ETV Bharat / sports

ఆకాశ్ అదుర్స్- రూట్ సెంచరీ- తొలి రోజు ఇంగ్లాండ్ ఇలా

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 4:37 PM IST

Updated : Feb 23, 2024, 5:34 PM IST

Ind vs Eng 4th Test 2024: రాంచి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ 302-7తో నిలిచింది

Ind vs Eng 4th Test 2024
Ind vs Eng 4th Test 2024

Ind vs Eng 4th Test 2024: భారత్- ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ 301-7తో నిలిచింది. జో రూట్ (106) సెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుతం క్రీజులో రూల్ (106), ఒలి రాబిన్సన్ (31) ఉన్నారు. అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ 3, సిరాజ్ 2, జడేజా , అశ్విన్ తలో వికెట్ దక్కించుకున్నారు.

టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్​లోనూ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. కానీ, పేసర్ ఆకాశ్ దీప్ ప్రత్యర్థి జట్టుకు బ్రేక్స్ వేశాడు. అతడు 9.2 వద్ద ఓపెనర్ బెన్ డకెట్ (11)ను పెవిలియన్ చేర్చి అంతర్జాతీయ కెరీర్​లో తొలి వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అదే ఓవర్ నాలుగో బంతికే వన్​డౌన్​లో వచ్చిన ఒలీ పోప్ (0)ను ఎల్​బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న మరో ఓపెనర్ జాక్ క్రాలీ (42)ని కూడా ఆకాశే పెవిలియన్ చేర్చి, ఇంగ్లాండ్​ను దెబ్బకొట్టాడు.

దీంతో ఇంగ్లాండ్ 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. ఈ క్రమంలో రూట్, జాని బెయిర్​ స్టో (38)తో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ, ఇంగ్లాండ్ స్కోర్ 100 పరుగులు దాటగానే ఈసారి అశ్విన్ బ్రేక్ ఇచ్చాడు. అతడు బెయిర్ స్టోను ఎల్​బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. ఈ తర్వాత వచ్చిన కెప్టెన్ బెన్ స్టోక్స్ (3) కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. జడేజా అతడిని ఔట్ చేశాడు.

అరంగేట్రం అదుర్స్: ఈ మ్యాచ్​తో భారత్ యంగ్ ప్లేయర్ 27ఏళ్ల ఆకాశ్ దీప్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. బుమ్రాకు మేనేజ్​మెంట్ విశ్రాంతి ఇవ్వడం వల్ల ఆకాశ్​కు తుది జట్టులో ఛాన్స్ వచ్చింది. డెబ్యూ మ్యాచ్​లోనే కీలక మూడు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. అతడి దెబ్బకు 60 పరుగులలోపే ఇంగ్లాండ్ టాపార్డర్​ కుప్పకూలింది. తొలి రోజు 17 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆకాశ్ 70 పరుగులిచ్చి 3 వికెట్లు దక్కించుకున్నాడు.

ఎన్నాళ్ల ఎన్నాళ్లకో!: జో రూట్ ఈ సిరీస్​లో తొలిసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్​లో బజ్​బాల్ వ్యూహాన్ని మర్చిపోయి, పూర్తిగా సంప్రదాయ క్రికెట్ ఆడాడు. ఎలాంటి అనవసర షాట్​లకు పోకుండా నిదానంగా ఆడాడు. 219 బంతులు ఆడి అతడు సెంచరీ మార్క్ అందుకున్నాడు. కాగా, టెస్టుల్లో రూట్​కు ఇది 31వ శతకం.

టెస్టుల్లో రూట్ రికార్డ్: ఈ మ్యాచ్​లో సెంచరీతో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో భారత్​పై 10 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్​గా నిలిచాడు. రూట్ తర్వాత ఈ లిస్ట్​లో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ (9), వివ్ విచర్డ్స్ (8), రికీ పాంటింగ్ (8) ఉన్నారు. కాగా, అన్ని ఫార్మాట్​లలో కలిపి రూట్​కు భారత్​పై ఇది 13వ శతకం. ఈ విషయంలో రూట్ కంటే ముందు స్టీవ్ స్మిత్, రికీ పాంటింగ్ చెరో 14 శతకాలతో ముందున్నారు.

భారత్xఇంగ్లాండ్ రాంచీ టెస్టు- సిరీస్​పై టీమ్ఇండియా కన్ను- బుమ్రా స్థానంలో ఎవరంటే?

ఫుల్​ ఫామ్​లో యశస్వి- 500 రన్స్​ క్రాస్- ఈ ఏడాది టాప్ స్కోరర్ల లిస్ట్ ఔట్

Last Updated : Feb 23, 2024, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.