ETV Bharat / sports

మరోసారి కప్​పై కన్ను- భారత్‌ Vs ఆసీస్‌- పై చేయి ఎవరిదో ?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 10:20 PM IST

Ind Vs Aus U19 Final
Ind Vs Aus U19 Final

Ind Vs Aus U19 Final : భారత్​, ఆస్ట్రేలియా జట్ల అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఆరోసారి కప్పు ఒడిసిపట్టాలని టీమ్​ఇండియా ఉవ్విళ్లూరుతోంది. అయితే ఇప్పటి వరకు టీమ్ఇండియా ఈ అండర్ 19లో ఎన్ని సార్లు గెలిచిందంటే ?

Ind Vs Aus U19 Final : అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్‌కు అంతా సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఆరోసారి కప్పు ఒడిసిపట్టాలని టీమ్​ఇండియా ఉవ్విళ్లూరుతోంది. గతేడాది నవంబర్ 19న భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్​లో భారత అభిమానులను ఆస్ట్రేలియా కన్నీరు పెట్టించింది. అయితే అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇప్పుడు యువ భారత్‌ సిద్ధమైంది.

ఉదయ్ సహారాన్‌, ముషీర్ ఖాన్‌, సచిన్ దాస్, సౌమ్‌కుమార్ పాండేలతో కూడిన బలమైన టీమ్​ఇండియాను ఓడించడం కంగారులకు అంత తేలిక కాదు. తాము ప్రతీకారం గురించి కానీ గతం గురించి కానీ ఆలోచించడం లేదని తమ దృష్టంతా తుది సమరంలో గెలుపుపైనే ఉందంటూ భారత సారథి ఉదయ్ సహారన్ ఇటీవలే పేర్కొన్నాడు. ఆసీస్‌ జట్టులో కెప్టెన్ హ్యూ వీబ్‌జెన్, ఓపెనర్ హ్యారీ డిక్సన్, సీమర్లు టామ్ స్ట్రాకర్, కల్లమ్ విడ్లర్ నిలకడగా రాణిస్తున్నారు. 2012, 2018ల్లో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా జట్టును టీమ్ఇండియా ఓడించింది.

మరోసారి ఆ ఫలితాన్ని యువ జట్టు పునరావృతం చేయాలని టీమ్​ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు. 2016, 2018, 2020, 2022, 2024లో అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీలో భారత యువ జట్టు వరుసగా ఫైనల్స్​కు చేరింది. 2018, 2022లో ప్రపంచకప్‌ను ఒడిసిపట్టిన టీమ్​ఇండియా 2016, 2020లో మాత్రం ఓటమిని చవి చూసింది. 2024లో కూడా విజయం సాధించి వరుసగా రెండోసారి కప్‌ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించాలని టీమ్​ఇండియా భావిస్తోంది.

మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఫైనల్‌కు చేరిన జట్టు విజేతగా నిలిచిన సందర్భం అండర్‌-19 వరల్డ్‌కప్‌ చరిత్రలో ఒక్కసారి మాత్రమే జరిగింది. పాకిస్థాన్‌ 2004, 2006 ఎడిషన్లలో విజేతగా నిలిచింది. ఇప్పుడు ఈ అవకాశం టీమ్​ఇండియాకు లభించింది. 2022లో గెలుపొందిన భారత్‌ మరోసారి ఫైనల్​లో గెలిచి వరల్డ్‌కప్‌ను ఎగరేసుకుపోవాలని ఉవ్విళ్లూరుతోంది.

ఆసీస్‌పై మరోసారి పైచేయి సాధించి రికార్డు విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. అయితే నాకౌట్ దశలో ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయకూడదని, యువభారత్‌ తమ సత్తాచాటి ప్రపంచకప్‌ సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారత్‌ ఇప్పటివరకూ జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఈ విజయాలు విరాట్ కోహ్లీ, మహమ్మద్ కైఫ్, ఉన్ముక్త్ చంద్, పృథ్వీషా, యశ్ ధుల్‌ సారథ్యంలో దక్కాయి. ఈసారీ కప్‌ కొడితే ఈ జాబితాలోకి ప్రస్తుత అండర్‌-19 జట్టు నాయకుడు ఉదయ్ సహారాన్‌ చోటు దక్కించుకుంటాడు.

ఆ రూమర్స్​లో నిజం లేదు - అండర్‌-19 వరల్డ్‌ కప్​నకు భారత్ ఆతిథ్యం ఎందుకు ఇవ్వట్లేదంటే?

U-19 వ‌ర‌ల్డ్​ క‌ప్​- భారత్​ ఖాతాలో ఐదు టైటిళ్లు- టీమ్​ఇండియా సక్సెస్​ఫుల్ జర్నీ మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.