ETV Bharat / sports

సెంచరీలతో మ్యాక్సీ సంచలనం​ - దెబ్బకు రోహిత్ రికార్డు సమం

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 7:12 PM IST

Glenn Maxwell
Glenn Maxwell

Glenn Maxwell T20 Record : వెస్డిండీస్‍తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్స్ మ్యాక్స్‌వెల్ మరోసారి మైదానంలో చెలరేగిపోయాడు. బాల్​ను బౌండరీలు దాటించి అందరినీ ఔరా అనిపించాడు.

Glenn Maxwell T20 Record : ఆడిలైడ్ వేదికగా వెస్డిండీస్‍తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్స్ మ్యాక్స్‌వెల్ మరోసారి మైదానంలో చెలరేగిపోయాడు. బాల్​ను బౌండరీలు దాటించి అందరినీ ఔరా అనిపించాడు.

అయితే ఈ సెంచరీతో మ్యాక్సీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 55 బంతుల్లోనే 12 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 120 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్​గా చరిత్రకెక్కాడు. అలా భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (5 శతకాలు) రికార్డును మ్యాక్సీ సమం చేశాడు.

143 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 151 మ్యాచ్‍ల్లో 5 సెంచరీలు చేస్తే, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 94 ఇన్నింగ్స్‌ 101 మ్యాచుల్లో ఈ మార్క్ చేరుకున్నాడు. ఇక ఈ లిస్ట్​లో టీమ్ఇండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. అతడు 57 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు చేసి రెండో స్థానాన్ని చేజిక్కించుకున్నాడు.

మ్యాక్సీ మార్క్​ - 109 మీటర్లపైకి సిక్సర్​
ఇక ఇదే మ్యాచ్​లో మ్యాక్స్‌వెల్ ఓ మాన్‍స్టర్ సిక్స్ కొట్టాడు. అది ఏకంగా 109 మీటర్ల దూరానికి ఓ సిక్స్ బాదేశాడు. విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ వేసిన 12 ఓవర్​లోని రెండో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. దీంతో బంతి రెండో స్టైర్ స్టాండ్స్‌లో పడింది. అలా ఏకంగా 109 మీటర్ల దూరనికి వెళ్లింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే - మ్యాక్స్‌వెల్ సెంచరీతో ఆసీస్​ జట్టు భారీ స్కోర్​ను తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్​కు దిగి 20 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు సాధించింది. ఓపెనర్లుగా దిగిన డేవిడ్ వార్నర్ (22) జోష్​ ఇంగ్లీష్​ (4) నిలకడగా ఆడలేకపోయారు. అయితే ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్, ప్రత్యర్థులను హడలెత్తించాడు. ఇక మ్యాక్సీకి తోడుగా నిలిచిన మిచెల్ మార్ష్ 29 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. అయినప్పటికీ మ్యాక్స్‌వెల్ బాదుడు ఆపలేదు. ఆ తర్వాత వచ్చిన స్టొయినిస్ (16), టిమ్ డేవిడ్ (31) కూడా పర్వాలేదినిపించారు.

ఇక వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టగా, అల్జారీ జోసెఫ్, రొమారియో షెఫర్డ్ చెరో వికెట్ తీశారు. 4 ఓవర్లు వేసిన ఆండ్రీ రసెల్ ఏకంగా 59 పరుగుల సమర్పించుకున్నాడు. ఇప్పుడు వెస్టిండీస్ ముందు 242 పరుగుల భారీ లక్ష్యం ఉంది.

Glenn Maxwell World Cup 2023 : మ్యాక్స్​వెల్​ ఆటంటే అంతే.. దెబ్బకు మైదానం షేక్​..

ఒక్క బాల్​ మూడు రిజల్ట్స్​ - ఆసీస్​ వన్డేలో అరుదైన ఘటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.