ETV Bharat / sports

ధోనీ లాస్ట్ సీజన్!, పంత్ కమ్​బ్యాక్- 2024 IPL మరింత ఆసక్తికరంగా

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 6:44 AM IST

2024 IPL Dhoni Interesting things
2024 IPL Dhoni Interesting things

2024 IPL Dhoni: మరికొద్ది నెలల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 17 సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మేటి క్రికెటర్లు ఆడే ఈ టోర్నీలో ఐదు విశేషాలు కోసం తెలుసుకుందాం.

2024 IPL Dhoni: టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఐపీఎల్-2024 జరగనుంది. 17వ సీజన్ ఐపీఎల్ ఎన్నో విశేషాలకు వేదిక కానుంది. మాజీ కెప్టెన్ ధోనీ ఈ సీజన్లోనే తన ఐపీఎల్ కెరీర్​కు ముగింపు పలకనున్నాడనే ప్రచారంతో పాటు స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బరిలో దిగనున్నాడు. అలా రానున్న ఐపీఎల్​లో అందర్నీ ఆకట్టుకునే అంశాలేంటో చూద్దాం.

ధోనీకి ఇదే చివరిది? ఐపీఎల్​లో చెన్నై సూపర్ ​కింగ్స్​కు ఐదు టైటిళ్లు అందించిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి 2024 చివరి లీగ్ అని జోరుగా ప్రచారం సాగుతోంది. 43 ఏళ్ల ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ టోర్నీల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో గత సీజన్లోనే రిటైర్మెంట్ తీసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ, ఈ సీజన్​లోనూ ఆడతానని ప్రకటించడం వల్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మరి ఈ ఏడాది ఐపీఎల్​ పూర్తయ్యాక ధోనీ డొమెస్టిక్ క్రికెట్​కు కూడా గుడ్​బై చెబుతాడా? లేదా అన్నది ఇంట్రెస్టింగ్​గా మారింది.

రిషబ్ పంత్ రీ ఎంట్రీ: దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2022లో రోడ్డు ప్రమాదం గాయపడ్డ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. యాక్సిడెంట్ కారణంగా రిషబ్ పంత్ గతేడాది ఐపీఎల్​ ఆడలేదు. పూర్తిగా కోలుకొని ఫిట్​నెస్ సాధిస్తే 17వ సీజన్లో పంత్​ను మళ్లీ గ్రౌండ్​లో చూడవచ్చు. 2016 ఐపీఎల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి పంత్ దిల్లీ క్యాపిటల్స్ జట్టుతోనే ఉన్నాడు. ఐపీఎల్​లో 98 మ్యాచ్​లు ఆడిన పంత్ 2838 పరుగులు చేశాడు. అయితే పంత్ గైర్హాజరీలో దిల్లీ 2023లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. మరి పంత్ రీ ఎంట్రీతో ఈసారి దిల్లీ ఏమేరకు రాణిస్తుందో చూడాలి.

ముంబయి ఇండియన్స్ కొత్త శకం: రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను నుంచి తప్పించి ముంబయి ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యకు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో ముంబయి ఒక్కసారిగా ఇంటర్నెట్​లో హాట్​టాపిగ్​గా మారింది. అయితే ముంబయిని ఐదుసార్లు ఛాంపియన్​గా నిలిపిన రోహిత్​ను తప్పించడం అతడి ఫ్యాన్స్​కు నచ్చలేదు. మరి రోహిత్ వారసత్వాన్ని హార్దిక్ ఎంతవరకు కొనసాగిస్తాడు? ముంబయిని ఎంత సమర్థంగా నడుపుతాడనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా ముంబయి మేనేజ్​మెంట్ మాత్రం హార్దిక్​పై బాగానే ఆశలు పెట్టుకుంది.

ఆర్సీబీకి కలిసొస్తుందా? ఐపీఎల్​లో అత్యంత ఫ్యాన్​బేస్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఈ జట్టులో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉండడం కూడా ఇందుకు ఒక కారణం. గత 16 సీజన్​లో వరల్డ్​ టాప్ క్లాస్ ప్లేయర్లు డివిలియర్స్, గేల్, డూప్లెసిస్, వెట్టోరి, అనిల్ కుంబ్లే, మ్యాక్స్​వెల్, దినేశ్ కార్తిక్ అలా అనేక మంది ఆర్​సీబీకి ప్రాతినిధ్యం వహించారు. అయినప్పటికీ ఆర్​బీసీ ఇప్పటి వరకు ఛాంపియన్​గా నిలవలేదు. ఈసారైనా బెంగళూరు టైటిల్ సాధిస్తుందా లేదా చూడాలి.

గంభీర్ బ్యాక్​ టు కేకేఆర్: గత కొన్ని సీజన్​లుగా కోల్​కతా నైట్​రైడర్స్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. స్టార్ బ్యాటర్ గౌతమ్ గంభీర్ కేకేఆర్​లో ఉన్నప్పుడు టాప్​లో కొనసాగిన కేకేఆర్ ఆతడి రిటైర్మెంట్​ తర్వాత పెద్ద విజయాలు సాధించలేదు. అయితే ఈసారి గంభీర్ మళ్లీ కేకేఆర్ జట్టుతో చేరాడు. మెంటార్​గా కోల్​కతాకు సేవలందించనున్నాడు. అయితే గంభీర్ తిరిగి తమ జట్టులోకి రావడం వల్ల కేకేఆర్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలౌతున్నారు. మరి గంభీర్ రాకతో ఈసారి కేకేఆర్ ఎలా ఆడుతుందో?

2024 టీమ్ఇండియా మేజర్ ఈవెంట్స్​- అందరి చూపు వీటిపైనే!

2024 IPLకు హార్దిక్ డౌటే!- ఆందోళనలో ముంబయి ఫ్రాంచైజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.