ETV Bharat / sports

ఉప్పల్ వేదికగా అశ్విన్, జడ్డూ రికార్డు - కోపంతో ఊగిపోయిన బుమ్రా!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 7:13 PM IST

Ind Vs Eng 1st Test Day 3 Records : ఉప్పల్ వేదికగా తాజాగా జరిగిన మూడో రోజు మ్యాచ్​లో టీమ్ఇండియా ప్లేయర్లు పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇంతకీ అవేరంటంటే ?

Ind Vs Eng 1st Test Day 3 Records
Ind Vs Eng 1st Test Day 3 Records

Ind Vs Eng 1st Test Day 3 Records : హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్‌ తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్ ఓలీ పోప్‌ (148*) అద్భుత పోరాటం వల్ల ఆ జట్టు కాస్త నిలదొక్కుకోగలిగింది. దీంతో ప్రస్తుతం ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 316/6 స్కోరుతో నిలిచింది. దీంతో ఆ జట్టు ఆధిక్యం 126 పరుగులకు చేరింది. మరోవైపు భారత స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేసి ఇంగ్లీష్​ జట్టును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ ఆట ఎంతో రసవత్తరంగా సాగింది. అయితే ఈ వేదికగా తాజాగా పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే ?

స్టోక్స్‌ బౌల్​కు అశ్విన్ షాక్​ : శనివారం జరిగిన మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టినన సమయానికి ఓపెనర్‌ జాక్‌ క్రాలే(31)ను ఔట్​ చేసి భారత్​కు తొలి వికెట్​ను అందించాడు. ఆ తర్వాతి ఆ తర్వాత బెన్‌ స్టోక్స్‌ను బౌల్డ్‌ చేసి రెండో తన ఖాతాలో వేసుకున్నాడు. అలా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో బెన్​ స్టోక్స్‌ వికెట్​ను పన్నెండు సార్లు పడగొట్టి ఒకే బ్యాటర్‌ను అత్యధిక సార్లు ఔట్​ చేసిన భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు కపిల్‌ దేవ్‌ పేరిట ఉంది. ఆయన పాకిస్థానీ క్రికెటర్ ముదాసర్‌ నాజర్‌ను 12 సార్లు పెవిలియన్‌ బాట పట్టించాడు.

జడ్డూ రేర్​ రికార్డు : మరోవైపు స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా ఓ అరుదైన ఘనత సాధించాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బెయిర్‌ స్టోను ఔట్‌ చేసిన జడ్డూ, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో భారత బౌలర్‌గా రికార్డుకెక్కాడు. అలా భారత మాజీ పేసర్‌ జవగల్ శ్రీనాథ్‌ను జడ్డూ అధిగమించాడు. శ్రీ నాథ్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో 551 వికెట్లు పడగొట్టగా, జడేజా ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో 332 మ్యాచ్‌లు ఆడి 552 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ జాబితాలో 953 వికెట్లతో భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే ఫస్ట్​ ప్లేస్​లో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాన్ని అశ్విన్‌ 723 వికెట్లతో కైవసం చేసుకున్నాడు.

కేఎస్ సలహా - బుమ్రా కోపం!
అయితే ఇదే వేదికపై టీమ్ఇండియా పేసర్​ జస్ప్రీత్‌ బుమ్రా తన సహనాన్ని కోల్పోయాడు. మూడో రోజు ఆట సందర్భంగా భారత వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌పై బుమ్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్​తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ వేసిన బుమ్రా బెన్‌ డకెట్‌కు అద్భుతమైన డెలివరీని సంధించాడు. అయితే ఆ బాల్​ను డకెట్‌ ఆఫ్‌ సైడ్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్సై డకెట్‌ ప్యాడ్‌లకు తగిలింది. దీంతో వెంటనే బౌలర్‌తో పాటు వికెట్‌ కీపర్‌ ఎల్బీకి అప్పీల్‌ చేశాడు. కానీ అంపైర్‌ మాత్రం ఆ బాల్​ను నాటౌట్‌ అంటూ తల ఊపాడు. ఈ క్రమంలో రివ్యూ తీసుకోమంటూ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు బుమ్రా సూచించాడు. అయితే రోహిత్‌ వికెట్‌ కీపర్‌ కేఎస్ భరత్ సలహా ఇచ్చాడు. భరత్‌ మాత్రం బంతి లెగ్‌ సైడ్‌ వెళ్తుందని రోహిత్​తో అన్నాడు. దీంతో రోహిత్‌ రివ్యూ తీసుకోలేదు. అయితే రిప్లేలో మాత్రం బంతి లెగ్‌ స్టంప్‌ను తాకుతున్నట్లు వచ్చింది. ఇది చూసిన బుమ్రా 'నేను చెప్పా కదా అది ఔట్‌ అని' అన్నట్లగా రియాక్టయ్యాడు. అయితే ఆ తర్వాత ఓవర్​లో డకెట్‌ను బుమ్రా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

ముగిసిన మూడో రోజు ఆట - ఆధిక్యంలో ఇంగ్లాండ్

జడ్డూకు అన్యాయం - తెరపైకి మరోసారి డీఆర్‌ఎస్ చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.