ETV Bharat / sports

ఆ ఘనత ఉన్ముక్త్, పృథ్వీదే- ఫైనల్స్​లో ఆసీస్​ ఓడించిన కెప్టెన్లు వీళ్లే

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 12:30 PM IST

Indian Captains Beat Australia ICC Finals: ఐసీసీ ఈవెంట్​ ఫైనల్స్​లో​ భారత్ ఏడుసార్లు ఆస్ట్రేలియాను ఢీ కొట్టింది. అందులో కేవలం రెండుసార్లే టీమ్ఇండియా నెగ్గగా, ఆసీస్ ఐదుసార్లు విజయం సాధించింది. అలా ఆసీస్​ను ఫైనల్స్​లో ఓడించిన కెప్టెన్లు వీళ్లే.

Indian Captains Beat Australia ICC Finals
Indian Captains Beat Australia ICC Finals

Indian Captains Beat Australia ICC Finals: క్రికెట్​లో ఆస్ట్రేలియా అత్యంత బలమైన జట్టు. రెండేళ్లుగా క్రికెట్​లో పూర్తిగా ఆసీస్ డామినేషన్​ నడుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మహిళలు 2022లో వన్డే, 2023లో టీ20 వరల్డ్​కప్ టైటిళ్లు సొంతం చేసుకోగా, 2023లో డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్ పురుషుల జట్టు దక్కించుకుంది. ఇక తాజాగా అండర్- 19 వరల్డ్​కప్​లోనూ కుర్రాళ్లు ఆధిపత్యం ప్రదర్శించి కప్పును ముద్దాడారు.

ఇలా గత రెండేళ్లలో ఆసీస్ ఐదు ఐసీసీ టైటిళ్లు సాధిస్తే, అందులో మూడుసార్లు ఫైనల్​ ఫైట్​లో భారత్​నే ఓడించింది. అయితే క్రికెట్​లో భారత్ తక్కువేమీ కాదు. పటిష్ఠమైన జట్లలో టీమ్ఇండియా ఒకటి. ఇప్పటివరకూ ఎందరో అత్యుత్తమ ఆటగాళ్లు పలు ఐసీసీ టోర్నీల్లో టీమ్ఇండియాకు సారధ్యం వహించారు. అయితే మెగా ఈవెంట్​ ఫైనల్స్​లో మాత్రం ఆస్ట్రేలియాను ఒడించిన భారత కెప్టెన్లు ఇద్దరే ఇద్దరు.

2012 అండర్- 19 టోర్నీలో ఉన్ముక్త్ చంద్ భారత్​కు కెప్టెన్​గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో భారత్​, ఆస్ట్రేలియా తుదిపోరుకు అర్హత సాధించాయి. ఇక ఫైనల్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 225 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 47.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ సెంచరీ (111*) తో మెరిశాడు. ఈ విజయంతో ఐసీసీ ఈవెంట్​లలో ఆసీస్​ను ఫైనల్​లో ఓడించిన తొలి కెప్టెన్​గా ఉన్ముక్త్ నిలిచాడు.

రెండోసారి కూడా ఆసీస్​ను ఫైనల్స్​లో భారత్ ఓడించింది అండర్- 19 వరల్డ్​కప్​లోనే. 2018 టోర్నమెంట్​లో పృథ్వీ షా టీమ్ఇండియాకు నాయకత్వం వహించాడు. పృథ్వీ నేతృత్వంలో భారత్ ఫైనల్​లో అడుగుపెట్టింది. తుదిపోరులో ఆసీస్​ను ఢీకొట్టిన టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 217 పరుగులు టార్గెట్​ను టీమ్ఇండియా 38.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ మన్జోత్ కల్రా (101*) శతకంతో మెరిశాడు. దీంతో ఆసీస్​ను ఫైనల్స్​లో దెబ్బకొట్టిన రెండో భారత కెప్టెన్​గా పృథ్వీ తన పేరును లిఖించుకున్నాడు. వీరిద్దరే ఐసీసీ ఈవెంట్ ఫైనల్స్​లో ఆసీస్​ను ఓడించగలిగారు.

టీమ్ఇండియాకు నిరాశ - నాలుగోసారి అండర్​ 19 కప్​ ఆసీస్​ సొంతం

'నేనైతే అలా అనుకోవట్లేదు'- U 19 భారత్​ కెప్టెన్ ఉదయ్ ఇంట్రెస్టింగ్ రిప్లై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.