​కు నీటి కష్టాలు​! క్రికెట్​ బోర్డుకు NGT నోటీసులు- మ్యాచులపై ప్రభావం పడనుందా? - Bengaluru Water Crisis IPL Match

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.