ETV Bharat / sports

భారత్​-ఇంగ్లాండ్​ టెస్టు- కోహ్లి స్థానంలో ఎవరికి ఛాన్స్​ దక్కేనో?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 10:50 PM IST

Ind Vs Eng Test 2024 : గురువారం నుంచి ఇంగ్లాండ్​తో జరగనున్న 5 టెస్టుల సిరీస్​లో మొదటి రెండింటికి దూరంగా ఉంటున్నాడు కింగ్​ విరాట్​ కోహ్లీ. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇతర కీలక ఆటగాళ్లను వేతికే పనిలో పడ్డారు సెలెక్టర్లు. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Ind Vs Eng Test 2024 Alternate Player To King Virat
Ind Vs Eng Test 2024

Ind Vs Eng Test 2024 : జనవరి 25 నుంచి హైదరాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగే 5 టెస్టుల సరీస్​లో తొలి రెండు మ్యాచ్​లకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండనున్నాడు పరుగుల వీరుడు విరాట్​ కోహ్లీ. ఈ మేరకు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో సిరీస్​ ప్రారంభానికి కేవలం 3రోజులే మిగిలి ఉండటం వల్ల అతడి స్థానంలో ఎవరినీ జట్టులోకి తీసుకోవాలో తెలియక తలామునకలవుతున్నారు సెలెక్టర్లు.

కొందరు అలా- మరికొందరు ఇలా : రన్​ మెషీన్​- కోహ్లీ స్థానాన్ని సీనియర్లు ఛెతేశ్వర్‌ పుజారా లేదా అజింక్య రహానెలలో ఒకరితో భర్తీ చేయాలని కొందరంటుంటే, మరికొందరు యంగ్​ ప్లేయర్స్​ సర్ఫరాజ్‌ అహ్మద్‌, రజత్‌ పాటిదార్‌లలో ఒకరి​కి ఛాన్స్​ ఇవ్వాలని సజెస్ట్​ చేస్తున్నారు. ఈ చర్చ జరుగుతున్న క్రమంలోనే ఇంకొందరు పైనలుగురికి కాకుండా ప్రస్తుతం రంజీలో అదరగొడుతున్న రియాన్​ పరాగ్​, రికీ భుయ్​ల పేర్లను కూడా పరిశీలించాలని కోరుతున్నారు. ఇన్ని రకాల ప్రతిపాదనల నేపథ్యంలో ఐదు టెస్టుల సిరీస్​ కోసం విరాట్​కు ప్రత్యామ్నాయంగా సెలెక్టర్లు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.

రహానే ఔట్​? ప్రస్తుత రంజీ సీజన్‌లో వరుసగా డకౌట్​ అయ్యి దారుణంగా బోల్తా పడ్డ అజింక్యా రహానేను ఇంగ్లాండ్​ సిరీస్​లో ఆడించే అవకాశం లేదనే తెలుస్తోంది. ఇక పుజారా, రజత్​ పాటిదార్‌లలో ఒకరికి సెలెక్టర్లు అవకాశం ఇవ్వనుందని బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

భారత జట్టు
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, యశస్వి జైస్వాల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, ఆవేశ్‌ ఖాన్‌, అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, కేఎస్‌ భరత్‌, ముకేశ్‌ కుమార్‌, దృవ్‌ జురెల్​

ఇంగ్లాండ్​ టీమ్​
జాక్‌ క్రాలే (కెప్టెన్​), మార్క్‌ వుడ్‌, జేమ్స్​ ఆండర్సన్​, బెన్‌ ఫోక్స్‌, డాన్‌ లారెన్స్‌, బెన్‌ డకెట్‌, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), జో రూట్‌, రెహాన్‌ అహ్మద్‌, జానీ బెయిర్‌స్టో, ఓలీ రాబిన్సన్‌, గస్‌ అట్కిన్సన్‌, షోయబ్‌ బషీర్‌, ఓలీ పోప్‌, జాక్‌ లీచ్‌, టామ్‌ హార్ట్లీ

ఇంగ్లాండ్​తో సిరీస్​ - ఉప్పల్​ గడ్డపై టీమ్​ఇండియా రికార్డులు

ఇంగ్లాండ్​తో టెస్ట్​ సిరీస్​ - తొలి రెండు మ్యాచ్​లకు కోహ్లీ దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.