ETV Bharat / sports

నెట్​ ప్రాక్టీస్​లో ధోనీ - ఆ బ్యాట్​పైనున్న స్టిక్కర్​ స్పెషాలిటీ ఏంటంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 7:04 PM IST

Dhoni Cricket Bat
Dhoni Cricket Bat

Dhoni Cricket Bat : రానున్న ఐపీఎల్‌ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్​ జట్టు కెప్టెన్​ ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు నెట్​ ప్రాక్టీస్​ చేస్తూ కనిపించాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అతడి ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అయితే అందరి దృష్టిని అతడి బ్యాట్​పై ఉన్న స్టిక్కర్​ ఆకర్షించింది. ఇంతకీ అదేంటంటే ?

Dhoni Cricket Bat : టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీ తాజాగా నెట్​ ప్రాక్టీస్​లో నిమగ్నమయ్యాడు. గత కొంత కాలంగా విశ్రాంతి తీలసుకుంటున్న అతడు మరోసారి తన బ్యాట్​కు పని చెప్పేందుకు సిద్ధమయ్యాడు. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​కు సమయం దగ్గర పడుతుండటం వల్ల ధోనీ ఇప్పుడు తన జట్టు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.

మోకాలి గాయానికి శస్త్రచికిత్స తీసుకున్న ధోనీ కొంత కాలం పాటు రెస్ట్​ తీసుకున్నాడు. ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్​ను స్పెండ్​ చేశాడు. అయితే గతంలో ధోనీ ఇక ఐపీఎల్​కు కూడా రిటైర్మెంట్​ ప్రకటించనున్నాడన్న వార్తలు వచ్చాయి. తాజాగా విడుదలైన చెన్నై సూపర్ కింగ్స్​ రీటైన్​డ్​ ప్లేయర్ల లిస్ట్​లో ఆ రూమర్స్​కు బ్రేక్ పడింది.

ఈ నేపథ్యంలో తాజాగా అతడు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే అందులో ధోనీ ఉపయోగించిన బ్యాట్​పై అందరి దృష్టి పడింది. దానిపై ప్రైమ్‌ స్పోర్ట్స్‌ అనే స్టిక్కర్​ కనిపించింది. దీంతో ఈ కొత్త కంపెనీ ఎవరిదా అంటూ ఫ్యాన్స్​ ఆ కంపెనీ గురించి నెట్టింట తెగ వెతికేశారు. తీరా చూస్తే అది ధోనీ చిన్ననాటి స్నేహితుడు పరమ్‌జిత్ సింగ్‌కు చెందిన స్పోర్ట్స్‌ షాప్‌ను అని తెలిసింది. తన ఫ్రెండ్​ షాప్​ను ధోనీ ఇలా ప్రమోట్‌ చేయడం పట్ల తల ఫ్యాన్స్​ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Dhoni Career : కెరీర్‌ ప్రారంభంలో ధోనీకీ తన స్నేహితులు ఎంతగానో సహకరించారు. ధోనీ కూడా పలు ఇంటర్వ్యూల్లో తరచూ వారి గురించి చెబుతూనే ఉండేవాడు. తాజాగా కూడా చాలా సమయం స్నేహితులతోనే గడిపిన ఫొటోలను షేర్ చేసుకున్నాడు.ఇక 2016లో ధోనీ బయోగ్రఫీగా విడుదలైన 'ఎంఎస్​ ధోనీ ది అన్​టోల్డ్ స్టోరీ' సినిమాలోనూ వీరి స్నేహబంధాన్ని చక్కగా చూపించారు. ఇక రానున్న సీజన్​లో మరింత జోష్​తో ఆడేందుకు సిద్ధంగా ఉన్న ధోనీ, గతేడాది సీఎస్‌కేను విజేతగా నిలిపినట్లుగానే ఈ సారి కూడా కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టి​ ఆ జట్టును ఛాంపియన్‌గా నిలపాలనే లక్ష్యంతో బరిలోకి దిగనున్నాడు.

ధోనీ లాస్ట్ సీజన్!, పంత్ కమ్​బ్యాక్- 2024 IPL మరింత ఆసక్తికరంగా

ధోనీకి పాక్​ నుంచి స్పెషల్ ఇన్విటేషన్ - 'క్రికెట్​ గురించే కాకుండా మరోసారి రావాలి'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.