ETV Bharat / sports

100వ టెస్ట్ : అశ్విన్‌ మ్యాజికా - బెయిర్‌ స్టో షోనా

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 9:04 AM IST

IND vs ENG Ravichandran Ashwin 100 Test : టీమ్​ ఇండియా - ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టుకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది. టీమ్‌ఇండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ - ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టోలకు(Jonny Bairstow 100 Test) ఇది కెరీర్‌లో వందో టెస్టు కావడం విశేషం. చూడాలి మరి కెరీర్​లో మెలురాయిగా నిలవనున్న ఈ మ్యాచ్​లో ఎలా రాణిస్తారో.

100వ టెస్ట్ : అశ్విన్‌ మ్యాజికా -  బెయిర్‌స్టో షోనా
100వ టెస్ట్ : అశ్విన్‌ మ్యాజికా - బెయిర్‌స్టో షోనా

IND vs ENG Ravichandran Ashwin 100 Test : టీమ్​ ఇండియా - ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టుకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది. టీమ్‌ఇండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ - ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టోలకు(Jonny Bairstow 100 ) ఇది కెరీర్‌లో వందో టెస్టు కావడం విశేషం. మరి ఇప్పటికే సిరీస్‌ను 3-1తో దక్కించుకున్న టీమ్​ ఇండియాకు ఆఖరి మ్యాచ్‌లో మరోసారి మ్యాజిక్‌ చేసి ఇంకో విజయాన్ని అశ్విన్​ అందిస్తాడా లేదా సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌కు బెయిర్‌స్టో బ్యాట్‌తో ఏమైనా తోడుగా నిలుస్తాడా అన్నది ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.

అశ్వినేమో అద్భుతంగా : ఈ సిరీస్‌ను టీమ్‌ ఇండియా దక్కించుకోవడంలో స్పిన్నర్​ అశ్విన్‌ది కీలక పాత్ర. ఇప్పటి వరకు జరిగిన 4 టెస్టుల్లో అతడు మొత్తం 17 వికెట్లు దక్కించుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ కొన్ని కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. రాంచీ వేదికగా జరిగిన నాలుగో మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలా ఈ సిరీస్​లో ఒక ఆటగాడిగా తన కమిట్‌మెంట్‌ కూడా చాటుకున్నాడు. మూడో మ్యాచ్​ మధ్యలో పర్సనల్ రీజన్స్​తో టీమ్​ను వీడినా వెంటనే తిరిగి వచ్చి ఆటలోకి దిగాడు. ఇక వందో టెస్టు రూపంలో అతడి ముంగిట ఇప్పుడో పెద్ద మైలురాయి నిలిచింది. మరి ఈ సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన అశ్విన్‌ ఆఖరి టెస్టులోనూ అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించాలని బలంగా కోరుకుంటున్నారు.

రీసెంట్​గా టెస్టుల్లో అతడు 500 వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇప్పుడేమో 100వ టెస్టు ఆడబోతున్న 14వ భారత ప్లేయర్​గా నిలవబోతున్నాడు. అంతేకాదు తొలి తమిళనాడు క్రికెటర్​గా కూడా నిలవనున్నాడు. 2011లో అరంగేట్రం చేసిన అశ్విన్‌ తన 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో టీమ్​ఇండియా ఎన్నో విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. 23.91 యావరేజ్​తో వికెట్లు తీశాడు. మరి ఐదో మ్యాచ్‌లోనూ అతడు మంచి ప్రదర్శన చేస్తే టీమ్‌ఇండియాకు తిరుగుండదు.

బెయిర్ స్టో డీలాగా : టీమ్​ఇండియాతో జరుగుతున్న ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ స్టార్‌ ప్లేయర్​ జానీ బెయిర్‌స్టో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. జరిగిన నాలుగు మ్యాచుల్లో ఒక్కదాంట్లో కూడాను తన మార్క్​ ఇన్నింగ్స్‌ ఆడలేదు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో అతడి అత్యధిక స్కోరు 38 మాత్రమే ఉంది. అది కూడా రీసెంట్​గా నాలుగో టెస్టులో బాదాడు. మూడో టెస్టులో మరీ దారుణంగా (0; 4 పరుగులు) చేశాడు. 2012లో టెస్ట్ అరంగేట్రం చేసిన ఇతడు ఇంగ్లాండ్‌కు నమ్మదగ్గ ఆటగాడి పేరు సంపాదించుకున్నాడు. కానీ రీసెంట్​గానే ఫామ్‌ కోల్పోయాడు. మరి 100వ టెస్టులోనైనా అతడు మంచి ప్రదర్శన చేస్తే చూడాలని అంతా ఆశిస్తున్నారు.

మరో విశేషం ఏమిటంటే : అశ్విన్, బెయిర్‌స్టో మాత్రమే కాదు న్యూజిలాండ్‌ స్టార్స్​ కేన్‌ విలియమ్సన్, టిమ్‌ సౌథీ కూడా తాజాగా 100 టెస్టుల మైలురాయిని అందుకునేందుకు రెడీగా ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరగబోయే రెండో టెస్టులో ఈ మార్క్​ అందుకోనున్నారు. టెస్టు చరిత్రలో ఒకేసారి నలుగురు క్రికెటర్లు 100 టెస్టుల మైలురాయిని అందుకోవడం ఇదే మొదటి సారి.

100వ టెస్ట్ : అతడు ఉంటే కెప్టెన్‌కు భరోసా - ప్రత్యర్థులకు హెచ్చరిక!

ఒకేసారి నలుగురు స్టార్ ప్లేయర్స్​ సెంచరీ టెస్ట్​ - క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.