ETV Bharat / sports

బీసీసీఐ షాకింగ్ డెసిషన్- మూడో టెస్టుకు బుమ్రాకు దూరం!- ఎందుకంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 9:15 PM IST

Updated : Feb 5, 2024, 9:27 PM IST

Bumrah Rested For Third Test: భారత్- ఇంగ్లాండ్ టెస్టు సిరీస్​లో టీమ్ఇండియా కీ ప్లేయర్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే?

Bumrah Rested For Third Test
Bumrah Rested For Third Test

Bumrah Rested For Third Test: ఇంగ్లాండ్​తో రెండో టెస్టులో భారత్​ విజయంలో పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి యార్కర్ కింగ్ బుమ్రా 9 వికెట్లు నేలకూల్చి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ప్రమాదకరమైన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్​ స్టోక్స్​ను రెండు ఇన్నింగ్స్​ల్లో బుమ్రానే పెవిలియన్ చేర్చి టీమ్ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్ 1-1తో సమమైంది. ఇక రెండుజట్లు తదుపరి మ్యాచ్​పై దృష్టి పెట్టాయి. అయితే ఇలాంటి సమయంలో ఈ స్టార్ పేసర్ మూడో టెస్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కారణం ఏంటంటే?

ఫిబ్రవరి15నుంచి రాజ్​కోట్ వేదికగా మూడో టెస్టు జరగనుంది. అంటే ఇప్పటినుంచి 10రోజుల గ్యాప్ ఉంది. అయితే మరో ఐదు రోజులు పొడగించి బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని మేనేజ్​మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూడో టెస్టుకు విశ్రాంతినిచ్చి చివరి రెండు టెస్టులకు ఫ్రెష్​గా మళ్లీ బరిలో దింపాలన్న ప్లాన్​లో ఉందట. తొలి రెండు టెస్టుల్లో కలిపి బుమ్రా 57.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. రెండు జట్లలో కలిపి మరే ఫాస్ట్ బౌలర్ కూడా ఇన్ని ఓవర్లు బౌలింగ్ చేయలేదు. అయితే రెండో టెస్టులో బెంచ్​కు పరిమితమైన మహ్మద్ సిరాజ్​ను బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చివరి మూడు టెస్టులకు టీమ్ఇండియా జట్టును ప్రకటించాల్సి ఉంది.

Bumrah Test Career: రెండు టెస్టుల్లో కలిపి బుమ్రా 14 మెయిడెన్ ఓవర్లు వేశాడు. ఇక 10.66 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్​లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కూడా బుమ్రానే. ఇక రెండో టెస్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన బుమ్రాకే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇక ఈ టెస్టులోనే బుమ్రా టెస్టు కెరీర్​లో అరుదైన మైలురాయి అందుకున్నాడు. అతడు టెస్టుల్లో ఇప్పటివరకు 34 మ్యాచ్​ల్లో 155 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తన కెరీర్​లో ఇప్పటివరకు 10సార్లు 5+ వికెట్ల ప్రదర్శన చేశాడు.

బుమ్రా బౌలింగ్​ దెబ్బ - బ్యాట్‌ కిందపడేసిన బెన్‌స్టోక్స్‌

రఫ్పాడించిన బుమ్రా- ఇంగ్లాండ్ 253 ఆలౌట్- 171 రన్స్​ లీడ్​లో భారత్

Last Updated : Feb 5, 2024, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.