ETV Bharat / sports

అండర్ 19 వరల్డ్​ కప్​ ఫైనల్​ - టీమ్ఇండియా టార్గెట్ ఎంతంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 5:20 PM IST

Updated : Feb 11, 2024, 6:57 PM IST

Ind Vs Aus U 19 Final
Ind Vs Aus U 19 Final

Ind Vs Aus U 19 World Cup Final : అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టు తమ ఇన్నింగ్స్​ను ముగించుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌ ముందు ఎంత టార్గెట్‌ను ఉంచిందంటే ?

Ind Vs Aus U 19 World Cup Final : అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌ ముందు 254 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాటర్లలో హర్జాస్‌ సింగ్‌ 55, విబ్జెన్‌ 48, డిక్సన్‌ 42, ఓలీవర్‌ ఫికే (46*) పరుగులు చేశారు. సామ్‌ రాఫ్‌ మెక్‌మిలన్‌ 2, కాంస్టాస్‌ 0, ర్యాన్‌ హిక్స్‌ 20, చార్లీ ఆండర్సన్‌ 13 పరగులు చేశారు.

భారత బౌలర్లలో రాజ్‌ లింబానీ 3 వికెట్లు పడగొట్టాడు. అయితే మొత్తం టోర్నీలో ఇప్పటివరకు ఈ స్టార్‌ బౌలర్‌ 11 వికెట్లు తీశాడు. మరోవైపు నమన్‌ తివారీ 9 ఓవర్లలో 63 పరుగులిచ్చి 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. సౌమీ పాండే 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, ఇతడితో పాటు ముషీర్‌ ఖాన్‌ 9 ఓవర్లలో 46 పరుగులిచ్చి 1 వికెట్ తీశారు.

అయితే ఆస్ట్రేలియా నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా ఛేదిస్తే, అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్‌లో 500కు పైగా పరుగుల రికార్డు నమోదవ్వడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా, భారత జట్టు అండర్ 19లో ఇప్పటివరకు 9వ సారి ఫైనల్ మ్యాచ్ ఆడుతుండగా, ఆస్ట్రేలియా 5వ సారి ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది.

Ind Vs Aus U 19 Final Squad :
ఆస్ట్రేలియా U19 (ప్లేయింగ్ XI): హ్యారీ డిక్సన్, సామ్ కొన్‌స్టాస్, హ్యూ వీబ్‌జెన్(కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్(కీపర్), ఆలివర్ పీక్, రాఫ్ మాక్‌మిల్లన్, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్.

ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్(కీపర్), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే.

'నేనైతే అలా అనుకోవట్లేదు'- U 19 భారత్​ కెప్టెన్ ఉదయ్ ఇంట్రెస్టింగ్ రిప్లై

U 19 ఫైనల్స్​లో 'యువ భారత్' ట్రాక్ రికార్డ్​

Last Updated :Feb 11, 2024, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.